Widgets Magazine

బరితెగించేస్తున్న 'ఫెయిర్ అండ్ లవ్లీ భామలు'... ఐనా పట్టించుకోవడంలేదట...

శనివారం, 24 ఫిబ్రవరి 2018 (17:11 IST)

pooja hegde

'ఫెయిర్ అండ్ లవ్లీ భామలు' అంటే ఎవరు అనుకుంటున్నారా?? అదెవరో కాదండి.. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్ అడ్వైర్టైజ్‌మెంట్‌లో వచ్చే నటీమణులు 'యామీ గౌతమ్', 'పూజా హెగ్డే'. ఇద్దరూ అందగత్తెలే అయినప్పటికీ వారు నటించిన సినిమాలు తగిన స్థాయిలో ఆడటం లేదు. కెరీర్ ప్రారంభంలోనే హిందీలో 'హృతిక్ రోషన్' ప్రక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామలకు చేదు అనుభవమే మిగిలింది. అందులో యామీ గౌతమ్ 'కాబిల్' అనే చిత్రంలో, పూజా హెగ్డే 'మొహెంజోదారో' అనే చిత్రాల్లో హృతిక్ సరసన నటించినప్పటికీ సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. 
 
తెలుగులోనూ అడపాదడపా నటించిన ఈ ముద్దుగుమ్మలకు ఇక్కడా చేదు అనుభవమే మిగిలింది. యామీ గౌతమ్ తెలుగులో 'కొరియర్‌ బాయ్ కళ్యాణ్' చిత్రంలో నితిన్ సరసన నటించింది. పూజా హెగ్డే 'ముకుందా', 'ఒక లైలా కోసం' మరియు 'డీజే' సినిమాలలో కనిపించింది. పైగా 'డీజే' సినిమాలో బికినీ వేసి కుర్రకారుని ఊరించేసింది. ఆ సినిమాలో ఎక్స్‌పోజింగ్ శృతిమించిపోయిందంటే అతిశయోక్తి కాదు.
 
ఇన్ని చేసినా ఆ సినిమా విజయవంతం కాలేదు. ఆ దెబ్బకు పూజాకు సినిమాలు కరువై సినీ ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఇక యామీ గౌతమ్ అయితే ఏకంగా మగాళ్ల మేగజిన్ మ్యాక్సిమ్ కవర్‌ పేజీపై అర్థ నగ్నంగా ఫోజులిచ్చింది. ఈ భామలను ఆదుకునే నిర్మాతలు, దర్శకులు ఎవరోగానీ, ఇప్పుడైతే మాత్రం పూర్తిగా సినీ అవకాశాల కోసం ఇలా ఫోజులివ్వడంతో బీటౌన్‌తో పాటుగా అభిమానులు సైతం విస్తుపోతున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీకాంత్ "కాలా" టీజర్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". పా. రంజిత్ దర్శకత్వంలో ...

news

మనిషి కాదు... రాక్షసుడు.. బాలిక పొట్టపై కాలుపెట్టి... (వీడియో)

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతర్ ఓ హృదయ విదారక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ ...

news

స్టిల్.. ఐ యామ్ వర్జిన్ అంటున్న బాలీవుడ్ భామ.. ఎవరు?

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే భామలు ఎంతో బోల్డ్‌గా ఉంటారు. అదేసమయంలో వారు వివిధ అంశాలపై చేసే ...

news

కన్నుకొట్టిన ప్రియా... నవ్వుకున్న సుప్రీం జడ్జీలు

మలయాళ కుట్టిన ప్రియా వారియర్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆమె నటించిన 'ఒరు అదార్ ...

Widgets Magazine