Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చరిత్రలో 'బాహుబలి' ఏ చేశాడో తెలుసా...?

శుక్రవారం, 19 మే 2017 (15:42 IST)

Widgets Magazine

ఏ కథకైనా స్ఫూర్తి కావాల్సిందే. ఏ రచయిత అయినా ఏదో ఒక సంఘటనను లేదా చరిత్రలోని విషయాన్ని చూసి స్ఫూర్తి పొంది ఓ కథను రాసేస్తారు. రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్ బాహుబలి విషయంలోనూ ఇదే జరిగిందా అనే చర్చ నడుస్తోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సింగిల్ పాయింట్‌ను పట్టుకుని పెద్ద కథను అల్లడంలో దిట్ట. ఆయన ఈ కథ విషయంలో ఎక్కువగా భారతదేశ గత వైభవం, పూర్వపు రాజుల పరిస్థితులు, రాజ్యాలు... ఇత్యాది అంశాల స్ఫూర్తిగా కథను తయారుచేసుకున్నారనేది చిత్రం చూస్తే అర్థమవుతుంది. 
 
ఆ మాటకొస్తే బాహుబలి 2 కంక్లూజన్ ఇంటర్వెల్ కార్డ్ పడేటప్పుడు భళ్లాలదేవ రాజుగా ప్రమాణస్వీకారం, బాహుబలి ప్రమాణం పండించడానికి ఎలా వుంటే బావుంటుందబ్బా అనకుంటుండగా పవన్ కల్యాణ్ సభ గర్తుకు వచ్చిందట. దాన్ని స్ఫూర్తిగా తీసుని సీన్ లాగించేసినట్లు చెప్పారు. అలాగే బాహుబలి చిత్రం కూడా చరిత్రలో వున్నదని చర్చ జరుగుతోంది. 
 
కాస్త లోతుగా వెళితే.... జైనిజం వ్యవస్థాపకుడైన రిషభకు ఇద్దరు కుమారులుండేవారు. వారిలో పెద్దవాడు జడభారత, రెండోవాడు బాహుబలి. 10వ శతాబ్దంలో జరిగిన ఈ యధార్థ గాధ ప్రకారం... చక్రవర్తి రిషభ తన ఇద్దరు కుమారులకు రాజ్యాన్ని సమానంగా పంచాడు. ఉత్తర భారతదేశాన్ని జడభారతకు అప్పగించి దక్షిణ భారతదేశాన్ని బాహుబలికి ఇచ్చాడు. కొన్ని కారణాల వల్ల ఇద్దరు కుమారులు యుద్ధంలో తలపడాల్సి వచ్చింది. యుద్ధంలో ఎవరైతే విజయం సాధిస్తారో అతడికే రాజ్యాన్నంతా కట్టబెడతారు. 
prabhas
 
ఐతే శాంతిని కోరుకునే బాహుబలి మాత్రం యుద్ధానికి అంగీకరించడు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్న ఉద్దేశంతో రాజ్యాన్నంతా తన సోదరుడు జడభారతుడికి దారాదత్తం చేసేస్తాడు. అలా బాహుబలి ప్రజల చేత దేవుడుగా కొనియాడబడతాడు. ఆయనే దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, కేరళలో దర్శనమిచ్చే గోమటేశ్వరుడు అంటారు. దిగంబరుని రూపంలో ఎత్తయిన శిల్ప రూపంలో కనిపించే గోమటేశ్వరుడే బాహుబలి అని చరిత్ర చెపుతోంది. ఐతే బాహుబలి చిత్రం కోసం స్ఫూర్తి పొందివుండవచ్చు కానీ దాన్ని అత్యద్భుతంగా రాయడం, తెరకెక్కించడం విజయేంద్రప్రసాద్, రాజమౌళికే చెల్లింది. ఇది ఎవ్వరికీ సాధ్యం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో?!!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును (మే 19) పురస్కరించుకుని.. ఆయన నటిస్తున్న జై లవకుశకు ...

news

"బాహుబలి 2"ను తెగ చూస్తున్నారు.. ఆందోళన చేయండి : కన్నడవాసులకు రాంగోపాల్ వర్మ పిలుపు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా కర్నాటక రాష్ట్ర ...

news

పవన్ కళ్యాణ్ బాటలో హృతిక్ రోషన్... మాజీ భార్య కోసం అలా చేస్తున్నాడు...

సినిమావాళ్ల ప్రేమలు, పెళ్లిళ్లు, విడిపోవడాలు... మళ్లీ కలిసిపోవడాలు చూస్తుంటే... సమాజం ...

news

#1500CroreBaahubali : రిమార్కబుల్ మైల్‌స్టోన్.. థ్యాంక్స్‌ టు ఎవ్రివన్... బాహుబలి టీమ్

సరిగ్గా మూడంటే మూడు వారాల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి: ది కన్ క్లూజన్' ...

Widgets Magazine