Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నటి సనూష పెదవులను తాకాడు.. రైలులో నిద్రిస్తున్నప్పుడు.. ఏ ఒక్కరూ?

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (12:07 IST)

Widgets Magazine

మొన్నటికి మొన్న భావన, నిన్నటికి నిన్న అమలా పాల్ లైంగిక వేధింపులకు గురైయ్యారు. నేడు మలయాళ యంగ్ హీరోయిన్ సనూషా అత్యాచార వేధింపులకు గురైంది. నటి అమలాపాల్‌ను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యాపారవేత్తను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మరవకముందే  రైలులో నిద్రిస్తున్న సమయంలో సనూషపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి.
 
ఈ ఘటన కున్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న రైలులో చోటుచేసుకుంది. రైలులో ప్రయాణం చేస్తున్న సనూషపై తమిళనాడుకు చెందిన వ్యక్తి ఆంటోబోస్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో వేధించాడు. దీనిపై టీటీఈకీ ఫిర్యాదు చేసింది. వెంటనే రైల్వే పోలీసులు ఆంటోబోస్‌ను అరెస్ట్ చేశారు. ఇకపోతే.. నటి సనూషా మలయాళ నటి. ఈమె తమిళంలో రేణిగుంట, చిత్రాల్లో నటించిది. ఇటీవల శశికుమార్‌ చిత్రం కొడివీరన్‌లోనూ నటించింది. 
 
తనకు ఎదురైన ఘటనపై సనూష సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో తన పెదవులను 40 ఏళ్ల వ్యక్తి తాకాడని, వెంటనే మేల్కొన్నానని.. లైట్ వేసి.. అతని చెయ్యి పట్టుకున్నానని తెలిపింది. ఆపై తాను చైన్ లాగి రైలును ఆపానని చెప్పింది. ఆ సమయంలో రైలులో ఎంతోమంది ప్రయాణికులున్నా ఎవ్వరూ పట్టించుకోలేదని, అపర్ బెర్త్‌లో వుండి.. తనను వేధించిన వ్యక్తిని పోలీసులకు పట్టించేందుకు ఉన్ని అనే రచయిత, రంజిత్ అనే వ్యక్తులు తనకు సాయం చేశారని వెల్లడించింది. 
 
మహిళలు ఇలాంటి వేధింపులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని.. సమాజంపై నమ్మకం పోయిందని.. మహిళలే ధైర్యంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనాలని పిలుపునిచ్చింది. పోలీసుల జోక్యంతో వ్యక్తి అరెస్టయ్యాడని, తన కుటుంబం తనకు అండగా నిలిచిందని సోషల్ మీడియాలో సనూష చెప్పుకొచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లి పీటలెక్కనున్న శ్రియా... వరుడు ఎవరంటే?

టాలీవుడ్ సీనియర్ నటి శ్రియ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తెలుగుతో పాటు.. ఇతర భాషల్లో ఆమెకు ...

news

చిరంజీవితో కుదరలేదు.. నాగార్జునతో ధనుష్ సినిమా..?

టాలీవుడ్ అగ్రహీరో, కింగ్ నాగార్జున కోలీవుడ్ యువ హీరో, దర్శకుడు, తమిళ సూపర్ స్టార్ ...

news

దివ్య ఉన్ని రెండో వివాహం చేసుకుంది.. ఫోటోలు

ఇల్లాలు ప్రియురాలు సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ''దివ్య'' మలయాలంలో అగ్రహీరోల సరసన ...

news

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలకృష్ణ- ఎన్టీఆర్ బయోపిక్‌లో?

నందమూరి హీరో బాలకృష్ణ కుడిభుజానికి శనివారం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిన సంగతి ...

Widgets Magazine