శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (16:31 IST)

అల్లు అర్జున్ సినిమాలో ఎమ్మెల్యేగా కేథరిన్ : టాపు లేచిపోద్దా..?!

అల్లు అర్జున్ ప్రస్తుతం సరైనోడు సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. బోయపాటి శీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం. సరైనోడులో కేథరిన్ ఎమ్మెల్యేగా కనిపించనుందని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో సరైనోడు సినిమాను నిర్మిస్తున్నారు. 
 
ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. సీనియర్ నటులు శ్రీకాంత్, రాజీవ్ కనకాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. కేథరిన్ ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో బన్నీతో నటించింది. వీరిద్దరూ స్టెప్పులేసిన టాపులేచిపోద్ది సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ లభించింది. మధ్య అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిగా రుద్రమదేవిలో నటించాడు. ఈ చిత్రంలోనూ కేథరిన్ నటించింది. రుద్రమదేవికి తర్వాత అల్లు అర్జున్‌తో హీరోయిన్‌గా కేథరిన్ మూడోసారి నటించబోతుండటం గమనార్హం.