Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజనీకాంత్ పార్టీలోకి ఆర్కే.రోజా...?

ఆదివారం, 9 జులై 2017 (15:15 IST)

Widgets Magazine

వైసిపి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో చివాట్లు తిని పార్టీని మారాలనుకున్న ఆర్కే.రోజా చివరకు తెలుగు రాజకీయాలకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా తన వారికి చెప్పినట్లు సమాచారం. ఏపీలో రాజకీయాలపై విసిగిపోయిన రోజా బుల్లితెర కార్యక్రమాలపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వైసిపి కార్యక్రమాలకు కూడా తక్కువగానే ఆమె హాజరవుతున్నారు. ప్రధాన కార్యక్రమాలకు మాత్రమే రోజా హాజరవుతున్నారు. గుంటూరులో జరిగిన ప్లీనరీలో రోజా హాజరయ్యారు. ముఖ్యమైన కార్యక్రమాలు తప్ప మిగిలిన ఏ కార్యక్రమాలకు ఆమె వెళ్ళడం లేదు.
 
అధినేతతో విభేధాలకు ప్రధాన కారణం ఆమె చేసే వ్యాఖ్యలేనన్నది అందరికీ తెలిసిందే. రోజా చేసే వ్యాఖ్యలు జగన్‌ను అప్పుడప్పుడు ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. సమాధానాలు చెప్పలేక జగన్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. గత కొన్నినెలలుగా రోజా వైసిపిలో రెండవ స్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నాలు కూడా చేయడం ప్రారంభించారు. అయితే రోజా ఆ స్థాయికి వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు. అందుకే ఆమెను కొంతమంది నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు. జగన్‌తో ఎక్కువ సన్నిహితం కాకుండా జాగ్రత్తపడ్డారు.
 
ఇదంతా రోజాకు స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికే ఏపీలో కొన్ని పార్టీలో ఉండి ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయిన రోజా ఇక వైసిపిని వదిలి తమిళరాజకీయాల వైపు వెళ్ళాలనేది ఆమె ఆలోచనట. రోజా తమిళనాడు రాజకీయాలనే ఎందుకు ఎన్నుకుంటున్నారంటే అందుకు ఒక కారణముంది. ప్రస్తుతం నగరి నియోజవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు రోజా. నగరిలో దాదాపు 70 శాతం మంది తమిళులే. తమిళ ప్రజలు రోజాను ఆదరిస్తున్నారు. తమిళ రాజకీయ పార్టీ అయినా నగరి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చనేది ఆమె ఆలోచన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట.
 
ఇప్పటికే తమిళ తలైవా రజినీ రాజకీయాల్లోకి రావాలని, సొంత పార్టీ పెట్టాలన్న నిర్ణయం తీసుకోవడంతో ఇక రోజా ఆ పార్టీలోకి వెళ్ళాలన్న నిర్ణయం తీసేసుకున్నారట. రజినీ - రోజాలు మంచి స్నేహితులు. రోజా తన పార్టీలోకి వస్తానంటే రజినీ కాదనరు. ఆ నమ్మకాన్ని రోజా తన వారి వద్ద వ్యక్తం చేశారట. మరి చూడాలి రోజా తమిళ రాజకీయాల్లోకి వెళతారా లేదా అన్నది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అదే బెట్టరంటున్న శ్వేతాబసు...!

ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ కొంతమంది విటులతో అడ్డంగా దొరికిపోయి ఆ తర్వాత సినిమా ఛాన్సులు ...

news

అఖిల్‌ను వెంటాడుతున్న దురదృష్టం... రెండో చిత్రానికి అడ్డంకులు?

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని. ఈ యువ హీరో "అఖిల్" చిత్రం ద్వారా ...

news

నెట్‌లో రజనీ హీరోయిన్ టాప్‌లెస్ ఫోటోల వైరల్...

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ...

news

రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఖరారు?.. హీరోగా జూ.ఎన్టీఆర్?

'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ...

Widgets Magazine