శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 17 జనవరి 2017 (13:00 IST)

జైరా... నువ్వు ప్రపంచానికే రోల్ మోడల్... 'దంగల్' గర్ల్ పైన అమీర్ ఖాన్ ట్వీట్

దంగల్ చిత్రంలో నటించిన 16 ఏళ్ల బాలిక వసీం జైరా కాశ్మీర్ వేర్పాటువాదులకు క్షమాపణలు చెప్పిన నేపధ్యంలో అమీర్ ఖాన్ స్పందించారు. జైరా... నువ్వెరికీ క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు... నువ్వు దేశానికే కాదు ప్రపంచానికే రోల్ మోడల్ వి అంటూ ట్వీట్ చేశారు. 16 ఏళ్ల

దంగల్ చిత్రంలో నటించిన 16 ఏళ్ల బాలిక వసీం జైరా కాశ్మీర్ వేర్పాటువాదులకు క్షమాపణలు చెప్పిన నేపధ్యంలో అమీర్ ఖాన్ స్పందించారు. జైరా... నువ్వెరికీ క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు... నువ్వు దేశానికే కాదు ప్రపంచానికే రోల్ మోడల్ వి అంటూ ట్వీట్ చేశారు. 16 ఏళ్ల అమ్మాయి స్వేచ్ఛగా తన భావాలను వెల్లడించుకుంటే దానిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ట్వీట్ చేశారు.
 
కాగా దంగల్ చిత్రంలో నటించిన 16 ఏళ్ల బాలిక వసీం జైరా తన సినిమా ఇచ్చిన కిక్కుతో చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. దంగల్ సూపర్ సక్సెస్ నేపధ్యంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సినిమాలో తన పాత్రను కాశ్మీర్ అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. దీనితో కాశ్మీర్ వేర్పాటువాదులు మండిపడ్డారు. 
 
వేర్పాటువాదుల హెచ్చరికలతో వెంటనే తను చేసిన వ్యాఖ్యలను వాపసు తీసుకోవడంతోపాటు క్షమాపణలు చెపుతున్నట్లు బహిరంగ లేఖను విడుదల చేసింది జైరా. తన ప్రవర్తన ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించాలని వేడుకుంది. అంతేకాకుండా... కాశ్మీరీ యువతకు రోల్ మోడల్‌గా చిత్రంలో నన్ను చూపించారనీ, ఐతే ఆ పాత్రలో తను వున్నట్లుగా ఎవరూ స్ఫూర్తిగా తీసుకోవద్దని తెలిపింది. 
 
తనను ఓ రోల్ మోడల్‌గా కూడా పెట్టుకోవద్దనీ, తను 16 ఏళ్ల అమ్మాయిననీ, తన వయసును దృష్టిలో పెట్టుకుని తను చేసిన వ్యాఖ్యలను చూడాలంటూ జైరా వేడుకుంది. జైరాను ఇలా బలవంతంగా క్షమాపణలు చెప్పించడంపై పలువురు సెలబ్రిటీలు మండిపడుతున్నారు. అనుపమ్ ఖేర్ అయితే తన రోల్ మోడల్ జైరా అంటూ ట్వీట్ చేశారు. దంగల్’ సినిమాలో రెజ్లర్ గీత పొగట్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించిన జైరా సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్.