గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2015 (18:30 IST)

జయంత్‌ సి. పరాన్జీ 'లవ్‌ 4 ఎవర్‌' షూటింగ్ పూర్తి

'ప్రేమించుకుందాం రా..', 'ప్రేమంటే ఇదేరా', 'బావగారూ బాగున్నారా', 'ఈశ్వర్‌', 'టక్కరిగొంగ', 'శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌', 'లక్ష్మీనరసింహ' వంటి హిట్‌ చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకుల ఆదరాభిమానులు అందుకున్న ప్రముఖ దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ ఎస్‌వికె సమర్పణలో లాఫింగ్‌ వాటర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం 'లవ్‌ 4 ఎవర్‌' షూటింగ్‌ పూర్తయింది.

ఈ సందర్భంగా దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''న్యూజిలాండ్‌లో బృంద నృత్య దర్శకత్వంలో నాలుగు పాటల్ని తీశాం. అలాగే హీరో హీరోయిన్స్‌ పాల్గొనే కొన్ని ఇంపార్టెంట్‌ సీన్స్‌ తీశాం. న్యూజిలాండ్‌ షెడ్యూల్‌లో 75 శాతం చిత్రం పూర్తయింది. హైదరాబాద్‌ , ముంబాయ్‌లలో జరిగిన షెడ్యూల్స్‌తో చిత్ర నిర్మాణం పూర్తయింది. 'ఢిల్లీబెల్లి' ఫేం రామ్‌సంపత్‌ ఈ చిత్రం కోసం ఆరు సూపర్‌హిట్‌ సాంగ్స్‌ అందించారు.

ఈ లవ్‌స్టోరీకి రామ్‌సంపత్‌ మ్యూజిక్‌ పెద్ద ఎసెట్‌. అన్ని సాంగ్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికాపదుకొనే స్పెషల్‌ సాంగ్‌ ఈ చిత్రానికి ఓ హైలైట్‌. ద్రాక్ష తోటల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఇంట్రెస్టింగ్‌ లవ్‌స్టోరీ ఇది. ఈ చిత్రం కోసం ఫ్రెష్‌గా వుండే హీరో, హీరోయిన్స్‌ కోసం చాలా అన్వేషించాం. దాదాపు 400 మంది అమ్మాయిలకు స్క్రీన్‌ టెస్ట్‌ చేశాక మృదుల అనే అమ్మాయిని హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశాం. టీనేజ్‌లో వుండే ఇన్నోసెన్స్‌ మృదుల ఫేస్‌లో బాగా కనిపిస్తుంది. అందుకే ఈ క్యారెక్టర్‌కి మృదులని పెట్టాం.

హీరో రణదీప్‌ ఇతను ఇంతకు ముందెప్పుడే కెమెరాని ఫేస్‌ చేయలేదు. మృదుల చైల్డ్‌ ఆర్టిస్టుగా మూడు నాలుగు హిందీ సినిమాల్లో నటించింది. రణదీప్‌కి మాత్రం ఇదే ఫస్ట్‌ ఫిలిం. లవ్‌ స్టోరీస్‌ ఇంతకు ముందు చాలా వచ్చాయి. కానీ, లవ్‌ గురించి ఓ కొత్త యాంగిల్‌లో చెప్పే సినిమా ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ గురించి నా అభిప్రాయం ఏమిటో అది ఈ సినిమా ద్వారా ఆడియన్స్‌కి చెపుతున్నాను.

ఇంతకుముందు నేను దర్శకత్వం వహించిన సినిమాలు ప్రాజెక్ట్‌ ఓరియంటెడ్‌ ఫిలింస్‌. అంటే హీరో హీరోయిన్స్‌కి తగినట్లుగా కథను సెట్‌ చేసిన సినిమాలు. 'లవ్‌ 4 ఎవర్‌' చిత్రం నా హృదయంలో నుంచి వచ్చింది. ఈ సినిమాకి మూల కథ నాదే. రెండు ప్యూర్‌ హార్ట్స్‌ మధ్య జరిగే సెన్సిటివ్‌ లవ్‌ స్టోరీ ఇది. దర్శకుడిగా ఈ చిత్రం నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది. అందమైన ఈ సబ్జెక్ట్‌ని మరింత అందంగా స్క్రీన్‌మీద చూపించాలంటే ఫోటోగ్రఫీ ఎక్స్‌లెంట్‌గా వుండాలి. అందుకే ఇండస్ట్రీకీ దూరంగా కెనడాలో సెటిల్‌ అయిన జైనన్‌ విన్సెంట్‌ను ఈ సినిమా ఛాయాగ్రహణం చేయిస్తున్నాను.

సబ్జెక్ట్‌ విని ఇన్‌స్పైర్‌ అయి జైనన్‌ విన్సెంట్‌ వర్క్‌ చెయ్యడానికి ఇమీడియట్‌గా అంగీకరించారు. జైనన్‌కి నా సినిమాలు 'ప్రేమంటే ఇదేరా', 'టక్కరిదొంగ' చిత్రాలకు రెండు సార్లు నంది అవార్డులు వచ్చాయి. 'లవ్‌ 4 ఎవర్‌' ఫొటోగ్రఫీకి ముచ్చటగా మూడోసారి మరోసారి నంది అవార్డు వస్తుంది. అంటే ఫొటోగ్రఫీ ఈ సినిమాలో అంత బాగుంటుంది. డిసెంబర్‌ చివరివారంలో ఆడియో రిలీజ్‌ చేసి, వాలెన్‌టెన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలన్నది నా ప్లాన్‌. తెలుగు, హిందీ బాషల్లో ఈ చిత్ర నిర్మాణం అవుతోంది. 'లవ్‌ 4 ఎవర్‌' అన్ని విధాలా నాకు హ్యాపీ ప్రాజెక్ట్‌ అవుతుంది'' అన్నారు.

రణదీప్‌, మృదుల హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్న 'లవ్‌ 4 ఎవర్‌' చిత్రంలో దీపికాపదుకొనే స్పెషల్‌ సాంగ్‌ ఓ ప్రత్యేక ఆకర్షణ. ఫరిదాజలాల్‌, జయంత్‌కృపలాని, సివిఎల్‌, నితిన్‌నయ్యర్‌ నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అన్వితదత్‌, జయంత్‌ సి.పరాన్జీ, మాటలు, పాటలు: రెహమాన్‌, సంగీతం: రామ్‌సంపత్‌, ఫొటోగ్రఫీ: జైనన్‌ విన్సెంట్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, డాన్స్‌: బృంద, అహమద్‌ఖాన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సుమంత్‌ సి. పరాన్జీ, అంజలా ఝవేరి, న్రిర్మాత: ఎస్‌.వి.కె. స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జయంత్‌ సి.పరాన్జీ.