శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:39 IST)

ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై 'జైహింద్‌2'.. ఫైట్స్ అదిరిపోతాయ్: అర్జున్

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా శ్రీరామ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'జైహింద్‌2'. సుర్విన్‌ చావ్లా, చార్లెట్‌ క్లారి హీరోయిన్లు. అర్జున్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అర్జున్‌ జన్యా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం  హైదరాబాద్‌లో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా ఆడియో విడుదలను డిఫెరెంట్‌గా చేయాలని అనుకున్నాను. అందుకనే ఒక రియల్‌ హీరోని గౌరవించాలని నారాయణ్‌ కృష్ణన్‌ గారిని ఈ వేడుకకి ఆహ్వానించాం. ఆయన స్టార్‌ హోటల్‌లో చెఫ్‌గా పనిచేసేవారు. సమాజానికి సేవ చేయాలని ఉద్యోగాన్ని వదిలిపెట్టి అక్షయ ట్రస్ట్‌ను స్థాపించి సేవచేస్తున్నారు. అందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. 
 
ఈ సినిమా విషయానికి వస్తే దర్శకుడు, నిర్మాత, నటుడు, రచయితగా నేను పనిచేశాను. ఒక నిర్మాతగా సినిమాని ఎంత గ్రాండ్‌గా తీయాలో అంత గ్రాండ్‌గా తీశాను. దర్శకుడిగా కూడా బాగా ప్రెజెంట్‌ చేశాననే అనుకుంటున్నాను. 
 
ఫైట్స్‌ విషయానికి వస్తే నా గత చిత్రాల ఫైట్స్‌ అన్నీ ఒక వైపుంటే ఈ సినిమా ఫైట్స్‌ మరో వైపు నిలుస్తాయి. ఈ సినిమాలో ఎమోషనల్‌ క్యారెక్టర్‌ చేశాను. అర్జున్‌ జన్యా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. అలాగే శ్రీవల్లిగారు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. మంచి టెక్నికల్‌ టీమ్‌ పనిచేసింది.
 
ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, బ్యాంకాక్‌, సింగపూర్‌, యు.కె దేశాల్లో ఈ సినిమాని చిత్రీకరించాం. ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై ఈ సినిమా కథాంశం నడుస్తుంది. ఈ సినిమా అందరికి నచ్చుతుంది'' అన్నారు.
 
బ్రహ్మానందం మాట్లాడుతూ ''అర్జున్‌ సినిమాలోని ఆటు పోట్లు తెలిసిన వ్యక్తి. నటనలో సెల్ఫ్‌ జడ్ట్‌మెంట్‌ ఉన్న హీరో. ఈ సినిమాలో నేను, అలీ కలిసి కామెడి ట్రాక్‌ చేశాం. పర్సస్‌ఫుల్‌ కామెడి చేశాం. అర్జున్‌ మంచి నటుడే కాదు. మంచి దర్శకుడు. అంతే కాకుండా మంచి హ్యుమన్‌ బీయింగ్‌. మంచి సోషియల్‌ కాస్‌తో తీసిన ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి'' అన్నారు.
 
దిల్‌రాజు మాట్లాడుతూ ''నాకు తెలిసినప్పట్నుంచి అర్జున్‌ సినిమాలను ప్రేక్షకుడిగా చూశాను. ఆయన నాకు ముప్పై సంవత్సరాలుగా తెలుసు. తను సక్సెస్‌ఫుల్‌ హీరోగా నిలబడ్డారు. మా బ్యానర్‌లో రామ రామ కృష్ణ కృష్ణ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఆయనతో ట్రావెల్‌ చేసే అవకాశం కలిగింది. ఇలాంటి సోషల్‌ కాస్‌ ఉన్న సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై తీసిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలి'' అన్నారు.
 
కోడిరామకృష్ణ మాట్లాడుతూ ''అర్జున్‌తో కలిసి 5 సినిమాలకు పనిచేశాను. మా పల్లె గోపాలుడు చిత్రంలో నేను అర్జున్‌ని ఇంట్రడ్యూస్‌ చేసేటప్పుడు గొప్ప నటుడవుతాడని అనుకున్నాను. కానీ తను మంచి నిర్మాతగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తను నిర్మాతల, దర్శకుల హీరో'' అన్నారు.