శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By DV
Last Modified: శనివారం, 16 ఏప్రియల్ 2016 (16:53 IST)

29న "మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ " విడుదల, 100 మందికి చూపించి వదులుతున్నారట...

రెగ్యులర్ ఫోర్ములాలకు భిన్నంగా నిజజీవితాలను ఆవిష్కరిస్తూ, యువతకు నచ్చే విధంగా సందర్భోచిత పాటలతో, ఆరోగ్యకరమైన హాస్య సన్నివేశాలతో, రొమాన్సుతో పాటు యువత ఎదుగుదలకు ఉపయోగపడే సందేశాన్ని ఇస్తూ కుటుంబసమేతంగా చూడగలిగేల రూపొందించిన ప్రయోగాత్మక చిత్రమే " మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ " సినిమా .
 
అన్ని సినిమాల్లాగా ఎంతో ఖర్చు పెట్టి ప్రచారాలు చేసి ధియేటర్లను సమకూర్చుకొని సినిమాను విడుదల చేసి, బాగుందో లేదో అనే సంగతి  మార్నింగ్ షో రిపోర్ట్ ద్వార తెలుసుకోవడం కంటే ఒక వందమంది సామాన్య ప్రేక్షకులకు చూపించి ప్రజాస్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడం జరిగింది. 95% మందికి నచ్చితేనే ముందుకెళదాం లేకుంటే లేదని అనుకున్నాం. చూసిన వాళ్ళందరికీ సినిమా నచ్చడమే కాకుండా, ఆ వందమందిలో కొందరు కొన్ని జిల్లాల పంపిణీ హక్కులు కూడా కొనుగోలు చేయడం జరిగింది, ఆ తరువాత ఒక కో-ఆపరేటివ్ విధానాన్ని అమలుపరిచి  రాష్ట్రమంతటా విడుదల చేయడానికి సిద్ధపడ్డాము.
 
సోషల్ మీడియాలో మా ప్రచార చిత్రాలకు, పాటలకు మరియు పోస్టర్ డిజైన్లకు మంచి స్పందన వస్తున్నది . యువతకు 'కనపడవద్దు ప్లీజ్ చుస్తే నిన్ను ఐపోతానె ఫ్రీజ్ ' పాట బాగా ఆకట్టుకుంటున్నది. అభిరుచి గల శ్రోతలతొపాటు మేధావులు సైతం 'కొమ్మల్లో ఊగితూగే చిట్టి పొట్టి మొగ్గలు పూయకుండానే వాడిపోయెన' తోపాటు 'కదలర ముందుకు .. పాటలు చాల స్పూర్తిదాయకంగా వినసొంపుగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.
 
మంచి గ్యాప్ చూసి విడుదల చేద్దాం అనుకుని చాల వెయిట్ చేసాం ఫెబ్రవరిలోనే విడుదల చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ప్రతి పండుగ , ప్రతి సెలవుల సమయాల్లో హై బడ్జెట్ సినిమాలు ప్రతి సెంటర్లో ఒక్క ధియేటర్నికూడా వదలకుండా అన్ని ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి విధానాన్ని నియంత్రించనంతవరకు లో-బడ్జెట్ సినిమాల విడుదల చేయడం ఇబ్బందికరమే అవుతుంది రోజురోజుకు.
 
ప్రేక్షకులు "మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ " సినిమాను చూస్తే తప్పకుండా ఒకకోత్తరకమైన వినోదాన్ని ఆస్వాదించిన అనుభూతి మిగులుతుందని మా ప్రివ్యూ చూసిన 100 మంది ప్రేక్షకుల రిపోర్టే మాకు ఎంతో ధైర్యాన్ని కలగచేసింది. విడుదలైన తొలిరోజే ధియేటర్‌కి ప్రేక్షకులు రాగలిగితే సినిమా తప్పకుండ నిలబడుతుంది. మున్ముందు ఇట్లాంటి ప్రయోగాత్మక వినోదభరిత సినిమాలు తెరకెక్కుతాయి అని చెప్పారు రఫి.