Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెండితెరపై మరో అద్భుతం.. నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు కలిపితే.. "రారండోయ్ వేడుక చూద్దాం"

హైదరాబాద్, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:24 IST)

Widgets Magazine

కెరీర్లో శివ ఒక ట్రెండ్ సెట్టర్ అయితే, నిన్నే పెళ్లాడుతా, మన్మధుడు అత్యద్భుతమైన కుటుంబ గాధా చిత్రాలు. రెండు తరాల ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగంలో ముంచెత్తిన గొప్ప చిత్రాలవి. మరి ఇన్నాళ్ల తర్వాత ఈ రెండు సినిమాలు కలిపి ఒక సినిమాను రూపొందిస్తే... ఈ ఆలోచన కూడా నాగార్జునదే. ఫలితం త్వరలో మనముందుకు రాబోతున్న ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రం.  అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న.. నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విశేషాలను చిత్రబృదం మీడియాతో ముచ్చటించింది. చిత్రంగురించి నాగార్జున ఏమన్నారో తన మాటల్లోనే చూద్దాం.
<a class=rakul preet singh" class="imgCont" height="200" src="http://media.webdunia.com/_media/te/img/hp/home-page/2015-10/08/full/1444321764-9162.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="rakul preet singh" width="600" />
 
‘ఒకమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలని కలలుగంటుంది. ఆ రాకుమారుడు ఎవరు ఎలా ఉంటాడు ఆ అమ్మాయి కల నెరవేరిందా లేదా అన్నదే చిత్ర కథ. నాకు బాగా నచ్చిన రొమాంటిక్‌ చిత్రాలు ‘నిన్నే పెళ్లాడతా’, ‘మన్మథుడు’. కుటుంబ బంధాలు, ఎమోషన్‌ సీన్స్‌ ‘నిన్నే పెళ్లాడతా’లో చూపించాం. ఇక ‘మన్మథుడు’లో ఎంటర్‌టైనమెంట్‌తో పాటు సెన్సిటివ్‌ లవ్‌ని చూపించాం. ఆ రెండింటినీ కలిపి ఓ సినిమా చేస్తే బాగుంటుందని కల్యాణ్‌తో చెప్పా. మంచి కథాంశం చెప్పాడు. కథ వినగానే బాగా నచ్చింది. జగపతిబాబు చైతన్య తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య ఉండే బంధాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. నిజ జీవితంలో నేను చైతూ ఎలా ఉంటామో సినిమాలో ఆ రెండు పాత్రలూ అలా ఉంటాయి. సంపత్‌ కూతురిగా రకుల్‌ నటించింది. ఒకరంటే ఒకరికి ప్రాణం. అంతబాగా వారిద్దరి పాత్రలు ఉంటాయి. ఈ సినిమాకు ఈ నాలుగు పాత్రలు హైలెట్‌గా నిలుస్తాయి. దేవిశ్రీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎప్పటిలాగే ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ అందించాడు. డైరెక్టర్‌గా కంటే కల్యాణ్‌ మంచి రచయిత. అందుకే అతడ్ని ‘సోగ్గాడే చిన్నినాయనా’కి తీసుకున్నాం’అని చెప్పారు. 
 
ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే మూడో వారంలో సినిమా విడుదల చేస్తామని నాగ్‌ చెప్పారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
నాగార్జున నిర్మాత రారండోయ్ వేడుక చూద్దాం నిన్నే పెళ్లాడుతా మన్మధుడు. Nagarjuna Rakul Act Jagapathi Babu Nag Chaitanya Rarandoay Veduka Chuddam

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలితో రెఢీ అంటో వెంకటాపురం.. హ్యాపీడేస్ రాహుల్ కొత్త సినిమా?!

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మానియా నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన ...

news

మగధీరతో స్టార్ట్.. బాహుబలితో పీక్... తెలుగు సినిమాకు ఇది గ్రాఫిక్స్ స్వర్ణయుగం

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘మగధీర’ తర్వాత గ్రాఫిక్స్‌కు నిర్మాతలు కొంత బడ్జెట్‌ ...

news

రాంగోపాల్ వర్మకు సన్నీ లియోన్.. ఆ నోరు కంటే పబ్లిక్ టాయ్‌లెట్టే నయం...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గూబగుయ్యమనేలా రివర్స్ ...

news

అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. దేవకన్యలోనూ చాన్సు కొట్టేసిందిగా

వరుసగా మూడు హిట్ చిత్రాలతో జోరు మీదున్న టీనేజి్ హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా నాగ అన్వేష్ ...

Widgets Magazine