Widgets Magazine

అంధుడి పాత్రలో రవితేజ... చిత్ర విజయంపై దిల్ రాజు భరోసా

హైదరాబాద్, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (01:00 IST)

Widgets Magazine

‘బెంగాల్‌ టైగర్‌’ వంటి హిట్‌ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్‌ తీసుకున్న ఇప్పుడు రెట్టించిన కొత్త ఉత్సాహంతో నూతన చిత్రాలను ఎక్స్‌ప్రెస్‌ లెవల్‌లో పట్టాలెక్కిస్తున్నారు. మాస్‌ మహారాజా అని పేరున్న రవితేజ సోమవారం కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. రవితేజ హీరోగా విక్రమ్‌ సిరికొండను దర్శకునిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్‌ చేసి చూడు’ గత శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. రవితేజ, మెహరీన్‌ కౌర్‌ జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్న ‘రాజా ది గ్రేట్‌’ మూవీ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
 
హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్‌ ఎం.వి.ఆర్‌.ఎస్‌. ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ క్లాప్‌ ఇచ్చారు. చిత్ర సమర్పకుడు, నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘భద్ర’ చిత్రం తర్వాత రవితేజతో, ‘సుప్రీమ్‌’ మూవీ తర్వాత అనిల్‌ రావిపూడితో మా బ్యానర్లో చేస్తున్న చిత్రమిది. అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ‘భద్ర’, ‘సుప్రీమ్‌’ చిత్రాల కంటే ‘రాజా ది గ్రేట్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం’’ అన్నారు.
 
అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. ఇప్పటి వరకూ కనిపించని విలక్షణ పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఆయన అభిమానులు, ప్రేక్షకులకు నచ్చేలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ‘దిల్‌’ రాజుగారి బ్యానర్‌లో రెండో చిత్రం చేయడం హ్యాపీ. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం’’ అని తెలిపారు. నిర్మాత శిరీష్, దర్శకుడు సతీష్‌ వేగేశ్న పాల్గొన్నారు.
 
కాగా, ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా కనిపించనుండటం విశేషం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగ్‌ను అలా చూసి ఎమోషన్ అయ్యా... కె.రాఘవేంద్ర రావు ఇంటర్వ్యూ

కమర్షియల్‌ సినిమాలు తీసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఒక్కసారిగా భక్తి చిత్రాలు తీయడంలో ...

news

మాస్ మ‌హారాజా ర‌వితేజ - అనిల్ రావిపూడి చిత్రం 'రాజా ది గ్రేట్‌'

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ...

news

సామాన్యుడి సహనాన్ని పరీక్షించొద్దు.. శశికళకు కమల్ హాసన్ వార్నింగ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళ నటరాజన్‌కు విశ్వనటుడు ...

news

చిరంజీవి... ఎప్పటికీ చిరంజీవినే... గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు: కే విశ్వనాథ్‌

సుమారు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ...