గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By DV
Last Modified: శనివారం, 16 జులై 2016 (21:26 IST)

ఆగస్టు 5న అల్లు శిరీష్ 'శ్రీరస్తు శుభ‌మ‌స్తు' చిత్రం విడుద‌ల‌

అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, ఫ్యామిలీ లోని చ‌క్క‌టి ఎమెష‌న్స్‌ని వెండితెర‌పై క‌థలుగా తెర‌కెక్కించి విజ‌యాలు సాదిస్తున్న ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, ఏస్‌ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ

అల్లు శిరీష్‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా, ఫ్యామిలీ లోని చ‌క్క‌టి ఎమెష‌న్స్‌ని వెండితెర‌పై క‌థలుగా తెర‌కెక్కించి విజ‌యాలు సాదిస్తున్న ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, ఏస్‌ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్లో నిర్మించిన‌ చిత్రం 'శ్రీరస్తు శుభ‌మ‌స్తు'. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్క‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లో థ‌మ‌న్.S.S సంగీతం అందించిన ఆడియో విడుద‌ల చేస్తారు. చిత్రాన్ని ఆగస్టు 5న విడుద‌ల చేయ‌టానికి  నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్(బుజ్జి) మాట్లాడుతూ " అల్లు శిరీష్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఫ్యామిలి ఎమోష‌న్స్‌కి విల‌ువ‌లు త‌గ్గుతున్న ఈ రోజుల్లో, ఫ్యామిలీ అంటే ప‌క్కింటివాడి మేట‌ర్ కాదు మ‌న‌ది మ‌న ఫ్యామిలి, మ‌నం అనుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌నైనా సింపుల్‌గా సాల్వ్ చేయ‌చ్చు అని తెలియ‌జెప్పె మంచి చిత్రం మా ' శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు'.  ఓ మంచి ఫ్యామిలిలో అన్ని ఎమోష‌న్స్ క‌లిసి వుంటాయి. అలాంటి అన్ని ఎమోష‌న్స్‌ని క‌లిపి శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంలో చూపించాము. 
 
శిరీష్ ఎన‌ర్జి సూప‌ర్బ్, లావ‌ణ్యతో వ‌చ్చే స‌న్నివేశాలు యూత్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌, రావు ర‌మేష్‌, సుమల‌త‌, సుబ్బరాజు, ప్రగతి, అలీ, తనికెళ్ల భరణి, రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి న‌టీన‌టుల‌తో ఫుల్‌పేక్డ్‌గా ఈ చిత్రం చేశాము. ప్ర‌తి కేర‌క్ట‌ర్‌కి ప్రాముఖ్య‌త వుంటుంది. వీరందరి కాంబినేష‌న్లో వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయి. ఆల్‌రెడి పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల‌ చేయ‌నున్నాము. ఆగస్ట్ 5న ప్రేక్ష‌కుల ఆశీర్వ‌చ‌నాల‌కోసం చిత్రాన్ని తీసుకువ‌స్తాము. చ‌క్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ కి థ‌మ‌న్.య‌స్‌.య‌స్ సంగీతం అందిస్తున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత అల్లు అర‌వింద్ గారికి నా ధ‌న్య‌వాదాలు."అని అన్నారు..
 
నిర్మాత అల్లు అర‌వింద్ గారు మాట్లాడుతూ ..  మా చిత్రం 'శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ' షూటింగ్ పూర్త‌య్యింది. శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. చక్క‌టి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా  మా బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్ర‌మిది. ఫ్యామిలి ఆడియ‌న్స్ అంద‌రిని అల‌రించే మంచి చిత్రాన్ని ద‌ర్శ‌కుడు బుజ్జి  తీసాడు. ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్ వున్న ఈ చిత్రంలో న‌టీన‌టులంద‌రూ చాలా బాగా న‌టించారు. టీజ‌ర్ కి చాలా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ అందించిన ఆడియో సినిమాకి ప్ల‌స్ అవుతుంది. త్వ‌ర‌లో ఆడియో ని ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తాము. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాము. "అని అన్నారు.