గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2014 (19:16 IST)

'యమలీల-2' అందర్నీ ఆకట్టుకుంటుంది - డా|| బ్రహ్మానందం

డా|| కె.వి.సతీష్‌ హీరోగా కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో డి.ఎస్‌.మ్యాక్స్‌ సమర్పణలో క్రిష్వి ఫిలింస్‌ పతాకంపై ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆశా సతీష్‌ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'యమలీల-2'. ఈ నెల 28న వరల్డ్‌వైడ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో డా|| బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా నటించారు. ఇరవై ఏళ్ళ క్రితం అలీ హీరోగా వచ్చిన 'యమలీల' చిత్రంలో చిత్రగుప్తుడిగా నటించిన బ్రహ్మానందం ఇప్పుడు డా|| కె.వి.సతీష్‌ హీరోగా వస్తోన్న 'యమలీల-2' చిత్రంలో కూడా చిత్రగుప్తుడిగా నటించడంపై ఆయన స్పందన తెలియజేస్తూ..
 
''క్రిష్వి ఫిలింస్‌ బేనర్‌లో ఎస్వీ కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం యమలీల-2. గతంలో వచ్చిన యమలీల చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్‌గా 'యమలీల-2' పేరుతో సతీష్‌ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ కృష్ణారెడ్డిగారు ఎంతో కష్టపడి అద్భుతంగా తీసిన సినిమా. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంటే. సినిమా అంతా నవ్వుతూ చూడాల్సిందే. మధ్యలో కృష్ణారెడ్డిగారి మార్క్‌. సెంటిమెంట్‌ ఈ సినిమాలో బాగా పండింది. కళాప్రపూర్ణ, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుగారు ఈ సినిమాలో యమధర్మరాజుగా యాక్ట్‌ చెయ్యడం విశేషం. ఇది ఈ సినిమాకి స్పెషల్‌ క్వాలిటీగా, స్పెషల్‌ ఎస్సెట్‌గా చెప్పొచ్చు. యమలీలలో సత్యనారాయణగారు యమధర్మరాజుగా నటిస్తే, యమలీల2లో మోహన్‌బాబుగారు ఆ క్యారెక్టర్‌లో నటించారు.
 
మోహన్‌బాబుగారు ఆల్రెడీ యమదొంగ చిత్రంలో యమధర్మరాజుగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. నేను చిత్రగుప్తుడిగా ఆయన కాంబినేషన్‌లో ఈ చిత్రంలో చాలా మంచి సీన్స్‌ చేశాం. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో గ్రాఫిక్స్‌లో ఎంతో ఖర్చు పెట్టి తీశారు. అవి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయన్న ప్రగాఢ నమ్మకం నాకు వుంది. ముఖ్యంగా ఎస్వీ కృష్ణారెడ్డిగారి మ్యూజిక్‌ చాలా హాయిగా, ఎంతో ప్రశాంతంగా వుంటుంది. ఎలాంటి గొడవ లేకుండా వినేలా ఆయన పాటలు వుంటాయి. హీరోయిన్‌గా దియా నికోలస్‌ నటించింది. సతీష్‌, నికోలస్‌ల జంట మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా వున్నారు. 
 
వాళ్ళిద్దరి మధ్య ఒక పాప సెంటిమెంట్‌ వుంటుంది. అలాగే షాయాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థిల కామెడీ కూడా చాలా బాగా వచ్చింది. వీరితోపాటు గబ్బర్‌సింగ్‌ గ్యాంగ్‌ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతున్న కాన్ఫిడెన్స్‌ నాకు వుంది. ఈ సందర్భంగా 'యమలీల-2' యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను'' అన్నారు. 
 
డా||కె.వి.సతీష్‌, దియానికోలస్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో కలెక్షన్‌కింగ్‌, డా.ఎం.మోహన్‌బాబు, డా||బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్‌.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, సదా, నిషా కొఠారి, ఆశిష్‌ విద్యార్థి, సాయాజీ షిండే, గీతాంజలి, బేబీ హర్షిత, అనంత్‌, సమీర్‌, ఉత్తేజ్‌, జోగి బ్రదర్స్‌, తాగుబోతు రమేష్‌, లక్ష్మణ్‌, సూర్య, సుభాష్‌, మాధవి, సత్యకృష్ణ, ప్రియ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా; శ్రీకాంత్‌ నారోజ్‌, ఎడిటర్‌; గౌతంరాజు, మాటలు; గంగోత్రి విశ్వనాథ్‌, భవానీ ప్రసాద్‌, ఆర్ట్‌; చిన్నా, ఫైట్స్‌; డ్రాగన్‌ ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత; ఎం.ఎ.జగన్నాథరెడ్డి, కో ప్రొడ్యూసర్‌: డి.కె.అరుణ్‌కుమార్‌, నిర్మాణం: క్రిష్వీ ఫిలింస్‌, నిర్మాత: ఆశా సతీష్‌, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం; ఎస్‌.వి.కృష్ణారెడ్డి.