శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (16:42 IST)

ప్రేయసి కావాలట... స్నేహితుడూ కావాలట... ఎందుకట...? '100 డేస్‌ ఆఫ్ లవ్‌' చూడాలట... రివ్యూ రిపోర్ట్

'100 డేస్‌ లవ్‌' నటీనటులు : దుల్కర్‌ సల్మాన్‌, నిత్యా మీనన్‌, ఆనంద్‌ తదితరులు; సంగీతం : గోవింద్‌ మీనన్‌, నిర్మాత : ఎస్‌. వెంకటరత్నం, దర్శకత్వం : జీనస్‌ మహమ్మద్‌. మణిరత్నం రూపొందించిన 'ఓకే బంగారం'తో త

'100 డేస్‌ లవ్‌' నటీనటులు : దుల్కర్‌ సల్మాన్‌, నిత్యా మీనన్‌, ఆనంద్‌ తదితరులు; సంగీతం : గోవింద్‌ మీనన్‌, నిర్మాత : ఎస్‌. వెంకటరత్నం, దర్శకత్వం : జీనస్‌ మహమ్మద్‌.
 
మణిరత్నం రూపొందించిన 'ఓకే బంగారం'తో తెలుగులోకి ప్రవేశించిన నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌. నిత్యా మీనన్‌ జోడీతో బాగా పాపులర్‌ అయింది. మలయాళంలో 'ఉస్తాద్‌ హోటల్‌'తోనే మంచి పెయిర్‌గా మారిన ఈ జంట మరో ప్రయత్నం '100 డేస్‌ ఆఫ్‌ లవ్‌'. మళయాలంలో గతేడాది విడుదలైన ఈ సినిమా ఇప్పటికి తెలుగులో వచ్చింది. నిత్య మేనేజర్‌ వెంకట్‌ దీన్ని తెలుగులో అనువదించారు. మరది ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
 రావు గోపాలరావు (దుల్కర్‌ సల్మాన్‌) ద టైమ్స్‌ అనే పత్రికలో ఓ ఫీచర్‌ రైటర్‌గా పనిచేస్తూంటాడు. ఉద్యోగం పోయి గజిబిజిగా వున్న అతను అనుకోకుండా సావిత్రి(నిత్యా మీనన్‌)ని చూస్తాడు. టాక్సీలో తను ఎక్కాలనుకున్నవాడు ఆమెకు వదిలేస్తాడు. అక్కడే ఆమె ఓ బ్యాగ్‌ను పోగొట్టుకుంటుంది. అందులో పాతకాలపు కెమెరా వుంటుంది. అందులోని ఫొటోల ఆధారంగా.. ఆమెను వెతికేందుకు తన స్నేహితుడు కంప్యూటర్స్‌ గేమ్స్‌ నిర్వహించే గుమ్మడితో ప్రయత్నిస్తాడు. మొత్తానికి ఆమెను శోధించి కనిపెట్టినప్పుడు తనెవరో చెబుతుంది. పైగా అప్పటికే రాహుల్‌ అనే వ్యక్తిని పెళ్ళాడేందుకు సిద్ధపడుతుంది. తాను పెళ్ళిచేసుకునే వాడిలో స్థిరత్వం ఉండాలనుకునే సావిత్రి, నచ్చిన పని చేస్తూ తనలా తానుండాలనుకునే గోపాల్‌.. వీరిద్దరి ప్రయాణం ఆ తర్వాత ఏయే మలుపులు తిరిగిందీ? అన్నది సినిమా.
 
 
పెర్‌ఫార్మెన్స్‌
నిత్యా మీనన్‌, సావిత్రి పాత్రలో ఇమిడిపోయింది. తను కాజువల్‌గా నటించేసింది. అదే రీతిలో దుల్కర్‌, రావుగోపాలరావు పాత్రలోని ప్రెజెన్స్‌, నటన బాగున్నాయి. ఇద్దరూ చిన్నచిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను బాగా పండించారు. సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్‌ బలమైన ముద్రను సంపాదించుకున్నాయి. రావుగోపాలరావు స్నేహితుడిగా మలయాళనటుడు నటించాడు. పేరు గుమ్మడి. తనకు కృష్ణుడు వాయిస్‌ ఇచ్చాడు. మిగిలిన పాత్రలన్నీ మలయాళీయులే.
 
సాంకేతిక విభాగం :
ప్రేమకథలే.. కొత్తగా ఏమీలేకపోయినా. చెప్పేవిధానంలో కాస్త స్లో అయినా దర్శకుడు జీనస్‌ మహమ్మద్‌ చూపిన ఆలోచన బాగుంది. పాత్రల ఆలోచనలు, పరిస్థితులను మార్చి ఈ రొమాంటిక్‌ కామెడీని సిద్ధం చేశారు. హృదయం కన్నులతో పాట దగ్గర్నుంచి చాలాచోట్ల మేకింగ్‌ పరంగా చాలా ప్రయోగాలనే చేశాడు. అయితే ఆ మేకింగ్‌ని అందుకునే స్థాయిలో కథనం లేకపోవడమే నిరుత్సాహపరచే అంశం. ఇక ప్రతీశ్‌ వర్మ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. లైటింగ్‌, షాట్‌ మేకింగ్‌.. కనులవిందుగా కనిపించడంలో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ఎడిటింగ్‌లో కొన్ని అనవసర సీన్లు తీసేస్తే బాగుండుననిపించింది. గోవింద్‌ మీనన్‌ సంగీతం బాగుంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి.
 
విశ్లేషణ:
అసలు సినిమా మొదటి భాగమంతా డల్‌గా వుంటుంది. డాక్యుమెంటరీ చూసినట్లుంటుంది. సెకండాఫ్‌లో ఏమి చెబుతాడా? అన్న ఆసక్తికొద్దీ చూడ్డం మినహా కథంతా రొటీన్‌గానే వుంటుంది. సెకండాఫ్‌ కథలో వీరిద్దరి ప్రయాణం మంచి మలుపులు తిప్పుతుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ కుదిరింది. ముఖ్యంగా దుల్కర్‌ నిత్యా మీనన్‌కి ప్రపోజ్‌ చేసే సీన్‌, నీ ఒరిజినల్‌ మనిషిని బయటకు తీయ్‌ అని చెప్పే సీన్‌ లాంటివి చాలా బాగున్నాయి. అదేవిధంగా మొదట్నుంచీ చివరివరకూ దుల్కర్‌, గుమ్మడి (శేఖర్‌ మీనన్‌) నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి.
 
హీరోయిన్‌ను వెతకడంలోనే ఒక భాగం మొత్తం పూర్తవ్వడంతో, ప్రేమకథను సెకండాఫ్‌లో కానీ మొదలుపెట్టలేదు. ఈ సమయంలో వచ్చే సన్నివేశాలు కూడా కొన్ని మళ్ళీమళ్ళీ వచ్చినట్లు, కొంత బోర్‌ కొట్టించినట్లు అనిపించాయి. చెప్పేవిధానం చాలా నిదానంగా సాగుతుంది. గూడ్స్‌బండిలా సాగుతుంది. అంటే.. కథలో పెద్దగా పటుత్వంలేదు. అందుకే చిన్న పాయింట్‌ను సాగదీసి చూపించాడు. దాదాపు 155 నిమిషాల మేర నిడివి ఉన్న ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో వచ్చే చాలా సన్నివేశాలు అనవసరమైనవిగానే కనిపించాయి.
 
సహజంగా అమ్మాయి.. మగాడిలో సెక్యూరిటీ చూస్తుంది. అదే హీరో లేదు. ఉద్యోగం పోగొట్టుకుని కార్టూన్‌లు వేస్తూ పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. తను పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. తనిష్టం వచ్చినట్లు బతకాలని బయటకు వస్తాడు. దీనితోపాటు.. అమ్మాయి మనస్సును చదివిన వ్యక్తి. అందుకే చివరిలో అతనికి కనెక్ట్‌ అవుతుంది సావిత్రి. వందరోజుల్లో జరిగిన ప్రేమకథ కాబట్టి '100 డేస్‌ ఆఫ్‌ లవ్‌' పేరు పెట్టారు. హైస్కూల్‌ డేస్‌లో రావు, సావిత్రి ఎపిసోడ్‌ సరదాగా వుంటుంది. ఇంతకు మించి.. పెద్దగా ఎట్రాక్‌ అయ్యే పాయింట్‌ లేదు. ఏదైనా మంచి స్నేహితుడు వుంటే చాలు.. గుర్తింపు అదే వస్తుంది. అలాంటి స్నేహితుడు గుమ్మడి వల్లే చివరికి రావుగోపాలరావు వేసే కార్టూన్లు.. ఒబామా దాగా వెళ్ళేలా చేస్తాయి. అర్థం చేసుకునే ప్రేయసితో పాటు స్నేహితుడు కూడా వుండాలని చెప్పేదే ఈ సినిమా. అయినా స్లో నెరేషన్‌తో సాగడంతో అంత త్వరగా కనెక్ట్‌ కాకపోవచ్చు.

 
రేటింగ్‌ : 2.5/5