గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (18:36 IST)

'అభినేత్రి' రివ్యూ రిపోర్ట్: సరదా దెయ్యం కథ.. తమన్నా, ప్రభుదేవాల నటనే హైలైట్

ప్రభుదేవా తెలుగులో సినిమాలు చేసి చాలా కాలమైంది. హిందీలోనే పలు చిత్రాలు చేస్తున్న అతను ఉన్నట్టుండి 'అభినేత్రి' అనే సినిమాను చేస్తున్నాడనీ, దానికి నిర్మాతనే తనే అనే చెప్పడంతో ఈ చిత్రంలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. దానికితోడు తమన్నా అతనికి భార్యగా నటిం

నటీనటులు:  తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్‌, మురళీశర్మ తదితరులు
నిర్మాత: ప్రభుదేవా, సత్యనారాయణ, దర్శకత్వం: ఎ.ఎల్‌. విజయ్‌.
 
ప్రభుదేవా తెలుగులో సినిమాలు చేసి చాలా కాలమైంది. హిందీలోనే పలు చిత్రాలు చేస్తున్న అతను ఉన్నట్టుండి 'అభినేత్రి' అనే సినిమాను చేస్తున్నాడనీ, దానికి నిర్మాతనే తనే అనే చెప్పడంతో ఈ చిత్రంలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. దానికితోడు తమన్నా అతనికి భార్యగా నటించింది. మరో నటుడు సోనూసూద్‌ కూడా ఉండటంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. సోనూసూద్‌తోనే తమన్నా ఉన్న సన్నివేశాలు పబ్లిసిటీకి ఉపయోగించారు. ఇలా ప్రేక్షకుల్ని థ్రిల్‌ కలిగింపజేసిన ఈ చిత్రంలో ఏముందో తెలుసుకుందాం.
 
కథ: 
ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే కృష్ణ (ప్రభుదేవా)కు మోడ్రన్‌గా ఉంటూ ఇంగ్లీషు మాట్లాడే అమ్మాయిని చేసుకోవాలనేది డ్రీమ్‌. తను పనిచేసే ఆఫీసులో కొత్తగా వచ్చే అమ్మాయిలకి అప్లికేషన్‌ కూడా పెడుతుంటాడు. అనుకోకుండా తన బామ్మకు సీరియస్‌గా ఉందని తెలిసి రాజమండ్రిలోని ఓ పల్లెటూరికి బయలుదేరతాడు. ఎందుకంటే పుట్టింది పల్లెటూరైనా.. అక్కడ పద్ధతులు మనుషులు నచ్చరు. 48 గంటల్లో బామ్మ చనిపోతుందని డాక్టర్లు చెప్పడం.. చనిపోయేముందు... మనవడు పెళ్లిచూడాలనే బలమైన కోరికను గ్రహించిన కృష్ణ అమ్మానాన్నలు.. వరుసకు మరదలు, ఆవుల్ని తోలుకునే అమ్మాయి దేవి (తమన్నా)కిచ్చి పెళ్లిచేస్తారు. అయిష్టంగా చేసుకున్న పెళ్లిని ఆఫీసులో చెప్పలేక మింగలేకకక్కలేక.. సిటీలో ఓ కొత్త ఇంటిలో మకాం పెడతాడు. ఈ జర్నీలో సోదరు సమానుడైన సప్తగిరి కృష్ణకు హెల్ప్‌ చేస్తుంటాడు. అయితే తను తీసుకున్న ఇంటిలోకి వచ్చాక. దేవీ ప్రవర్తనలో మార్పు కన్పిస్తుంది. ఆమెకు దెయ్యం ఆవహిస్తుంది. ఆ దెయ్యం చెప్పినట్లు చేస్తూ దెయ్యంతో చేసుకున్న అగ్రిమెంట్‌ పూర్తిచేశాక.. దేవీ మామూలు మనిషైవుతుంది. మరి దెయ్యంతో అగ్రిమెంట్‌.. అసలు దెయ్యం ఎవరు? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
ప్రభుదేవా నటన, డాన్స్‌పరంగా ఈజీగానే చేసేశాడు. నటనకు డాన్స్‌కు ఎక్కడా గ్యాప్‌ వచ్చినట్లు కన్పించలేదు. కానీ.. ఫేస్‌లోనే కాస్త గతంలో ఉన్న గ్లో లేదు. తమన్నా గ్రామీణ యువతిగా ఆమె మాట్లాడే కోనసీమ యాసతో బాగానే చేసింది. రూబీగానూ మెప్పించింది. సోనూసూద్‌ స్టార్‌ హీరో పాత్రలో జీవించాడు. అతని మేనేజర్‌గా మురళీశర్మ ఒదిగిపోయాడు. సప్తగిరి కామెడీతో నవ్వించాడు. ఇక మిగిలినవారంతా తెలుగుకు కొత్తవారే.
 
విశ్లేషణ: 
దెయ్యం సినిమాలంటే ఉండాల్సి సౌండ్‌ సిస్టమ్‌ బాగానే పెట్టాడు దర్శకుడు విజయ్‌. అమలాపాల్‌ మాజీ భర్త అయిన విజయ్‌ దర్శకత్వం చేసిన ఈ సినిమా కథాపరంగా పెద్ద ట్విస్ట్‌లు ఏమీ కన్పించవు. చెప్పాలనుకున్న పాయింట్‌ను స్ట్రెయిట్‌ చెప్పేశాడు. సినిమా హీరోయిన్‌ అవ్వాలనుకుని ముంబై వచ్చి అవ్వలేకపోయి.. విరక్తితో ఆత్మహత్య చేసుకున్న రూబీ పాత్ర ఎవరో చూపించరు. తన కోరికను తమన్నాతో తీర్చుకుంటుంది. దెయ్యం తన భార్యకు పట్టిందనే విషయం ఒక్క కృష్ణకు తప్ప ఎవ్వరికీ తెలీకుండా మేనేజ్‌ చేయడం.. ఇప్పుడు వస్తున్న దెయ్యం సినిమాల్లో కాస్త కొత్తగా అనిపించినా.. ఇదేదో పాత సినిమా పాయింట్‌లా అనిపించేట్లుగానూ ఉంది. 
 
కాగా, మనం అనుకున్నవనీ జరగవు. దేవుడు మనకు ఎలా రాసిపెట్టుంటాడో అలా జరుగుతుందనేది. కథలోని సారాంశం. మోడ్రన్‌ అమ్మాయి భార్యగా కావాలనుకుని ఆవుల్ని కాచే పల్లెటూరి అమ్మాయిని భార్యగా పొందేటప్పుడు.. ప్రభుదేవా ఎక్స్‌ప్రెషన్స్‌.. బయటకు వెళ్ళేటప్పుడు ఆమె భార్యగా అంగీకరించకుండా దూరంగా పెట్టే విధానం చూసేవారికి ఎంటర్‌టైన్‌ చేయిస్తుంది. దెయ్యం కథే అయినా.. ఎక్కడా.. భయం కల్గించేట్లు కాకుండా పూర్తిగా వినోదాత్మకంగా మలచడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు.
 
రేటింగ్‌: 3/5.