గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 నవంబరు 2014 (16:59 IST)

విలేజ్ అమ్మాయిలెలా... సిటీ అమ్మాయిలలా... 'అలా ఎలా?' రివ్యూ రిపోర్ట్

అలా ఎలా నటీనటులు: రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిశోర్‌, షాన, సోలొమో, ఖుషి హెబా పటేల్‌, భానుశ్రీ మెహ్రా, కాశీ విశ్వనాథ్‌ తదితరులు; నిర్మాత: అశోక్‌ వర్థన్‌, సంగీతం: భీమ్స్‌, దర్శకత్వం: అనీష్‌ కృష్ణ.
 
విడుదల 28.11.2014.. శుక్రవారం.
 
ఇటీవల లోబడ్జెట్‌ చిత్రాలు వస్తున్నాయి. అందులో కథ కొంచెమే. కథనం బిన్నంగా తీసే ప్రయత్నాలు కొత్త దర్శకులు చేస్తున్నారు. అటువంటి కోవలో 'అలా ఎలా' అనే చిత్రాన్ని చేయడానికి ట్రై చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో ఇంతకుముందు అందాల రాక్షసి చేశాడు. హీరోయిన్లు కొత్తవారే. అల్లు అర్జున్‌ సరసన వరుడులో హీరోయిన్‌గా చేసిన భానుశ్రీ మెహ్రా వెన్నెల కిశోర్‌ సరసన నటించడం విశేషం. అయితే అలా ఎలా? అంటే ఏమిటో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే... 
రాహుల్‌ (రాహుల్‌) ఇప్పటి జనరేషన్‌. సిటీలో వుంటూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేసే రకం. తల్లిదండ్రులు లేకపోయినా తాత, నాయనమ్మ ఇతర బంధువులున్నారు. తాతకు సీరియస్‌ అని ఫోన్‌ వస్తే ఆఖరుసారని ఊరి వెళతాడు రాహుల్‌. అక్కడ తాత చెప్పిన సబంధాన్ని చేసుకుంటే కోట్ల రూపాయల ఆస్తి వస్తుందనీ, అమ్మాయి కూడా బాగుంటుందని అంటారు. ఇదే తన చివరి కోరిక అనడంతో కోట్ల ఆస్తి కోసం మనవడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తాడు. అయితే.. ఆమె ఫొటోను నెట్‌లో చూశాక.. నచ్చి.. ఆమె కోసం వారి ఊరు వెళ్ళి.. ప్రేమించి పెండ్లి చేసుకోవాలని ఆలోచన చేస్తాడు. అందుకు ఇద్దరు స్నేహితులైన వెన్నెల కిశోర్‌, షానీ లతో కలిసి వెళతాడు. అక్కడ అతడికి ఎదురైనా అనుభవాలే మిగిలిన సినిమా.
పెర్‌ఫార్మెన్స్‌ 
అందాల రాక్షసి తర్వాత రాహుల్‌ చేసిన ఈ చిత్రం నటుడిగా ఫర్వాలేదు. చాలా సన్నివేశాలు ఈజీగా చేసేశాడు. వెన్నెల కిశోర్‌, షానీ పాత్రలు తోడుగా వుంటూ ఎంటర్‌టైన్‌ చేస్తాయి. వెన్నెల కిశోర్‌ భార్యగా భానుశ్రీ మెహ్రా నటించింది. పెళ్ళామంటే భయపడే వెన్నెల కిశోర్‌ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. హీరోయిన్లుగా సోలోమో, ఖుషిహో పటేల్‌ ఫర్వాలేదు. 
 
టెక్నికల్‌గా.... సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌. పల్లెటూరి అందాలను బాగా చూపించారు. పచ్చదనం కళ్ళకు కట్టినట్లు ఆకర్షణీయంగా చూపించడం విశేషం. చక్కటి పల్లెటూరి వాతావరణంలో తీసిన ఈ చిత్రం ప్రకృతి ప్రేమికులను మెప్పిస్తుంది. సంగీతపరంగా భీమ్స్‌ బాగానే చేశాడు. సాహిత్యం ఫర్వాలేదు. వనమాలి, సీతారామశాస్త్రి గీతాలు బాగున్నాయి. దర్శకుడు అనీష్‌ కృష్ణ తొలిసారయినా ఫర్వాలేదు.
 
విశ్లేషణ 
యూత్‌ సినిమాల పేరుతో వస్తున్న కొన్ని బూతు చిత్రాలు కంటే కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. స్కూల్‌ డేస్‌లోనే బ్లూఫిలిం చూసే సన్నివేశాలు ఇప్పటి కుర్రాళ్లు ఇలా వున్నారనేట్లుగా చూపించాడు. విలేజ్‌లో అమ్మాయిలు కూడా సిటీ అమ్మాయిలు లాగే బిహేవ్‌ చేస్తారు. కానీ అక్కడి పరిస్థితులను బట్టి నడుచుకుంటారని కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు చూపించాడు. ఇలా ఇప్పటి జనరేష్‌ సిటీ, విలేజ్‌లో వున్నా వారి మనస్తత్వం ఏమీ మారదు. చుట్టూ వాతావరణం మాత్రమే మారుతుందని చెప్పాడు.
 
ప్రతీదీ ఈజీగా తీసుకునే హీరో.. గ్రామంలోని సంఘటనలతో కొంత మారతాడు. అతనిలోని మానవీయ కోణం ఆవిష్కరణమవుతుంది. పెద్దల కుదిర్చిన పెండ్లిని తను ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిగా మార్చుకోవడం హీరో చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఇందులో ముగింపు బాగుంది. సరదాగా ఈ చిత్రాన్ని చూడవచ్చు. పెద్ద స్టార్‌ కాస్టింగ్‌ లేకుండా పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాను ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.
రేటింగ్: 3/5