మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By PNR
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2014 (13:27 IST)

అక్క చావుకు చెల్లెలు ప్రతీకారం.. ఇదే అంజలి 'గీతాంజలి' రివ్యూ

నటీనటులు: అంజలి, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మానందం తదితరులు
 
నిర్మాత: ఎవివి సత్యనారాయణ, సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, సమర్పణ: కోన వెంకట్‌, దర్శకత్వం: రాజ్‌కిరణ్‌..

విడుదల: 9.7.2014.. శనివారం..
 
పాయింట్‌: అక్కడ చావుకు చెల్లెలు ప్రతీకారం.
 
ఇటీవల హర్రర్‌ సినిమాల్లో కామెడీ కలిపేస్తూ వస్తున్న ఫార్మెట్‌ చిత్రాలు వస్తున్నాయి. ప్రేమకథా చిత్రమ్‌తో ఆ తరహా కథలు కొత్తగా పుడుతున్నాయి. అటువంటి ప్రయత్నమే కోన వెంకట్‌ చేశాడు. వైజాగ్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని సినిమారంగంలోకి దింపి.. తీయించాడు. ఇందులో కామెడీ ఆర్టిస్టు శ్రీనివాసరెడ్డి హీరో. దర్శకుడిగా రాజ్‌కిరణ్‌. కొత్త.. సినిమా విడుదలకు ముందే చెస్ట్‌పెయిన్‌ వచ్చి ఆసుపత్రి పాలైన దర్శకుడు.. ఈ చిత్రాన్ని ఎలా తీశాడో చూద్దాం.
 
ఇది పూర్తిగా 'నేనింతే' తరహాలో సినిమా నేపథ్యం. గొప్ప దర్శకుడు అవ్వాలని నందిగామ అనే ఊరు నుంచి హైదరాబాద్‌లో కృష్ణనగర్‌లో చేరతాడు శ్రీనివాస్‌ (శ్రీనివాసరెడ్డి). వచ్చీరాగానే నిర్మాతల కోసం వేట మొదలుపెట్టడం, వారు కాదనడం జరిగిపోతాయి. ఆఖరికి  రమేష్‌ రావు (రావు రమేష్‌)కి కథను వినిపించే అవకాశం వస్తుంది. అతనికో వీక్‌నెస్‌. తాను సినిమా తీసి దానికి అవార్డు పొంది తన తండ్రికి అంకితమివ్వాలని కలలు కంటుంటాడు. 
అయితే ఈసారి కథలో హీరోగా తననే ఊహించుకుని శ్రీనివాస్‌ కథ చెబుతాడు. అది ఒరిజినల్‌ జరిగిన కథే. దాని ప్రకారం.. శ్రీనివాస్‌ ఇంట్లో రోజు అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ ఇంట్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. ఆ యువతి పగ కోసం రగిలిపోతూ ఒకర్ని టార్గెట్‌గా పెడుతుంది. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు చనిపోయింది. అంజలి పాత్ర ఏమిటి? అనేది కథ.
 
నటీనటులు:
అంజలి ఇందులో ద్విపాత్రాభినయం చేసింది. అక్కాచెల్లెల్లుగా నటించింది. దెయ్యానికి తగినట్లుగా బాగా నటించింది. ఇక శ్రీనివాస రెడ్డి నటన టైమింగ్‌ బాగుంటుంది. సహజంగానే చేసేశాడు. ఇక బ్రహ్మానందం గురించి చెప్పాలంటే సెకండాఫ్‌లో వచ్చి మెరుపులుమెరవాలని చూస్తాడు. కానీ, దర్శకుడులోపంతో సరైన విధంగా అతన్ని వాడుకోకపోవడంతో ఏదో తనకు నచ్చినట్లే బ్రహ్మానందం పాత్ర చేశాడు అనిపిస్తుంది. రావు రమేష్‌ పాత్ర నిర్మాత తగినట్లుగా బిహేవ్‌ చేశాడు. హర్షవర్ధన్‌ రానే పర్వాలేదు. మిగిలినవారు మామూలే.
 
టెక్నికల్‌గా...
థ్రిల్లర్‌ ఎపిసోడ్‌కు ఫొటోగ్రఫీ కీలకం. దానికి మార్కులు వేయవచ్చు. ఇలాంటి కథలు మరో చిత్రం పోలిక అనిపంచకూడదు. ఈ చిత్రంలో అదే కన్పిస్తుంది. ఫస్టాప్‌తో కథ ఏదోలా సాగిపోతుంది. సెకండాఫ్‌లో ఇంకాస్త మెరుగుపడుతుంది అనుకున్నప్పుడుల్లా డ్రాప్‌ అయిపోతుంది. కామెడీ, ఎమోషనల్‌ సన్నివేశాల్లో దర్శకుడు సరిగ్గా చేయలేకపోయాడు. ప్రవీణ్‌ సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్‌ భయంకరంగా వుండాలి. అదే మైనస్‌. నిర్మాణపు విలువలు ఫర్వాలేదు.
 
విశ్లేషణ..
కథనంలో కొత్తదనం లోపిస్తే ఎలా వుంటుదనేందుకు గీతాంజలి ఓ మంచి ఉదాహరణ. మాటల రచయితగా స్క్రీన్‌ప్లేగా కోనవెకంట్‌ చెప్పిన కబుర్లన్నీ మాయగా వున్నాయి. అందులో కొంతవరకు సక్సెస్‌ అయినా ఫర్వాలేదు అనిపిస్తుంది. అంజలి ఇద్దరనే విషయం ఇంటర్‌వెల్‌ తర్వాత తెలుస్తుంది. చిత్రంలో ఆసక్తికరపాయింట్‌... నిర్మాతే అసలు విలన్‌. ఆ విషయం కథ చెప్పే రచయిత శ్రీనివాస్‌కు తెలియకపోవడం. కానీ ముగింపు ఇంకాస్త ఇంట్రస్ట్‌గా తీస్తే బాగుండేది. ఓం శాంతి ఓం హిందీ చిత్రపు ఛాయలు కూడా కొన్నిచోట్ల కన్పిస్తాయి.
 
ఇక కామెడీ తీయాలంటే దానికి పట్టుకావాలి. ఆరిస్టులకు ఎంత టైమింగ్‌ తెలిసినా దర్శకుడి చెప్పే సీన్‌ ఆసక్తిగా ఉడాలి. చిత్రంలో లోపం అదే. చిత్రం విడుదలకు ప్రోమో సాంగ్‌ బ్రహ్మానందంపై రిలీజ్‌ చేశారు. అది ఎంత చెత్తగా వుందో... సినిమా కూడా అలానే వుంది. హారర్‌ చిత్రాలకు రీరికార్డింగ్‌ కీలకం. చిత్రాన్ని నవ్వించాలన్నా, భయపెట్టాలన్నా అందులో పట్టు వున్నవారికే సాధ్యం ప్రేమకథా చిత్రమ్‌ అందుకే హిట్‌ అయింది. అలాంటి ఫార్మెట్‌లో తీసి మెప్పించలేని సినిమా గీతాంజలి.