శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (15:46 IST)

బేతాళుడు రివ్యూ రిపోర్ట్.. సైకలాజికల్ థ్రిల్లర్‌.. జయలక్ష్మిపై బిచ్చగాడు పగతీర్చుకుంటాడా? హిట్ ఖాయమా?

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన సినిమా బేతాళుడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన విజయ్ ఆంటోని, వైవిధ్య స్క్రిప్ట్‌లను ఎంచుకుంటారు. ఈ క్రమం

సినిమా : బేతాళుడు
తారాగణం : విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్, చారు హాసన్, మీరా కృష్ణన్ తదితరులు
సంగీతం : విజయ్ ఆంటోని
దర్శకత్వం : ప్రదీప్ కృష్ణమూర్తి
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని
జానర్ : సైకలాజికల్ థ్రిల్లర్
 
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన సినిమా బేతాళుడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన విజయ్ ఆంటోని, వైవిధ్య స్క్రిప్ట్‌లను ఎంచుకుంటారు. ఈ క్రమంలో బిచ్చగాడు సినిమా భారీ కలెక్షన్లను సాధించిపెట్టింది. తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా బేతాళుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి రివ్యూ ఎలా ఉందో చూద్దాం.. 
 
కథలోకి వెళ్తే.. 
దినేష్( విజయ్ ఆంటోని), ఓ తెలివైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉండే దినేష్, మెట్రీమోని సైట్ లో చూసి అనాథ అయిన ఐశ్వర్య(అరుంధతి నాయర్)ను పెళ్లి చేసుకుంటాడు. అంతా సాఫీగా జరుగుతుందనుకున్న సమయంలో విజయ్ విచిత్రంగా ప్రవర్తించాడు. ప్రతీ దానికి భయపడటం.. తనకేదో గొంతు వినిపిస్తున్నట్లు అనిపిస్తున్నట్లు ప్రవర్తిస్తాడు. ఆ గొంతు తనని, జయలక్ష్మీ చంపేసిందని ఆమె మీద పగ తీర్చుకొమ్మని చెప్తుంటుంది. దినేష్ పరిస్థితి చూసి అతన్ని ఓ మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళతారు. 
 
డాక్టర్ ట్రీట్‌మెంట్‌తో తన గత జన్మ స్మృతులు దినేష్‌కు గుర్తుకు వస్తాయి. గత జన్మలో బ్రహ్మచారిగా శర్మ పేరుతో ఉండే విజయ్ అనాథ పిల్లాడిని (గోపాలం) దత్తత తీసుకుంటాడు. ఆ క్రమంలో జయలక్ష్మీ శర్మకు దగ్గరై గోపాలంకు అమ్మగా మారుతుంది. కానీ నటరాజ్ అనే వ్యక్తి జయలక్ష్మీకి దగ్గరవుతాడు. అదే సమయంలో జయలక్ష్మి ఓ మగ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ అనుకోకుండా శర్మ చేతిలో చనిపోతాడు. దీంతో శర్మ కావాలనే తన బిడ్డను చంపేశాడన్న పగ పెంచుకున్న జయలక్ష్మీ, నటరాజ్‌తో కలిసి శర్మను, అతడి కొడుకు గోపాలాన్ని చంపేస్తుంది.
 
ఇవన్నీ తెలుసుకున్న దినేష్ కొన్ని నెలల తరువాత మామూలు మనిషిగా హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు. కానీ దినేష్ హాస్పిటల్ లో ఉన్న సమయంలో, తన వల్లే దినేష్ ఇలా అయిపోయాడని లెటర్ రాసిపెట్టి దినేష్ భార్య ఐశ్వర్య వెళ్లిపోతుంది. ఆమె ఏమౌతుంది.. ఐశ్వర్యకు శర్మకు సంబంధం ఉందా..? జయలక్ష్మీ మీద విజయ్ పగ తీర్చుకున్నాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
ఫెర్‌ఫార్మెన్స్..  
బిచ్చగాడులో అదరగొట్టిన విజయ్ ఆంటోనీ బేతాళుడుగా తన మార్క్ చూపించాడు. రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమా అంతా విజయ్ ఆంటోని వన్ మన్ షోగా నడిచినా.. ఎక్కడా బోర్ కొట్టించకుండా మెప్పించాడు. హీరోయిన్ పాత్రలో కనిపించిన అరుంధతి నాయర్ మంచి నటన కనబరిచింది. అందంగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో చారు హాసన్, మీరా కృష్ణన్, వైజీ మహేంద్రలు పాత్రలకు న్యాయం చేశారు. 
 
సాంకేతిక నిపుణులు : 
బిచ్చగాడుతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనిని.. భేతాళుడుగా చూపించిన దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి మంచి విజయం సాధించాడు. తొలి 20 నిమిషాలు కాస్త స్లోగా నడిచినట్టుగా అనిపించినా.. అసలు కథ మొదలైన తరువాత ప్రతీ సీన్‌ను ఆసక్తి కరంగా తెరకెక్కించాడు. కథా పరంగా ఓకే. అయితే  జన్మ విశేషాలను హీరో నిజంగా వెళ్లి తెలుసుకున్నాడా..? లేక కలలోనే అవన్ని తెలిశాయా..? అన్న క్లారిటీ మిస్ అయ్యింది. విజయ్ ఆంటోని అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు పెద్దగా అలరించకపోయినా.. నేపథ్యం సంగీతంతో మాత్రం సినిమా స్థాయిని పెంచింది.
 
ప్లస్ పాయింట్స్ : 
కథ
సంగీతం
విజయ్ ఆంటోనీ నటన
 
మైనస్ పాయింట్స్ : 
కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం
స్లో నారేషన్
క్లైమాక్స్