శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 8 మే 2015 (18:40 IST)

లక్ష్మీ మంచు 'ఏందిరా మీ మగాళ్ల...' దొంగాట రివ్యూ రిపోర్ట్

'దొంగాట' నటీనటులు : మంచు లక్ష్మీ, అడవి శేష్‌, ప్రభాకర్‌, బ్రహ్మానందం, గిరిబాబు, మధునందన్‌, జయప్రకాష్‌రెడ్డి, అన్నపూర్ణ, ప్రగతి, పృధ్వీ, నర్సింగ్‌ యాదవ్‌ తదితరులు.
 
టెక్నికల్‌గా.. కెమెరా: సామల భాస్కర్‌, మాటలు సాయిమాధవ్‌ బుర్రా, సంగీతం: సత్యమహవీర్‌, రఘుకుంచె, స్క్రీన్‌ప్లే: ఎన్‌ వంశీకృష్న, మోహన్‌ భరద్వాజ్‌, సహనిర్మాత: గాంధీ, నిర్మాత: మంచులక్ష్మీ, కథ, దర్శకత్వం: ఎన్‌. వంశీకృష్ణ.
 
ఈమధ్య సినిమాలు సరదాగా సాగుతూ అందరినీ టైంపాస్‌ చేసే కథలు వస్తున్నాయి. ఆ కోవలోకే దొంగాట సినిమా చేరుతుంది. కథ పెద్దగా లేకపోయినా.. ఉన్న చిన్నపాటి పాయింట్‌తో రకరకాల పాత్రలను అల్లుతూపోతూ ఎంటర్‌టైన్‌ చేయడమే ఈ చిత్రం ముఖ్యోద్దేశ్యం. గత కొద్దిరోజులుగా తను పాడిన 'ఏందిరా..మీ మగాళ్ళ..'పాటతో ఇండస్ట్రీని ఆకట్టుకున్న లక్ష్మీ సినిమాపై నమ్మకంతో వుంది. పైగా 'బుడుగు' సినిమాతో అందరినీ భయపెట్టిన లక్ష్మీ మంచు అప్పుడే తన టోటల్‌ గెటప్‌‌ని మార్చుకొని ఈసారి ఆడియన్స్‌‌ని తెగ నవ్వించాలని చేసిన సినిమా ఇది. మరి ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం.
 
కథ :
ఇది కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన కథగా ముందు సీన్‌తో తెలిసిపోతుంది. శ్రుతి (మంచు లక్ష్మీ) విజయవంతమైన కథానాయిక. ఆమె పుట్టినరోజను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయాలనుకుంటుంది. కానీ ముందు రాత్రే ఆమె కిడ్నాప్‌ అవుతుంది. ఆమె తల్లి జ్యోతిలక్ష్మి(ప్రగతి)ని కిడ్నాపర్లు 10 కోట్లు డిమాండ్‌ చేస్తారు. వెంకట్‌(అడవి శేష్‌), కాటం రాజు(వేణు గోపాల్‌), విజ్జు(మధు)లు కలిసి కిడ్నాప్‌ చేస్తారు. పైగా ఇవ్వకుంటే చంపేస్తామంటారు. ఈ టైంలో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిటెక్టివ్‌ మేన్‌ ఆన్‌ ఫైర్‌(బ్రహ్మానందం) రంగంలోకి దిగుతాడు. బ్రహ్మి శృతిని రక్షించడం కోసం ఏం చేసాడు.? అసలు ఆమెను కిడ్నాప్‌ చేయడానికి మరో కారణం ఏమిటి? చివరికి ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
ప్లస్‌ పాయింట్స్‌ :
ఈ మధ్య టాలీవుడ్‌‌లో సూపర్‌ హిట్‌ ఫార్ములాగా మారిన క్రైమ్‌ కామెడీ జోనర్‌‌ని ఈ సినిమా కోసం ఎంచుకోవడం. క్రైమ్‌ ద్వారా వచ్చే సస్పెన్స్‌‌ని కామెడీతో కలిపి ప్రేక్షకులను బాగా నవ్వించడం, ఇలా రెండింటిని సమపాళ్ళలో చూపించడమే దొంగాటకి బిగ్గెస్ట్‌ ప్లస్‌ పాయింట్‌. సినిమా స్టార్టింగ్‌ చాలా వేగంగా ఉంటుంది. ఆడియన్స్‌‌ని కథలో త్వరగా ఇన్వాల్వ్‌ చేసారు. ఇంటర్వల్‌ బ్లాక్‌ ముందు వచ్చే 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఆలాగే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా బాగుంటుంది. అంతేకాకుండా స్టార్స్‌ అందరితో చేసిన ఓ స్పెషల్‌ సాంగ్‌ ఆడియన్స్‌ చేత విజిల్స్‌ కొట్టిస్తుంది. అంతమంది హీరోస్‌ ఒకేసారి ఆన్‌‌స్క్రీన్‌‌పై కనిపించడం ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేసేలా చేస్తుంది.
 
పెర్‌ఫార్మెన్స్‌
ఈ చిత్రానికి కర్త,కర్మ,క్రియ అన్నీ మంచు లక్ష్మీ.. సింగిల్‌ హాండ్‌తో డీల్‌ చేసింది. నటనలో అన్ని షేడ్స్‌ పలికించింది. ముఖ్యంగా కామెడీని కూడా పండించడం విశేషం. ఇక కిడ్నాపర్లు బాగానే నటించారు. బ్రహ్మానందం పాత్ర నవ్వు తెప్పిస్తుంది. ఇక అడవి శేష్‌ ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్‌. ఈ ఆరడుగుల కటౌట్‌ చూడటానికే కాదు, నటనలోనూ ది బెస్ట్‌ అనిపించుకున్న సినిమా దొంగాట. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీ మధ్య వచ్చే సీన్స్‌ ఆడియన్స్‌‌ని బాగా నవ్విస్తాయి. ప్రగతి తన పాత్రలో మెప్పించింది. దొంగాట సినిమాకి సెకండాఫ్‌ చాలా పెద్ద ప్లస్‌ పాయింట్‌. అటు సస్పెన్స్‌, ఇటు కామెడీని సమంగా డీల్‌ చేసాడు. అంతేకాకుండా ప్రిక్లైమాక్స్‌, క్లైమాక్స్‌ ట్విస్టులు ఆడియన్స్‌‌ని థ్రిల్‌ చేసాయి. జె.పి. పాత్ర ఫర్వాలేదు. మిగిలినవారు పరిమితి మేరకే నటించారు.
 
సాంకేతిక విభాగం: సినిమాటోగ్రాఫర్‌ సామల భాస్కర్‌ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథ కోసం ఎంచుకున్న ప్రతి లొకేషన్‌‌ని చాలా బాగా చూపించాడు. క్రైమ్‌ కామెడీకి కీలకమైన నటీనటుల హావ భావాలను బాగా కాప్చ్యూర్‌ చేసాడు. రఘు కుంచె, సత్య మహావీర్‌, సాయి కార్తీక్‌ అందించిన సాంగ్స్‌ బాగున్నాయి. అలాగే సాయి కార్తీక్‌ బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా సినిమాకి మరో మేజర్‌ ప్లస్‌ అయ్యింది. ఎస్‌అర్‌ శేఖర్‌ ఎడిటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌‌లో ఓకే అనిపించింది, కానీ సెకండాఫ్‌ పరంగా మాత్రం వెరీ గుడ్‌ అనేలా ఉంది.
 
విశ్లేషణ
కథనం ఊహకు అందని విధంగా వుండాలి. ఈ చిత్రంలో అదే చూపించారు. అయితే కొన్నిచోట్ల స్లో నెరేషన్‌ బ్రేక్‌ పడుతుంది. బ్రహ్మానందంతోనే కాకుండా కీ రోల్స్‌ పైన కూడా ఎంటర్టైన్మెంట్‌ ఎక్కువగా ఉండేలా ప్లాన్‌ చేసుకోవాల్సింది. సంభాషణ పరంగా బుర్రా సాయిమాధవ్‌ కృషి కన్పించింది. పంచ్‌ డైలాగ్‌తో అలరించాడు. కృష్ణం వందే జగద్గురుంకు రాసిన ఆయన మాటలు ఈ చిత్రానికి బాగా ప్లస్‌ అయ్యాయి. కిడ్నాప్‌ కథలు కొత్తేమి కాకపోయినా.. దాన్ని ఆసక్తికరంగా చూపించడం ప్రత్యేకత వుండాలి. అది ఇంకాస్త వుంటే బాగుండేది. నిర్మాణపు వాల్యూస్‌ బాగున్నాయి. మొదటి పార్ట్‌ సరదాగా సాగుతూ కాస్త బోర్‌కొట్టే విధంగా వున్నా సెకండాఫ్‌లో అది లేకుండా జాగ్రత్తపడ్డారు.
 
చివర్లో అందరినీ థ్రిల్‌ చేసి ఓ హ్యాపీ ఫీల్‌‌తో బయటకి వచ్చేలా చేస్తుంది.  ఏందిరో.. మీ మగాళ్ళ.. పాట ఆమె వాయిస్‌ సూటయింది. తొమ్మిది హీరోల పాత్ర అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినా కొత్త ప్రయోగం చేశారు. మొత్తానికి మాస్‌ పల్స్‌ తెలిసిన దర్శకుడు వంశీకృష్ణ చేసిన ప్రయత్నం ఫలించింది. పెద్ద చిత్రాలు ఏమీ లేవు గనుక పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం మాస్‌ను ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
 
రేటింగ్‌: 3/5