గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 22 మే 2015 (18:01 IST)

లాజిక్ లేని ఎంతవాడు గానీ.. రివ్యూ రిపోర్ట్

ఎంతవాడుగానీ నటీనటులు :  అజిత్‌‌, త్రిష, అనుష్క, నాజర్‌ తదితరులు; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతం వాసుదేవన్‌ మీనన్‌.

గౌతం వాసుదేవన్‌ మీనన్‌ చిత్రాలు ప్రేమకథలతో పాటు మాఫియా చిత్రాలు కూడా తీయగలడని నిరూపించుకున్నాడు. ఇప్పుడు తీసిన 'ఎంతవాడు గానీ..' చిత్రం తమిళ డబ్బింగ్‌. సమాజంలో బయటకు కన్పించని మనిషి అవయవాలను మాయం చేసే మాఫియా ఒకటి వుందనీ, దానితో జాగ్రత్తగా వుండాలని చెప్పే ప్రయత్నం చేశాడు. ధర్మం, అధర్మం మధ్య పోటీ ఎప్పుడూ వుంటుంది. ధర్మమే గెలుస్తుందని ఆయన చెప్పిన సత్యం.
 
కథగా చెప్పాలంటే...
సత్యదేవ్‌(అజిత్‌) డిజిపి. చిన్నతనంలో తన తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపిన మాఫియాపై పగ పెట్టుకుని.. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరతాడు. డ్రగ్స్‌, చట్టవ్యతిరేక పనులు చేసే ఓ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి జైలులో ఖైదీగా వెళ్ళి రాబర్ట్‌ అనే రౌడీ ద్వారా వాళ్ళ గ్యాంగ్‌లో చేరతాడు. అక్కడ అన్యాయంగా మనిషి అవయవాలతో వ్యాపారం చేసే ముఠానాయకుడు కాల్చేస్తాడు. ఆ గొడవలో రాబర్ట్‌ తప్పించుకుంటాడు. కొన్నాళ్ళకు అనుష్కపై దాడి జరుగుతుంది. అది కూడా సత్యదేవ్‌తో మాట్లాడుతుండగా వీరిద్దరికి విమాన ప్రయాణంలో పరిచయం.. విషయం తెలిసిన సత్యదేవ్‌... అనుష్క ప్రాణానికి ప్రమాదం వుందని కనిపెట్టి తన రక్షణంలో వుంచుతాడు. అయినా.. ప్లాన్‌ ప్రకారం.. అనుష్కను కిడ్నాప్‌ చేయాలని రాబర్ట్‌ ప్రయత్నిస్తాడు. అనుష్క గుండెను చావుకు దగ్గరగా వున్న మిలియనీర్‌కు అమర్చడానికి రాబర్ట్‌ కోట్లు తీసుకుంటాడు. ఇక ఈ వార్‌లో ఎవరిది పైచేయి? మధ్యలో త్రిష పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
వయస్సు పైబడుతున్న అందంగా కన్పించే అజిత్‌.. ఈ చిత్రానికి పోలీసు అధికారిగా సరిపోయాడు. పైట్స్‌ బాగా చేశాడు. రాబర్ట్‌గా నటించిన వ్యక్తి బాగా నటించాడు. విలన్‌, హీరో పోటాపోటీగా వున్నారు. త్రిష క్లాసికల్‌ డాన్సర్‌గా నటించింది. అనుష్క.. నటించడానికి పెద్దగా లేకపోయినా ఫర్వాలేదు. ఇక మిగిలిన పాత్రలన్నీ మామూలే.
 
టెక్నికల్‌గా..
ఫొటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. పాటలకు పెద్దగా ఆస్కారం లేకపోయినా.. క్లాసికల్‌ డాన్సర్‌గా త్రిష డాన్స్‌ బాగుంది. అజిత్‌ డబ్బింగ్‌ సూటయింది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్వాలేదు.
 
విశ్లేషణ
మాఫియా చిత్రాలు కొత్తేమీకాదు. పెద్దపెద్దనగరాల్లో ఇదొక వ్యాపారం. కోట్ల రూపాయలు చేతులుమారుతుంటాయి. ఇందులోనివారు కర్కశంగా వుంటారు. అలాంటివారిని తన దారిలో తీసుకురావాలని అజిత్‌ ప్రయత్నం చేస్తాడు. కానీ సాధ్యపడదు. అందుకే వారి బాణీలో వెళ్ళి.. తనదారికి తెచ్చుకుంటాడు. అయితే చిత్రంలో... అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేయడం, వారి అవయవాలు మార్చేయడం బాగానే వుంది. కానీ అవి అవతలి వారికి సూటవుతాయో లేదా? అనేది చూడకుండా కొంతమంది బలిపశువులను కూడా చేస్తారు. ఆఖరికి అనుష్క గుండె సరిపోతుందని దాన్ని సుమన్‌కు పెట్టాలని చెబుతాడు. కానీ అనుష్క గుండె ఇతనికే ఎందుకు పెట్టాలి? దానికి సరైన రీజన్‌ చూపించలేదు. 
 
అన్ని టెస్ట్‌లు జరిగాక.. ఎక్సేంజ్‌ చేస్తుంటారు. అలాకాకుండా ఏమీ తెలీకుండానే చేస్తున్నట్లు ఇందులో చూపిస్తాడు. రైల్వే ప్రయాణంలో అజాగ్రత్తగా వుంటే పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు వుంటాయి జాగ్రత్త అని హెచ్చరిక దర్శకుడు చేశాడు. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా దర్శకుడు కన్పిస్తాడు. ఏదైనా టెక్నికల్‌గా, ఎమోషనల్‌గా, బాగా చూపించిన ఈ చిత్రం ఏవరేజ్‌ చిత్రమవుతుంది. 
 
రేటింగ్‌: 2/5