గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శనివారం, 23 మే 2015 (14:34 IST)

'365 డేస్‌' బ్లూ ఫిల్ములు నువ్వు కూడా చూడు... మోజులో కపుల్స్... వర్మ చిత్రం రివ్యూ

365 డేస్ చిత్రం నటీనటులు : నందు, అనైక సోఠి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు తదితరులు.
విడుదల తేదీ : 22 మే 2015.
రచన, దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ.
నిర్మాత : డి.వెంకటేష్‌.
సంగీతం : నాగ్‌ శ్రీ వత్స, ఎల్‌.ఎం ప్రేమ్‌.
వర్మ చిత్రాలంటే ఒకప్పుడు టేకింగ్‌, సౌండింగ్‌ బాగా చేస్తాడని పేరుంది. రానురాను ఆయన పనితనంలో కేర్‌లెస్‌ కన్పిస్తుంది. దానికి కారణాలు ఆయా చిత్రాలు పరాజయం పాలుకావడమే.. కానీ తక్కువ బడ్జెట్‌తో తీయడంతో సేఫ్‌జోన్‌గా నిలిచిన సందర్భాలున్నాయి. కాగా, ఈసారి పెద్దలు చేస్తున్న పెండ్లిళ్లు కరెక్టా? కాదా? దీనికి పరిష్కారం కూడా తాను చెప్పిందే కరెక్ట్ అనను... అంటూ పబ్లిసిటీ చేసిన ప్రయోగమే '365' డేస్‌. ఏడాదిలోనే ఏ వ్యాపారమైనా.. అటోఇటో తేల్చేస్తారు. పెండ్లి కూడా అలాంటిదేనన్న లాజిక్క్‌తో ముందుకు వచ్చిన వర్మ 365 డేస్‌లో ఏం చెప్పాడో చూద్దాం. 
 
కథ :
తనకిష్టం వచ్చినట్లు వుండాలనుకునే కుర్రాడు అపూర్వ్‌(నందు), అదే ఆలోచనలతో వుండాలనుకునే శ్రియ(అనైక సోఠి). ఇద్దరు యూత్‌ఫుల్‌ పార్టీలో కలుసుకుని ప్రేమించుకుని పెండ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీరిపై ప్రేమ ఒకరికపై ఒకరికి అంతగా వుండదు.. అపూర్వ్‌ ఉద్యోగంలో సమస్యలు శ్రియకు అవసరంలేదు. పెండ్లికి ముందు ఎలా చూసుకున్నావో అలా చూసుకోవడంలేదని గొడవ. ఇలా ప్రతి చిన్నవిషయానికి లాజిక్కులు వెతుక్కుని 365వ రోజున విడిపోతారు. అలా మూడు 365 రోజుల తర్వాత.. మళ్ళీ కలిసి హాయిగా కాపురం చేసుకుంటారు. అసలు వీరు ఎందుకు విడిపోయారు. మళ్లీ ఎందుకు కలిశారనేది ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రతి 100 రోజులకొకసారి ఏం జరిగిందనేది వర్మ చెప్పిన కథ. 
పెర్‌ఫార్మెన్స్‌
ఇందులో నందు, అనైక ఇద్దరూ బాగానే పాత్రలకు సరిపోయారు. నందు ఆఫీస్‌ బాస్‌ పోసాని పాత్ర హైలైట్‌...ఇప్పటి జనరేష్‌ పెండ్లి పేరుతో చేసే జిమ్మిక్కులు చెబుతుంటాడు. కృష్ణుడు, నందు స్నేహితునిగా నటించాడు. రావి కొండలరావు, గీతాంజలి ఇద్దరూ అనైక బామ్మ, తాతయ్యగా నటించారు. 
 
టెక్నికల్‌గా..
సాంకేతిక విభాగం- అనిత్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం ఫర్వాలేదు. ఎక్కడా బోర్‌కొట్టదు. శేషు కె.ఎం.ఆర్‌ బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. అన్సర్‌ అలీ ఎడిటింగ్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దర్శకుడు కథ కోసం ఎంచుకున్న పాయింట్‌ చాలా చిన్నది, అలాంటి స్టొరీ లైన్‌‌ని స్క్రీన్‌‌ప్లే మరియు సీన్స్‌‌తో ఆకట్టుకోవాలి. కానీ సీన్స్‌ చాలా రెగ్యులర్‌‌గా ఉండటంతో ఓవరాల్‌‌గా ఆడియన్స్‌‌ని మెప్పించలేకపోయింది. ఇకపోతే దర్శకుడిగా నటుల నుంచి కాస్త పెర్ఫార్మన్స్‌ రాబట్టుకోగలిగినా, ఆద్యంతం ఆడియన్స్‌‌ని కూర్చోబెట్టగలిగే సినిమా ఇవ్వలేకపోయాడు.
 
విశ్లేషణ
వర్మ పెండ్లి మీద కథతో సినిమా తీయడమే గొప్పవిషయం. కథలో ఎక్కడా కొత్తదనం కన్పించదు. 'అంతకుముందు ఆ తర్వాత' అనే కాన్సెప్ట్‌ ఆల్‌రెడి దీనిపై దర్శకుడు మోహన్‌ తీశాడు. ఈ చిత్రంలోని పాయింట్‌ కూడా అదే. అందులో సహజీవనం చేస్తారు. ఇక్కడ పెండ్లి చేసుకుని గొడవబడి విడిపోతారు. ఒక పాయింట్‌ రకరకాలుగా మార్చిమార్చి చెప్పడం వర్మకు వెన్నతో పెట్టిన విద్యే. సినిమా మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమ, గొడవలు, అలకలు వుంటాయి. అయితే కథనంలో రాసుకున్న సీన్స్‌‌లో ఎమోషన్స్‌‌ని, ప్రేమలో ఉన్న ఫీలింగ్‌‌ని పర్ఫెక్ట్‌‌గా చూపగలిగితే ఆడియన్స్‌ ఎంటర్టైన్‌ అవుతారు. కానీ కథనంలో ఆ మేజిక్‌ కనిపించలేదు.
 
సినిమా పరంగా సెకండాఫ్‌ పెద్ద మైనస్‌.. ఫస్ట్‌ హాఫ్‌ అలా అలా సాగిపోయినా సెకండాఫ్‌‌లో మాత్రం అస్సలు ముందుకు వెళ్ళదు.. సినిమాని మరీ సాగదీసేసారు. మరీ ఊహాజనితంగా సాగుతుంది. తను చెప్పాలనుకున్న పాయింట్‌ చాలా సింపుల్‌ కావడం వలన వర్మ డైరెక్టర్‌‌గా కూడా ఏమీ మేజిక్‌ చేయలేకపోయాడు. ఎంతసేపు పెళ్ళైన వారి మధ్య గొడవలు తప్ప ఇంకేమీ ఉండవు అని చూపించే ప్రయత్నమే తప్ప వేరే ఏమీ చూపించకపోవడం చెప్పదగిన మైనస్‌ పాయింట్‌.  
 
సమాజంలో ఈరోజు ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా వున్నాయి.. కొంతమంది బాగానే ఉంటున్నారు. మరికొంతమంది విడిపోతున్నారు. విడిపోతే.. ఆస్తంతా రాసిచ్చేయాల్సివస్తుంది. ఇది కూడా వ్యాపారమే... అసలు పెండ్లిచూపులకు ముందే... అబ్బాయి జీతం, ఎంత సంపాదిస్తాడు.. అనేది అమ్మాయి చూస్తుంది. అమ్మాయి అందంగా వుందా? వంటి బ్యాక్‌గ్రౌండ్‌ అబ్బాయి చూస్తారు. విడిపోతే.... ఆస్తిలో వాటా ఇవ్వాలి. పెళ్లిలో పూజారి, పెండ్లిలో ఏర్పాటు చేసిన వారందరికీ డబ్బుతో కొనాలి... ఇలా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ.... అవును ఇది కరెక్టే.. అవును ఇది తప్పే... అనేలా ఆలోచించే మనస్తతం వున్న వర్మ, తనలాంటి వారికోసం   చేసిన ఇదే.. ఇంతాచెప్పి.. ఏది కరెక్టో అనేది నాక్కూడా తెలీదు... అంటూ బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ కూడా ఇవ్వడం... వర్మ మైండ్‌సెట్‌కు తార్కారణం. అలాంటప్పుడు ఈ సినిమాను ఎందుకు చూడాలని ప్రేక్షకుడు అనుకుంటే... ఢమాలే...
ప్రేమ పేరుతో మగాడు అమ్మాయిపై మోజుతో వెంటపడతాడు. అది తీరాక.. అంతగా ప్రేమించడు. ఇది సత్యం అంటూ పోసాని పాత్ర ద్వారా చూపించాడు. ఇలా తిమ్మినిబమ్మిని చేసి తీసిన ఈ చిత్రం ఫ్యామిలీతో కూర్చుని చూడతగ్గది మాత్రం కాదు. ఎందుకంటే.. ఆఖరికి.. బ్లూఫిల్మ్‌లు చూడ్డం కూడా తప్పుకాదు. అవసరమైతే నువ్వు కూడా చూడు.. అందరూ చేసే పని నేను చూస్తున్నానంటూ.. లాజిక్కుగా చూపించాడు. ఈ చిత్రానికి ఆ ఒక్కటి లేకపోతే.. బాగుండేది.
 
రేటింగ్‌: 2/5