గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By PNR
Last Updated : శనివారం, 10 జనవరి 2015 (10:29 IST)

'గోపాల గోపాల' రివ్యూ... దేవుడిపై కేసు.. దిగొచ్చిన గాడ్! ఇదే ఫస్టాప్ స్టోరీ..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం "గోపాల గోపాల" శనివారం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. దీంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులకు నాలుగు రోజులకు ముందుగానే సంక్రాంతిని జరుపుకుంటున్నారు. కాగా, శనివారం ఉదయం ఆటతో ప్రారంభమైంద. ఈ చిత్రం మొదటి భాగం కథను పరిశీలిస్తే... 
 
గోపాల (విక్టరీ వెంకటేష్) వివిధ రకాల దేవుడి ప్రతిమలను విక్రయించుకునే చిరు వ్యాపారి. అతని షాపుకు ఒక సాధువు వస్తారు. ఆ సాధువుతో గోపాల చిన్నపాటి గొడవ పడతాడు. దీంతో ఆగ్రహించిన ఆ సాధువు.. గోపాలను శపిస్తాడు. అలా శపించిన మరుసటి రోజే భూకంపం వచ్చి కేవలం గోపాల షాపు మాత్రమే ధ్వంసమై పోతుంది. దీంతో ఇతర వ్యాపారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గోపాలను ఓదార్చుతారు. 
 
అయితే, గోపాల మాత్రం ఆ సాధువు శాపం వల్లే ఇలా జరిగిందని వారికి వివరిస్తారు. అదేసమయంలో షాపునకు ఉన్న రూ. కోటి బీమాను క్లైమ్ చేసుకునేందుకు బీమా కార్యాలయానికి వెళతారు. ఇది దేవుడి శాపం వల్ల జరిగిన ప్రమాదమని అందువల్ల నష్టపరిహారం చెల్లించలేమని బీమా కంపెనీవారు సమాధానం ఇవ్వడమే కాకుండా, దేవుడిపై కేసు పెట్టుకోమని సలహా ఇస్తారు.
 
దీంతో గోపాల దేవుడిపై కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా అన్ని మత పెద్దలు, సాధువులకు నోటీసులు జారీ చేసి కోర్టుకు రావాలని పేర్కొంటారు. దీంతో సాధువులు, మతపెద్ద (మిథున్ చక్రవర్తి), మతపెద్దలు కోర్టుకు వస్తారు. అపుడు తమను గోపాల కోర్టుకు పిలిపించి అవమానించారంటూ అతనిపై దాడి చేస్తారు. ఈ గోపాలను రక్షించేందుకు దేవుడు (పవన్ కళ్యాణ్) భూమికి దిగివస్తాడు. ఇది మొదటి భాగం కథ. ఈ  ఒకటిన్నర గంట చిత్రం ఎంతో ఆసక్తికరంగా, ఇంట్రెస్టింటింగ్‌గా దర్శకుడు తీర్చిదిద్దారు. 
 
కాగా, చిత్రం డా॥ డి. రామానాయుడు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై. లిమిటెడ్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ బ్యానర్స్‌పై కిషోర్‌కుమార్‌ పార్ధసాని దర్శకత్వంలో స్టార్‌ ప్రొడ్యూసర్‌ సురేష్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కేరెక్టర్ ఇంటర్వెల్‌కు ముందు వస్తుంది. సెకండాఫ్ మొత్తం వుండే ఆయన పాత్ర మొత్తం 50 నిమిషాల నిడివితో ఉంది. 
 
మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు ఇతర ప్రధాన తారాగణమైన ఈ సినిమాకి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల స్క్రీన్‌ప్లే : కిశోర్‌కుమార్ పార్థసాని భూపతిరాజా, దీపక్‌రాజ్ కెమెరా: జయనన్ విన్సెంట్ మాటలు: సాయిమాధవ్ బుర్రా సంగీతం: అనూప్ రూబెన్స్ పాటలు:చంద్రబోస్ ఎడిటింగ్: గౌతమ్‌రాజు ఆర్ట్: బ్రహ్మ కడలి నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్ దర్శకత్వం: కిశోర్ కుమార్ పార్థసాని.