Widgets Magazine

గృహం రివ్యూ రిపోర్ట్: హాలీవుడ్ రేంజ్ 100 పర్సంట్ హార్రర్ మూవీ

హారర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఇదే జానర్లో నాగార్జున, సమంత వంటి స్టార్స్ రాజుగారి గదిలో నటించారు. ప్రస్తుతం ఒకప్పుడు లవర్ బాయ్‌కు స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత గృహ

selvi| Last Updated: శుక్రవారం, 17 నవంబరు 2017 (15:48 IST)
సినిమా పేరు : గృహం
తారాగణం : సిద్ధార్థ్‌, ఆండ్రియా, సురేష్‌, అతుల్ కుల‌క‌ర్ణి తదితరులు
సంగీతం : గిరీష్ వాసుదేవ‌న్‌
దర్శకత్వం : మిలింద్ రావ్‌
నిర్మాత : సిద్ధార్థ్‌
హారర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఇదే జానర్లో నాగార్జున, సమంత వంటి స్టార్స్ రాజుగారి గదిలో నటించారు. ప్రస్తుతం ఒకప్పుడు లవర్ బాయ్‌కు స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత గృహం సినిమాతో తెరపైకి వచ్చాడు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

క‌థలోకి వెళితే..

పక్కింటికి అద్దెకు వచ్చిన కుటుంబాన్ని ఆత్మలు వేధిస్తే.. సర్జన్ కృష్ణ కాంత్(సిద్ధార్థ్) తన భార్య లక్ష్మి (ఆండ్రియా) ఎలా కాపాడారన్నదే కథ. సినిమా 1934 కాలంలో మొదలవుతుంది. ఓ చైనా వ్యక్తి ఇంట్లో ఓ గర్భవతితో పాటు ఆమె కూతురు నివసిస్తుంటారు. వెంటనే సినిమా 2016కు మారుతుంది. కృష్ణ, లక్ష్మితో కలిసి రోషినీ వ్యాలీలోని బంగ్లాకు మారతారు. వారింటి పక్కలో అద్దెకు వచ్చే పెద్ద కుటుంబంలోని జెన్నీ అనే అమ్మాయి సిద్ధార్థ్‌ను ఇష్టపడుతుంది.

జెన్నీ, కృష్ణకాంత్ కుటుంబాలు దగ్గరైన వేళ.. జెన్నీ ప్రవర్తనలో తేడా వస్తుంది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటుంది. కృష్ణ సలహాతో జెన్నిని సైక్రియాటిస్ట్‌కు చూపిస్తారు. అదే సమయంలో ఆ ఇంట్లో ఓ చైనా మహిళ, ఆమె కుమార్తె ఆత్మలున్నాయనే నిజం తెలుస్తుంది. ఆ ఆత్మలకు జెన్నీకి సంబంధం ఏంటి? పాల్, కృష్ణలు జెన్నిని ఎలా కాపాడారు అనేదే కథ.

నటీనటులు :
సిద్ధార్థ్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో సిద్ధార్థ్ నటన వావ్ అనిపిస్తుంది. హీరోయిన్‌గా ఆండ్రియా అందంతో పాటు అభినయంలోనూ మంచి మార్కులు కొట్టేసింది. పాల్ పాత్రలో అతుల్ కులకర్ణి తనదైన నటనతో మెప్పించాడు. ఇతర నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. బాలనటి అలీషా ఏంజెలినా విక్టర్ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

విశ్లేషణ :
ఈ సినిమాతో నటుడిగా, నిర్మాతగా సిద్ధార్థ్ సక్సెస్ అయ్యాడు. తన స్నేహితుడు మిలింద్ రావ్‌ను దర్శకుడిగా ఎంచుకున్న సిద్ధార్థ్ నటుడిగానే కాక మేకింగ్‌‍లోనూ తనదైన ముద్ర ఉండేలా చూసుకున్నాడు. హాలీవుడ్ స్థాయి హర్రర్ సినిమాను దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేశాడనే చెప్పాలి. విజువల్స్ అదిరిపోయాయి.
శ్రేయాస్ కృష్ణ సూపర్బ్ సినిమాటోగ్రఫి సినిమా స్థాయిని పెంచింది. అందుకు తగ్గట్టుగా గిరీష్ వాసుదేవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత భయపెట్టింది. రొమాంటిక్ సీన్స్‌ను కాస్త ఎక్కువే.

ప్లస్ పాయింట్స్ :
సిద్ధార్థ్ నటన
కథ, టేకింగ్

ప్రేక్షకుల తీర్పు..
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అసలైన హారర్ మూవీ అంటే ఇదేనని కామెంట్ చేస్తున్నారు. ఆసక్తి రేకెత్తించే కథా కథనాలు, ఉత్కంఠను కలిగించే సన్నివేశాలు ఊపిరిని బిగపట్టేలా చేశాయని చెప్తున్నారు. దర్శకుడు మిళింద్ టేకింగ్, ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. చివరి 20 నిమిషాలు కుర్చీకి బిగుసుకుపోతామనీ, సిద్ధార్థ్ నటనలో కొత్త కోణం ఈ సినిమాలో కనిపిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. కథ మెల్లగా నడవటం, కమర్షియల్ హంగులు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయినా.. వందశాతం హారర్ మూవీస్ చూడాలకునేవారికి గృహం చక్కని ట్రీట్ ఇస్తుందని సినీ విశ్లేషకులు కూడా మార్కులిచ్చేస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :