గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2016 (09:09 IST)

'జనతా గ్యారేజ్' రివ్యూ : మెకానిక్ షెడ్ కాదు... మరేంటి? ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్

డైరక్టర్ కొరటాల శివ తీసింది రెండే సినిమాలు. అయినా దర్శకుడిగా తనకంటూ ఓ ముద్ర వేయగలిగారు. ఓ కమర్షియల్‌ చిత్రాన్ని సందేశంతో మేళవించి ఎలా తీయవచ్చో ప్రిన్స్ మహేష్ బాబు 'శ్రీమంతుడు'తో నిరూపించాడు. ఇక జూనియర

నటీనటులు: ఎన్టీఆర్, మోహన్‌లాల్‌, సమంత, నిత్యమీనన్, ఉన్ని ముకుందన్‌, సాయికుమార్, దేవయాని, రెహమాన్, అజయ్‌ తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, రవిశంకర్, సీవీ మోహన్‌
కథ - దర్శకత్వం: కొరటాల శివ
 
డైరక్టర్ కొరటాల శివ తీసింది రెండే సినిమాలు. అయినా దర్శకుడిగా తనకంటూ ఓ ముద్ర వేయగలిగారు. ఓ కమర్షియల్‌ చిత్రాన్ని సందేశంతో మేళవించి ఎలా తీయవచ్చో ప్రిన్స్ మహేష్ బాబు 'శ్రీమంతుడు'తో నిరూపించాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి కథ.. మంచి పాత్ర పడితే.. ఎన్టీఆర్‌ చిత్రాలు బాక్సాఫీసుని శాసిస్తాయి. 'టెంపర్'.. 'నాన్నకు ప్రేమతో' చిత్రాలతో ఎన్టీఆర్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వీరిద్దరికి మోహన్‌లాల్‌ వంటి నటుడుతోడైతే ఆ సినిమా ఎలా ఉంటుంది? అందుకే ‘జనతా గ్యారేజ్‌’పై అంచనాలు పెరిగిపోయాయి. మరి వాటిని ఈ సినిమా అందుకొందా? లేదా? జనతా గ్యారేజ్.. కథేంటి? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
 
కథేంటంటే..
సత్యం (మోహన్‌లాల్‌) ఓ మెకానిక్‌. తమ్ముడు (రెహమాన్‌)తో పాటు హైదరాబాద్‌లో ఓ గ్యారేజ్‌ నడుపుతుంటాడు. దాని పేరే ‘జనతా గ్యారేజ్‌’. అక్కడికి సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. వాళ్లు చేసిన దాడిలో తమ్ముడిని కోల్పోతాడు. తమ్ముడు కొడుకు ఆనంద్‌ (ఎన్టీఆర్‌)ని మాత్రం చిన్నప్పుడే ఈ జనతా గ్యారేజ్‌కి దూరంగా పెంచడానికి మేనమామ (సురేష్‌)కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఆనంద్‌కి అసలు తనకంటూ ఓ కుటుంబం ఉందని కూడా తెలియకుండా పెంచుతాడు మేనమామ. 
 
ఆనంద్‌కి ప్రకృతి అంటే ఇష్టం. చిన్న మొక్కకి హాని జరిగినా తట్టుకోలేడు. అందుకోసం ఎంతమందినైనా ఎదిరిస్తాడు. తనకీ ముంబైలో శత్రువులు పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల ఆనంద్‌ తొలిసారి హైదరాబాద్‌ రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక సత్యంని కలుస్తాడు. దానికి కారణం ఏమిటి? సత్యం తన పెదనాన్న ఆనంద్‌కు తెలిసిందా? లేదా? జనతా గ్యారేజ్‌కి ఆనంద్‌ అవసరం ఏమొచ్చింది? ఇలాంటి విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 
 
మొక్కల్ని ప్రేమించే ఓ కుర్రాడు.. మనుషుల్ని ప్రేమించే  ఓ పెద్దాయన ఎలా కలుసుకొన్నారు. వారిద్దరూ కలిశాక ఏమైంది? అనేదే ఈ చిత్ర కథ. సినిమా పరంగా దర్శకుడు పెద్ద కసరత్తు చేయలేదన్న భావన కలుగుతుంది. చెడుపై మంచి పోరాటం చేయడం.. చివరికి గెలవడం అన్ని కథల్లోనూ కనిపించేదే. ‘జనతా గ్యారేజ్’ కథ కూడా అదే. జనతా గ్యారేజ్‌ అనేది ఓ సైన్యం. పేదల కష్టాల్ని తీరుస్తుంటుంది. వాళ్ల దగ్గరకు వచ్చిన సమస్యల్ని పరిష్కరిస్తుంటుంది. సినిమా ప్రారంభంలో ఎన్టీఆర్‌ చుట్టూ నడిపించిన సన్నివేశాలు.. ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో మోహన్‌లాల్‌ పాత్రే కీలకంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే 'జనతా గ్యారేజ్‌'లో ఆనంద్‌ ఎంట్రీ ఇచ్చాడో... అక్కడి నుంచి అసలు సిసలైన హీరోయిజం మొదలవుతుంది. మిగిలిన కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
బలాలు 
* ఎన్టీఆర్‌.. మోహన్‌లాల్‌ 
* ప్రారంభ సన్నివేశాలు 
* రెండు పాటలు 
* సాంకేతిక అంశాలు 
 
బలహీనతలు 
* పాత్రల మధ్య సంఘర్షణ లోపించటం 
* బలమైన ప్రతినాయకుడు లేకపోవటం