శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By CVR
Last Updated : ఆదివారం, 3 మే 2015 (13:58 IST)

మనిషి నిజ జీవితమే వెండితెరపై సినిమా అని నిరూపించే కమల్ ''ఉత్తమ విలన్''.. రివ్యూ రిపోర్ట్..!

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ''ఉత్తమ విలన్''. ఈ చిత్రం మొదటి నుంచి ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. చివరికి సినిమా విడుదల విషయం కూడా అయోమయం ఏర్పడింది. మేడే సందర్భంగా ఒకటో తేది విడుదల కావాల్సిన ''ఉత్తమ విలన్'' ఆర్థిక ఇబ్బందులో నిలిచిపోయింది. దీంతో దుబాయ్‌లో ఉన్న కమల్ హాసన్ హుటాహుటిన చెన్నై చేరుకుని సినీ నిర్మాతలతో చర్చలు జరిపిన అనంతరం ఎట్టకేలకు శనివారం సాయంత్రి ఉత్తమ విలన్ తెరకెక్కింది. మరి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ''ఉత్తమ విలన్'' ఆకట్టుకుందా, అంచనాలను అందుకుందా అని తెలిపే రివ్యూ రిపోర్ట్ మీ కోసం.

 
సినిమా : ఉత్తమవిలన్ 
నటీనటులు : కమల్ హసన్, పూజ కుమార్, ఊర్వశి, బాలచందర్, కే విశ్వనాథ్. 
దర్శకత్వం: రమేష్ అరవింద్ 
నిర్మాత: సి కళ్యాణ్ 
సంగీతం: జిబ్రాన్ 
విడుదల తేది : 02-05-2015 
రేటింగ్: 2/5 
 
కథ:
మహానటుడు కమల్ హాసన్ సినిమాలోనూ నటుడే. మనోరంజన్ (కమల్ హసన్) తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద స్టార్ హీరో. అతను ఆ స్థాయికి ఎదగడానికి కారణం మార్గదర్శి (కే.బాలచందర్), వరుసగా ఐదు సినిమాలు ఇద్దరు కలసి చేసి హిట్ కొట్టి ఉంటారు. కానీ, మనోరంజన్ స్టార్ అవడానికి అతనికి పూర్ణ చంద్ర రావు (కే.విశ్వనాథ్) తోడ్పడటమే కాకుండా తన కూతురు వరలక్ష్మి(ఊర్వశి)ని ఇచ్చి పెళ్లి కూడా చేస్తాడు. ఇదిలా ఉండగా మనోరంజన్ అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది. 
 
దీంతో అతనికి వైద్యం చేయడానికి డాక్టర్ అపర్ణ (ఆండ్రియా) వస్తుంది. ఆమెతో మనోరంజన్‌కు అనుబంధం ఏర్పడుతుంది. జాకబ్ జకారియా(జయరాం) అనుకోని పరిస్థితుల్లో మనోరంజన్ జీవితంలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో మనోరంజన్‌కి మెడలో క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో చనిపోబోయే అతను మార్గదర్శి వద్దకు వెళ్లి తన ఆఖరి సినిమాని తెరకెక్కించమని కోరుతాడు.
 
ప్రేక్షకులు సంతోషంగా బయటకి వచ్చేలా ఆ సినిమా ఉండాలని కోరుతాడు. అలా మొదలైనదే 'ఉత్తమ విలన్'. మరి ఆయన కోరుకున్నట్టు చివరి సినిమా తీస్తాడా? అందుకోసం సినిమాలో తిరిగే మలుపులు? వంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
నటీనటుల ప్రతిభ:
కమల్ హసన్ ఈ సినిమాలో మూడు షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించాడు. అభిమానులకి నచ్చే హీరోగా ఒకటి, వ్యాధితో బాధపడే వ్యక్తిగా మరొకటి, ఉత్తముడి పాత్రలో మరొకటి. అయితే దేనికదే అద్భుతం. ప్రతి పాత్రకి కావలసిన తేడా చూపించాడు కమల్. అత్యద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు. కే బాలచందర్ సన్నివేశాలని, ఆయన జ్ఞాపకాలు, ఆయన నటన అందరికి పాఠాలు, ఈ వయసులో కూడా ఈ స్థాయి నటనని కనబరచడం ఆయనకే సాధ్యం అవుతుంది.
 
కె విశ్వనాథ్ పాత్రకు ప్రాణం. ఆండ్రియా పాత్ర చాలా చిక్కులు ఉన్న పాత్ర, ఆ స్థాయిలోనే తన శైలి నటన కనబరిచి ఆకట్టుకుంది ఆండ్రియా. పూజ కుమార్ ఆమె పాత్రకు తగ్గ ప్రదర్శన ఇచ్చింది అయితే అదనంగా అందాలతో ఆకట్టుకుంది. ఇంకా నాజర్ , ఊర్వశి, జయరాం, పార్వతి మీనన్, పార్వతి నాయర్ మొదలగు నటీనటులు వారి పాత్రల స్థాయి మేరకు ఆకట్టుకున్నారు.
 
ప్లస్ పాయింట్స్ :
బాలచందర్, కమల్ హసన్, కొన్ని అద్భుతమైన సన్నివేశాలు నేపధ్య సంగీతం సినిమాటోగ్రఫీ
 
మైనస్ పాయింట్స్ :  
స్క్రీన్ ప్లే, నేరేషన్ ఎడిటింగ్, దర్శకత్వం, ఉత్తముడి సన్నివేశాలు
 
సాంకేతిక వర్గం పనితీరు :  
మొదట దర్శకుడి గురించి చెప్పుకుంటే రమేష్ అరవింద్ ఓ గొప్ప సినిమాని తీయడానికి సరిపోయే బలమైన కథ, నటీనటులు, బడ్జెట్ ఇలా అన్నీ కలిసోచ్చాయి. వాటన్నిటిని దర్శకుడిగా సరిగ్గా అందిపుచ్చుకొని అన్నివేశాల పరంగా చాలా బాగా రూపొందించాడు. సినిమా మేకింగ్ టెక్నిక్స్ ద్వారా మాత్రమే చెప్పడానికి వీలయ్యే కొన్ని భావోద్వేగాల్ని ఈ సినిమా ద్వారా తెలుగు తెరపై చూడటం మనకో కొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో అతిశాయోక్తి లేదు.
 
విశ్లేషణ:
ఓ బలమైన కథ, కమల్ హసన్‌తో పాటు సినిమాలోని ప్రతి పాత్ర అద్భుతంగా నటించిన విధానం, రెండు విభిన్న కథలని సమాంతరంగా చెప్పే ప్రయత్నం. ఓ వైపు కామెడీ, మరో వైపు ట్రాజెడీని జీవితంతో ముడిపెట్టిన విధానం ఈ సినిమాకి ప్రధాన బలాలు. ఇక ముఖ్యమైన ప్లాట్‌ని సబ్‌ప్లాట్‌తో కనెక్ట్ చేయడంలో తేలిపోవడం, సబ్‌ప్లాంట్‌లోని ఆత్మని గాలికి వదిలేయడం. లెంగ్తీ రన్ టైం ఈ సినిమాకి ప్రతికూల అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నిజ జీవితమే వెండితెరపై కథ అని నిరూపించగలిగే సినిమా.