శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (13:01 IST)

కృష్ణగాడి వీర ప్రేమ గాథ రివ్యూ: బాలయ్య ఫ్యాన్‌గా నాని.. రొమాంటిక్ కామెడీగా ఫుల్ మార్క్స్!

నాని కెరీర్‌లో సరికొత్త కథాంశంతో కృష్ణగాడి వీర ప్రేమ గాథ తెరకెక్కింది. భలే భలే మగాడివోయ్ హిట్ సినిమాకు తర్వాత.. కథను ఎంచుకోవటంలో నాని సఫలమయ్యాడు. అందుకే అందాల రాక్షసి ఫేమ్ దర్శకుడు హనుకు మంచి ఛాన్స్ ఇచ్చాడు. మరి కృష్ణగాడి వీరప్రేమగాథ రివ్యూ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం..
 
నాని హీరోగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కింది. దర్శకుడు హను రాఘవపుడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా 14 రీల్స్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 12 (శుక్రవారం) రిలీజ్ అయ్యింది. 
 
కథలోకి వెళితే... 
నాని ఓ గ్రామానికి చెందిన యంగ్ బాయ్‌గా అదరగొట్టాడు. థియేటర్‌లో ప్రొజెక్టర్ బాయ్‌గా పనిచేస్తుంటాడు. బాలకృష్ణకు బిగ్ ఫ్యాన్. హీరోయిన్ మెహరీన్ కూడా అదే గ్రామంలో ఉంటుంది. వీరిద్దరూ ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూనే ఉంటారు. అయితే వీరిద్దరూ నిజమైన ప్రేమికులు. అనుకోకుండా కృష్ణగాడికి సమస్యలు ఎదురుకావడంతో పాటు కృష్ణగాడు కలుసుకునే ముగ్గురు చిన్నారులు సినిమాకు హైలైట్. ముగ్గురు చిన్నారులను కృష్ణగాడు ఎందుకు కలుసుకుంటాడు. వాడి ప్రేమకథ ఏంటి..? ప్రేమికులైన నాని, మెహరీన్ల మధ్య ప్రేమ ఎలా పుట్టింది.? ప్రేమలో వారిద్దరూ గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
నటీనటులు: నాని, మెహరిన్, సంపత్ రాజ్, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు 
దర్శకత్వం : హను రాఘవపూడి 
నిర్మాత : రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర 
బ్యానర్ : 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ 
సినిమాటోగ్రఫీ : విశాల్ చంద్రశేఖర్ 
ఎడిటింగ్ : ఎమ్ఆర్ వర్మ 
స్క్రీన్ ప్లీ, రచయిత : హను రాఘవపూడి
 
కృష్ణగాడి వీరప్రేమగాథలోని పాజిటివ్ :
హీరో నాని నేచురల్ యాక్టింగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పిల్లల నటన
బీజీఎమ్ 
కామెడీ 
 
మైనస్:
లెంగ్తీ సీన్లు 
 
రేటింగ్ :
3/5
 
 
తీర్పు :
రూ. 11 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న కృష్ణగాడి వీరప్రేమగాథకుఇప్పటికే పంపిణీ హక్కులు రూ.15 కోట్లు పలికింది. శాటిలైట్ హక్కులు రూ.4.5 కోట్లు పలికింది. సో కృష్ణగాడికి ఈ సినిమా ద్వారా కలెక్షన్లకు తక్కువ వుండదని సినీ పండితులు తీర్పిస్తున్నారు.