గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By CVR
Last Updated : గురువారం, 14 మే 2015 (12:58 IST)

అంచనాలను అందుకోలేని 'లయన్'.. రివ్యూ రిపోర్ట్..!

భారీ అంచనాలతో యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన 'లయన్' సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ రాజకీయారంగ్రేటం చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వచ్చిన తొలి సినిమా 'లయన్' కావడంతో విశేషం. సంగీత సత్యదేవా దర్శకుడిగా పరిచయం అయిన లయన్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా తెలిపే రివ్యూ రిపోర్ట్ మీ కోసం...
సినిమా : లయన్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, త్రిష, రాధికాఆఫ్టే, ప్రకాష్‌రాజ్, చంద్రమోహన్, చలపతిరావు, ఎంఎస్.నారాయణ తదితరులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంగీత సత్యదేవా
నిర్మాత: రుద్రపాటి రమణారావు
సంగీతం: మణిశర్మ
విడుదల తేదీ: 14 మే, 2015
లయన్ రేటింగ్: 3.0/5.0
 
లయన్ కథ:
ఈ చిత్రం బోస్(బాలకృష్ణ) పాత్ర చుట్టూ తిరుగుతుంది. కోమాలో ఉన్న బోస్ 18 నెలల తర్వాత గాడ్సేగా బయటకు వస్తాడు. ఇది వైద్య చరిత్రలోనే మిరాకిల్ అవుతుంది. వెంటనే గాడ్సే తమ కొడుకేనంటూ హాస్పటల్‌కు వస్తారు జయసుధ, చంద్రమోహన్ దంపతులు. గాడ్సే మాత్రం వారు తన తల్లిదండ్రులు కాదని…వేరే ఉన్నారని…తన పేరు బోస్ అని చెపుతాడు. ఈ క్రమంలోనే ఫైనాన్స్ వ్యాపారం చేసే గుగ్గిళ్ల మహాలక్ష్మి (త్రిష)ను చూసి తన లవర్ అని వెంటపడుతుంటే ఆమె మాత్రం అతడెవరో తనకు తెలియదంటుంది.
 
ఈ టైంలో గాడ్సే చలపతిరావు, సంగీత దంపతులను చూసి వారే తన తల్లిదండ్రులని చెపుతాడు. గాడ్సే వారు తన తల్లిదండ్రులు కాదంటాడు. ఇటు తాను అవునంటున్న తల్లిదండ్రులు కాదంటుంటే, తల్లిదండ్రులు తమ బిడ్డేనని చెపుతున్న టైంలో డీఎన్ఏ టెస్టులు చేస్తారు. ఈ టెస్టుల్లో తేలిన నిజం ఏమిటి ? బోస్ ఎవరు? బోస్‌ను ప్రేమించిన రాధికాఆఫ్టే ఎవరు అన్నది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి భరద్వాజ్ (ప్రకాష్‌రాజ్) చేసిన కుట్రలను గాడ్సే ఎలా తిప్పికొట్టాడు ? అన్నది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.
 
నటీనటుల పనితీరు:
నటీనటుల్లో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్‌గా అదే స్టైల్లో నటించాడు. తన నటనలో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. పాటల్లో డ్యాన్స్‌తో పాటు డైలాగ్ డెలీవరీలో కూడా మునుపటి వాడీ వేడీ చూపించాడు. మెమరీ లాస్ పేషెంట్‌గా సినిమా ఫస్ట్ హాఫ్‌లో మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక ఫైనాన్స్ కంపెనీ నడిపే మహాలక్ష్మి క్యారెక్టర్‌లో బాలయ్య లవర్‌గా త్రిష పర్వాలేదనిపించింది. రాధికా ఆఫ్టే నటించేందుకు పెద్దగా స్కోప్ లేదు. విలన్‌గా చేసిన ప్రకాష్‌రాజ్ తనకు అలవాటైన నటనతో సీఎం క్యారెక్టర్‌గా ఒదిగిపోయాడు. చలపతిరావు, చంద్రమోహన్, జయసుధ, సంగీత తమ పాత్రల వరకు బాగానే చేశారు. ఎంఎస్.నారాయణ, పోసాని కొన్ని సీన్లకు పరిమితమయ్యారు.
 
చివరగా….
ఎన్నో అంచనాలతో వచ్చిన బాలకృష్ణ లయన్ సినిమా స్టోరీ కొత్తగా ఉన్నా దర్శకుడి అనుభవ రాహిత్యంతో కథకు తగినట్టుగా కథనం లేకపోయింది. బాలయ్య నటన, డైలాగ్స్, డ్యాన్స్ సినిమాను హైలెవెల్‌కు తీసుకెళ్లినా…కథ బాగున్నా కథనం సరిగా లేక సినిమా సింహ, లెజెండ్ స్థాయి అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికి అదరగొట్టే పంచ్ డైలాగ్‌లతో బాలయ్య ఆకట్టుకున్నాడు.