మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 31 జులై 2015 (20:21 IST)

చార్మి కోసమే 'మంత్ర-2'... రివ్యూ రిపోర్ట్

మంత్ర-2 నటీనటులు : ఛార్మీ, చేతన్‌ చీను తదితరులు; సంగీతం : సునీల్‌ కశ్యప్‌, నిర్మాత : శౌరి రెడ్డి, యాదగిరి రెడ్డి, దర్శకత్వం : ఎస్‌.వి సతీష్‌.
 
చార్మి 'మంత్ర' సినిమా హారర్‌ థ్రిల్లర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో కొద్దిసేపు నటించిన శివాజీకి మంచి విజయాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా మంత్ర-2ను రూపొందించారు. రెండేళ్ళ పాటు జరిగిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యమై ఎట్టకేలకు ఈ రోజు విడుదలైంది. శౌరి రెడ్డి, యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా  మంత్రను మరిపిస్తుందా! లేదా చూద్దాం.
 
కథ :
మంత్ర(ఛార్మీ) ఓ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా హైదరాబాద్‌ వస్తుంది. ఓ వృద్ధ జంట వద్ద గెస్ట్‌గా వుంటుంది. సరదాగా జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలనుకునే ఆమెకు అనుకోని జర్క్‌ కలుగుతుంది. అదేమంటే.. ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు తనని చంపడానికి ట్రై చేస్తుంటారు. ఇది తెలిసి పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ (చేతన్‌) ఎంటర్‌ అవుతాడు. మంత్రని చంపదలచుకుంది ఎవరా అనేదానిపై పరిశోధన చేస్తాడు. ఈ శోధించే భాగంగా మరో నలుగురుతో కలిసి మంత్ర ఉండే ఇంటికి వెళతాడు విజయ్‌. అక్కడికి వెళ్ళాక వారికి కొన్ని వింతలు కనుగొంటారు. దాంతోపాటు ఒక్కొక్కరూ చంపబడుతారు. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసు విజయ్‌కు మంత్రపై అనుమానం వస్తుంది? అసలు మంత్ర ఎవరు.? మంత్రకి ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
ఛార్మీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తను భయాన్ని, క్రోధాన్ని, అందాన్ని బాగా చూపించింది. అసలు కథకు ఆమె కీలకం. కథంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అద్భుతంగా నటించింది. తనికెళ్ళ భరణి పెర్ఫార్మన్స్‌ బాగుంది,  హీరోగా చేసిన చేతన్‌ పోలీసుగా పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. నటుడిగా నిరూపించుకున్నాడు. ఒక మిగిలిన పాత్రలు అన్నీ ఓకే.
 
సాంకేతిక విభాగం :
ఇలాంటి సినిమాలకు కెమెరా కీలకం. దాన్ని బాగా చేశాడు. పరిమిత లొకేషన్లలో హర్రర్‌ సినిమా అనే ఫీలింగ్‌‌ని కలిగించాడు సినిమాటోగ్రాఫర్‌. బ్యాక్‌‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మెరుగ్గా ఏమీలేదు. సునీల్‌ కశ్యప్‌ మ్యూజిక్‌ బాగా లౌడ్‌‌గా ఉందే తప్ప పెద్దగా సినిమాకి హెల్ప్‌ అవ్వలేదు. ఎడిటింగ్‌ బిలో యావరేజ్‌‌గా ఉంది. ఫస్ట్‌ హాఫ్‌‌ని చాలాచాలా ఎడిట్‌ చేయవచ్చు.
 
ఇలాంటి కథలో ఇంకాస్త మెరుగులు దిద్దితే బాగుండేది. ఎస్‌.వి సతీష్‌ ఎంచుకున్న కథలో పెద్దగా కిక్‌ లేకపోవడం, స్క్రీన్‌ ప్లే బాగా లేకపోవడం ఈ సినిమాని మరింత బోరింగ్‌‌గా చేస్తుంది. ముఖ్యంగా నేరేషన్‌ సరిగా లేకపోవడం వలన చాలాసార్లు చూసే ఆడియన్‌ సినిమా నుంచి బయటకి వచ్చేస్తాడు. డైరెక్టర్‌‌గా కూడా ఫెయిల్‌ అయ్యాడు. నిర్మాణ విలువలు జస్ట్‌ ఓకే అనేలా ఉన్నాయి.
 
విశ్లేషణ:
మొదటి పార్ట్‌ చూసిన వారికి ఈ చిత్రం ఏమంత థ్రిల్‌ అనిపించదు. అది చూడనివారికి ఓకే అనిపిస్తుంది. ప్రధానంగా కథ కంటే కథనం ముఖ్యం. అది చాలా వీక్‌ అని చెప్పాలి. దానికితోడు డైరెక్టర్‌ ఒకే సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్‌‌ని టచ్‌ చెయ్యాలనే ఉద్దేశంతో చాలా కన్ఫ్యూజ్‌ అయ్యాడనిపిస్తుంది. మొదటి భాగంలో కథేమిటో తెలీదు. ఇంటర్‌వెల్‌ తర్వాత అసలు విషయం చెబుతాడు దర్శకుడు. అప్పటికే ప్రేక్షకుడికి నీరసం వస్తుంది. హర్రర్‌ ఎలిమెంట్స్‌తో భయపెట్టే మరణాలు ఆడియన్స్‌‌లో సస్పెన్స్‌, ఆసక్తిని క్రియేట్‌ చెయ్యలేకపోయాయి. ఇదొక హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమా కానీ ఆడియన్స్‌ నెక్స్ట్‌ ఏం జరుగుతుంది అనేది ఈజీగా ఊహించేస్తారు. సినిమా మొత్తం చాలా ఊహాజనితంగా ఉంటుంది. ఇది కేవలం చార్మి కోసమే తీసిన సినిమా. ఆమె కోసమే చూసే ప్రేక్షకులు కాసేపు ఎంజాయ్‌ చేస్తారు. జ్యోతిలక్ష్మితో అలరించినా.. అది కూడా పెద్దగా ఆదరణ లేకపోయినా.. మంత్ర-2తో మరింత పుంజుకుంటుందన్న చార్మి ఆశలు నిరాశలగానే మిగులుతాయి.
 
రేటింగ్‌: 2/5