శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (16:09 IST)

టైంపాస్ సినిమా నాని 'మజ్ను'... చెల్లెల్ని లవ్ చేసి ఆమెపై ద్వేషంతో అక్కను ప్రేమించిన హీరో

హీరో నాని.. 'ఉయ్యాల జంపాల' దర్శకుడు విరంచి వర్మతో 'మజ్ను' చేశాడనగానే మరలా ఓ లవ్‌స్టోరీ అని తెలిసిపోతుంది. అన్ని ప్రేమకథలు దుంఖాంతం కాదు. ఇది.. సుఖాంతం.. అలనాటి మజ్నులా.. విరహంతో.. జీవితాన్ని నాశనం చేస

నటీనటులు: 
నాని, ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా తదితరులు.
 
సాంకేతిక సిబ్బంది:
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌, సంగీతం: గోపీసుందర్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాణ సారధ్యం: పి.కిరణ్‌, నిర్మాత: గోళ్ళ గీత, దర్శకత్వం: విరించి వర్మ.
 
హీరో నాని.. 'ఉయ్యాల జంపాల' దర్శకుడు విరంచి వర్మతో 'మజ్ను' చేశాడనగానే మరలా ఓ లవ్‌స్టోరీ అని తెలిసిపోతుంది. అన్ని ప్రేమకథలు దుంఖాంతం కాదు. ఇది.. సుఖాంతం.. అలనాటి మజ్నులా.. విరహంతో.. జీవితాన్ని నాశనం చేసుకోడని.. ఫుల్‌‌ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ మజ్ను ఉంటుందని చిత్ర యూనిట్‌ చెబుతూనేవుంది. ఇందులో రాజమౌళి, రాజ్‌తరుణ్‌లు కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారనగానే.. ఏదో ఆసక్తిని కనెక్ట్‌అయ్యేలా అనిపిస్తుంది. మరి వీరందరితో మజ్ను ఏం చేశాడో చూద్దాం.
 
కథ:
భీమవరంలో ఉండే ఆదిత్య (నాని) చదువుపూర్తయ్యాక తనేం చేయాలో.. ఎటువైపు జీవితాన్ని సాగించాలో తెలియని గందరగోళంలో ఉంటాడు. ఫ్రెండ్‌ కోసం ఏదైనా చేస్తాడు. ఓ రోజు స్కూటీతో యాక్సిడెంట్‌ చేసిన కిరణ్‌ (ప్రియా శ్రీ)ని తొలిచూపులో ప్రేమించేసి.. ఆమె వెంటే పడుతుంటాడు. ఆ క్రమంలో అనుకోని సంఘటనతో ఆమె చదువుతున్న కాలేజీలో లెక్చరర్‌గా చేరతాడు. చిన్న మనస్పర్థలతో ఆమెను దూరం చేసుకుంటాడు. కట్‌చేస్తే.. హైదరాబాద్‌లో దర్శకుడు రాజమౌళి దగ్గర అప్రెంటిస్‌గా చేరతాడు. ఇక్కడా చిన్ననాటి మిత్రుడు ప్రేమించిన సుమ (ఇమ్మానుయేల్‌)ను కలిపే క్రమంలో తనకే నచ్చి.. ఆమెకు ప్రేమించేందుకు ట్రై చేస్తాడు. ప్రేమపై సదాభిప్రాయంలేని ఆమెను ప్రేమించేలా చేస్తాడు. అయితే తన గతం.. సుమకు తెలియాలని లెక్చరర్‌ కథ చెప్పేస్తాడు. కథ ముగింపులో తనే ఫీలై.. అప్పట్లో తను చేసింది తప్పని తెలుసుకని వెంటనే కిరణ్‌ కోసం భీమవరం ప్రయాణమవుతాడు. ఆసమయంలోనే తన చెల్లెలి కోసం సుమ.. స్టేషన్‌కు వస్తుంది. అక్కడ సుమ, కిరణ్‌ అక్కాచెల్లెళ్లని తెలిసి ఆదిత్య షాక్‌ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌
నటనాపరంగా నేచురల్‌ నటుడు అని నానికి బిరుదు ఇచ్చేశారు ఇండస్ట్రీవాళ్లు. సహజంగానే ఉన్నా.. ఎక్కువశాతం.. కథాపరంగానూ నటనాపరంగానూ చూస్తే.. మొన్ననే చూసిన 'జెంటిల్‌మెన్‌' సినిమా గుర్తుకు వస్తుంది. హావభావాలు ఏమీ కొత్తగా అనిపించలేదు. హీరోయిన్లు ఇద్దరూ కొత్తవారు కాబట్టి వారు కూడా వారిపరంగా నేచురల్‌గానే చేసేశారు. లెక్చరర్‌గా పోసాని.. ప్రిన్సిపాల్‌గా శివన్నారాయణ కొద్దిసేపైనా నవ్విస్తారు. నాని స్నేహితునిగా మధు నటించాడు. వెన్నెల కిశోర్‌, సప్తగిరి ఎంటర్‌టైన్‌ చేస్తాడు. గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌లోని నలుగురు రౌడీలతో.. కాసేపు ఎంటర్‌టైన్‌ చేయించాడు. రాజ్‌తరుణ్‌.. సుమ బావగా నటించాడు. మిగిలిన పాత్రలు కొత్తవారే.
 
సాంకేతికత:
జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. కోనసీమ అందాలు బాగా చూపించాడు. గోపీసుందర్‌ సంగీతం ఫర్వాలేదు. 'చెప్పేయవేయ్‌..' అనే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అలరించింది. సాహిత్యం బాగానే ఉంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణపు విలువలు ఫర్వాలేదు. పరిమిత బడ్జెట్‌తో బాగానే తీశారు. కథ, మాటలు, దర్శకత్వం.. చెప్పాలంటే.. కథనం ఉయ్యాల జంపాలా స్లోగా సాగుతుంది. సంభాషణలపరంగా ఎక్కడా ప్రాసకోసం చూడకుండా నేచురల్‌గా ఉన్నాయి.
 
విశ్లేషణ:
నాని సినిమాలంటే పక్కింటి కుర్రాడిలా ఉంటాడని మహిళలు కూడా మెచ్చుకుంటారు. ఈ మజ్ను విషయంలో మాత్రం.. అంతకుముందు చూసిన కుర్రాడిలాగే నటిస్తున్నాడనే ఫీలింగ్‌ కలుగుతుంది. మొదటిభాగం సరదాగా సాగుతుంది. రెండోభాగంలో కథ చెప్పాలికాబట్టి.. అది అంత కన్‌వ్సింగ్‌గా అనిపించదు. తను ప్రేమించింది.. సుమ చెల్లిల్నే అని చెప్పడానికే సెకండాఫ్‌ అంతా సరిపోయింది. మధ్యలో అడ్డంకులు వాటిని కొనసాగించడం.. సేమ్‌ టు సేమ్‌.. ఉయ్యాల జంపాల ముగింపులా ఉంది. ఇప్పటి దర్శకులు చాలా సింపుల్‌ కథతో.. అందులో నేటి జనరేషన్‌.. ప్రేమించుకోవడంలో ఉన్న ఆలోచనలు కొత్తగా ఉండేలా చూసుకునేట్లేగా రాసేసుకుని సినిమాలు చేస్తున్నారు.
 
ప్రేమించడంలో కూడా కొత్తగా కాలేజీలో చూపించాడు. భీమవరంలో జరిగిన ఏదైనా సంఘటనలా అనిపిస్తుంది. లేదంటే దర్శకుడికి ఎదురైన అనుభవమే కావచ్చు. లవ్‌ట్రాక్‌ చూడ్డానికి బాగుంది. అయితే సింపుల్‌ స్టోరీ. చెల్లెల్ని ప్రేమించిన హీరో.. ఆమెపై ద్వేషంతో.. అక్కను అనుకోకుండా ప్రేమించేస్తాడు. చివరగా తెలుసుకుని యూటర్న్‌ అవుతాడు. ఈ కథలు కోకొల్లలు వచ్చాయి. అలాంటి కథను మరలా విరంచి వర్మ తన మైండ్‌తో చేసిన ప్రయోగమే ఇది. ఎటువంటి అసభ్యతకు తావులేకుండా హాయిగా చూసేందుకు వీలున్న కాన్సెప్ట్‌ ఇది. ఏదేదో ఆశించి వస్తే కష్టమే... కాసేపు టైంపాస్‌ సినిమా.. అయితే.. టైటిల్‌కు కథకు సంబంధమేలేదు. ఏదో ఎట్రాక్ట్‌ చేయడానికి పెట్టారు. ఇలాంటి చిత్రాలు యూత్‌కు నచ్చితే బాగానే ఆడతాయి. చాలా పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం నిర్మాతకు సేఫ్‌. మరి కొన్నవారికి ఎలా వుంటుందో చూడాలి.
 
రేటింగ్‌: 2/5