శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (11:24 IST)

'ప్రకృతిలో ప్రేమ చాలా గొప్పది.. దాన్ని మించిన ఇన్‌స్పిరేషన్ లేదు'.. ఇదే నిర్మలా కాన్వెంట్ రివ్యూ

ప్రకృతిలో ప్రేమ చాలా గొప్పది.. దాన్ని మించిన ఇన్‌స్పిరేషన్ లేదు.. ఈ పాయింట్ తో అల్లుకున్న కథే నిర్మలా కాన్వెంట్. చాలా మంది ప్రేమ గురించి ఎప్పుడో చెప్పింది కదా, ఇందులో కొత్తదనం ఏముంది అనుకోవచ్చు. ఈ చిత

నిర్మాణ సంస్థలు: అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, కాన్సెప్ట్ ఫిలిం ప్రొడక్షన్
 
తారాగణం: అక్కినేని నాగార్జున, రోషన్, శ్రియాశర్మ, ఎల్.బి.శ్రీరాం, ఆదిత్యమీనన్, సమీర్, రవిప్రకాష్, సూర్య, ప్రసన్నకుమార్, తాగుబోతు రమేష్, జోగి బ్రదర్స్, ప్రభు, ప్రవీణ్, సత్యకృష్ణ తదితరులు.
 
కథ: కాన్సెప్ట్ ఫిలింస్
నిర్మాతలు: నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున
రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగ కోటేశ్వరరావు
 
ప్రకృతిలో ప్రేమ చాలా గొప్పది.. దాన్ని మించిన ఇన్‌స్పిరేషన్ లేదు.. ఈ పాయింట్ తో అల్లుకున్న కథే నిర్మలా కాన్వెంట్. చాలా మంది ప్రేమ గురించి ఎప్పుడో చెప్పింది కదా, ఇందులో కొత్తదనం ఏముంది అనుకోవచ్చు. ఈ చిత్రంలో కొత్తదనం ఎక్కడా కనిపించదు. అయినప్పటికీ ఓ కొత్త దర్శకుడు జి.నాగకోటేశ్వర రావు, కొత్త హీరో రోషన్, హీరోయిన్ శ్రియా శర్మ, రెహమాన్ తనయుడు అమీన్ సింగర్‌గా పరిచయం కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. 
 
వీటికితోడు అక్కినేని నాగార్జున నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతో పాటు, నటించాడు. సాధారణంగా మంచి కాన్సెప్ట్ ఉంటే కానీ సపోర్ట్ చేయని నాగార్జున ఈ స్థాయి సహకారం అందిస్తున్నాడంటే సినిమా మంచి విషయముందని ప్రేక్షకులు సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. మరి ఈ నిర్మలా కాన్వెంట్‌లో దర్శకుడు టీనేజ్ లవ్ గురించి ఏ విషయాలు చెప్పాడనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
 
కథ: భూపతి నగరం ఊర్లో 99 ఎకరాల ఆసామి అయిన రాజుగారికి ఒక ఎకరం ఉన్న వీరయ్య (ఎల్.బి.శ్రీరాం)కు పడదు. అందుకు తన కులపోళ్లను గుడిలోకి అనుమతించకపోవడం, చెరువు నీళ్ళు తాగనీయకపోవడం వంటి కారణాలుంటాయి. అంతేకాకుండా రాజుగారి పొలానికి కావాల్సిన నీళ్ళు వీరిగాడి పొలం నుండే రావాలి. అందుకు వీరయ్య పేచీ పెడుతుంటాడు. దాంతో ఊర్లో జరిగే ఉత్సవాల సమయంలో వీరయ్యను, రాజుగారు మనుషులు చంపేస్తారు. వీరిగాడు చనిపోతు కొడుకు సూరయ్య(సూర్య)తో ఆ ఎకరం పొలం ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదంటూ మాట తీసుకుని చనిపోతాడు. 
 
తండ్రి మరణం తర్వాత సూరయ్య క్రిస్టియన్ మతంలోకి మారిపోయి డేవిడ్ అని పేరు మార్చుకుంటాడు. మేరి(అనితా చౌదరి)ని పెళ్ళి చేసుకుంటాడు. డేవిడ్, మేరిల కొడుకు శామ్యూల్స్(రోషన్). రాజుగారి కొడుక్కి (ఆదిత్యమీనన్) కూడా కూతురు పుడుతుంది. ఆమె పేరే శాంతి(శ్రియాశర్మ). శామ్యూల్స్ చదువుల్లో ఫస్ట్ అంతేకాకుండా తన చుట్టూ పక్కల జరిగే విషయాలపై మంచి అవగాహనతో, నాలెడ్జ్‌తో ఉంటాడు. శామ్యూల్స్, శాంతి మధ్య ప్రేమ పుడుతుంది. దానివల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి? అసలు శామ్యూల్స్ హైదరాబాద్ వచ్చి నాగార్జున అక్కినేనికి చాలెంజ్ ఎందుకు విసురుతాడు? చివరకు శామ్యూల్, శాంతిల ప్రేమ గెలిచిందా? అనే అంశాలపైనే మిగిలిన కథ సాగుతుంది. 
 
నటీనటుల పాత్రల సమీక్ష: హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చాలా మంచి మార్కులు కొట్టేశాడు. తన మొదటి సినిమాలా అనిపించలేదు. చాలా కాన్ఫిడెంట్‌గా, ఈజ్‌తో నటించాడు. శామ్యూల్స్ టీనేజ్ అబ్బాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. తనకు మంచి భవిష్యత్ ఉందని నటన ద్వారా నిరూపించాడు. శ్రియాశర్మ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఆదిత్యమీనన్, సత్యకృష్ణ, తాగుబోతు రమేష్, రోషన్ కనకాల, సూర్య, అనితా చౌదరి, ఎల్.బి.శ్రీరాం సహా అందరూ తమతమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కినేని నాగార్జున గురించే, నిర్మలాకాన్వెంట్ చిత్రానికి ఈ రేంజ్ బజ్ రావడానికి ఆయనే కారణం. ఇటు నిర్మాణంలో, అటు నటన పరంగా సినిమాకు బాగా హెల్ప్ అయ్యారనే చెప్పాలి. 
 
రేటింగ్: 2.5/5