గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (20:33 IST)

'ఓ మల్లి'... జాతర రోజు మల్లిపై వాడు అత్యాచారం... రివ్యూ ఇలా...

ఓ మల్లి నటీనటులు: రమ్యశ్రీ, రఘుబాబు, ఎల్‌బి శ్రీరామ్‌, ఆకాష్‌ తదితరులు; సంగీతం: సునీల్‌ కశ్యప్‌, బిఎన్‌. కృష్ణమూర్తి, నిర్మాత: బిఎస్‌ ప్రశాంత్‌ కుమార్‌. దర్శకత్వం: బి. రమ్యశ్రీ. నటి రమ్యశ్రీ వ్యాంప్‌

ఓ మల్లి నటీనటులు: రమ్యశ్రీ, రఘుబాబు, ఎల్‌బి శ్రీరామ్‌, ఆకాష్‌ తదితరులు; సంగీతం: సునీల్‌ కశ్యప్‌, బిఎన్‌. కృష్ణమూర్తి, నిర్మాత: బిఎస్‌ ప్రశాంత్‌ కుమార్‌. దర్శకత్వం: బి. రమ్యశ్రీ.
 
నటి రమ్యశ్రీ వ్యాంప్‌ పాత్రలు పోషిస్తూ.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తూ.. కొంతకాలం గ్యాప్‌ తీసుకుని మెగా ఫోన్‌ పట్టింది. శ్రీకాకుళంకు చెందిన ఈమె అక్కడ జరిగిన ఓ సంఘట ఆధారంగా సినిమాగా తీశానని స్టేట్‌మెట్‌ ఇచ్చింది. దాదాపు రెండేళ్ళ నుంచి తను తీసి, నటించిన 'ఓ మల్లి..' విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు నేడు విడుదల చేయగలిగింది. మరి అంతగా ఆమె దర్శకత్వం చేయడానికి గల కారణాలేమిటో సినిమా చూస్తే తెలుస్తుంది.
 
కథ: అరకులోని గిరిజన ప్రాంతంలో మల్లి (రమ్యశ్రీ) తన తండ్రి నారిగాడు(ఎల్‌బి శ్రీరామ్‌)తో పాటు జీవిస్తుంటుంది. కూతురంటే వల్లమానిన ప్రేమ. అంతకంటే సారా తాగడంటే ప్రేమ కురిపిస్తాడు. ఊరిలోనే సింగడు అనేవాడి కన్ను మల్లిపై పడుతుంది. నారిగాడికి కావాల్సిన సారా పోయించి మల్లిని తనదాన్ని చేసుకోవాలని చూస్తాడు. ఊరి జనాల ముందు నారిగాడు అవమానిస్తాడు. దాంతో జాతర రోజు మల్లిపై అత్యాచారం చేస్తాడు. ఇది తెలిసిన ఊరిజనం గుండు తీయించే తీర్పు ఇస్తారు. ఆ తర్వాత నారిగాడు చనిపోవడంతో ఒంటరిదైన మల్లిని పక్క ఊరి రాములయ్య(రఘుబాబు) పెండ్లి చేసుకుంటాడు. 
 
కొద్దికాలానికే రాములయ్య కల్తీసారా తాగి పక్షవాతానికి గురవుతాడు. అప్పటినుంచి తనే సేవలు చేస్తూ, గంపలో పిల్లల ఆట వస్తులు అమ్మి జీవనం సాగిస్తుంది. ఇలాంటి సమయంలో విశాఖ రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కలెక్టర్‌ రవి(ఆకాష్‌) ఈమెను చూసి ఇష్టపడతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌
ప్రధాన పాత్ర మల్లిది కాబట్టి ఆ పాత్రను రమ్యశ్రీ తనే చేసింది. నటిగా బాగానే చేసినా.. వయస్సు పైబడిన ఛాయలు కన్పిస్తున్నాయి. అందుకే ఈ పాత్ర పోషించడం సవాల్‌ అనే చెప్పాలి. ఇతర పాత్రలు నటన రాబట్టుకోవడంలో తను బాగా డీల్‌ చేసింది. దర్శకురాలిగా పలు చిత్రాల అవగాహనతో తను చేసిన తీరు బాగుంది. ఎల్‌బి శ్రీరామ్‌ తాగుబోతు తండ్రిగా కుదిరాడు. రఘుబాబు పక్షవాతం తర్వాత చేసిన హావభావాలు అమరాయి. ఆకాష్‌ ఫర్వాలేదు. 
 
టెక్నికల్‌గా..
కథ ప్రకారం అంతా గిరిజన ప్రాంతం కావడంతో సహజత్వానికి పెద్దపీట వేసింది. ఒరిజినల్‌ లైటింగ్‌తో కెమెరా ఎక్కువగా పనిచేసింది. అరకు అందాలు బాగా చూపించాడు. సునీల్‌ కశ్యప్‌ బాణీలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం బాగానే వుంది. జేసుదాస్‌ పాడిన టైటిల్‌ సాంగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది. ఇటువంటి సీనియర్లు ఈ చిత్రానికి పనిచేయడం ఎస్సెట్‌గా మారింది. సంభాషణలు సహజంగానే వున్నాయి. ప్రాసలు లేకుండా, యాస, భాషలపై శ్రద్ధ తీసుకున్నారు. దర్శకురాలిగా బాగానే డీల్‌ చేసింది.
 
విశ్లేషణ:
ఈ చిత్రం ముందుగా నిర్భయ లాంటి వారికి అంకితమంటూ స్లైడ్‌ వేసింది దర్శకురాలు. ఈ కథ ఏమిటో అర్థమయ్యేలా చేసింది. గిరిజన ప్రాంతాల్లో వుండే మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. తల్లీ- తండ్రి లేనివారిని సమాజంలో ఏవిధంగా చూస్తుందో తెలియజెప్పింది. కథలోని పాయింట్‌తో పాటు కొన్ని సన్నివేశాలు ఏవో సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తాయి. మల్లి పాత్ర, ఆమెతో వుండే అవిటివాడు పదహారేళ్ల వయస్సు.. చిత్రాన్ని గుర్తు చేస్తాయి. కథ పాతదే అయినా.. దాన్ని నడిపించే విధానం కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుండేది. ముఖ్యంగా టైటిల్‌ రోల్‌ను రమ్యశ్రీ ప్లే చేయడం సాహసమనే చెప్పాలి. రైల్వే టిసి.. ఆకాష్‌. ఆమెను ఏమి చూసి ప్రేమించాడో అర్థంకాదు. 
 
రమ్యశ్రీ పాత్రను గ్లామర్‌ హీరోయిన్‌ ప్లే చేస్తే ఆకట్టుకునేది. ఇక ఆర్థిక లేమి, అక్రమ సంబంధాలు వంటివి కొన్ని సన్నివేశాలు పెట్టింది. వాటికి సరైన వివరణనివ్వలేకపోయింది. రోజు గడవక పడుపు వృత్తి చేసే యువతిని బెదిరించే పోలీసు సన్నివేశాలు గిరిజన ప్రాంతాల్లో జరిగేవే. పచారీ కొట్టు నడిపే పృథ్వీ పాత్ర కూడా అంతే. మహిళా ఆలోచన విధానం, అపార్థాలు వంటి అంశాలతో స్త్రీ కోణంలో రమ్యశ్రీ చెప్పిన కథ ఇది. కమర్షియల్‌ అంశాలకు దూరంగా, సమాంతర సినిమాలకు దగ్గరగా వున్న చిత్రమిది. వాస్తవంగా గిరిజన ప్రాంతాల్లో జరిగే అంశాలను కథగా తీసుకుని రమ్యశ్రీ సాహసం చేసింది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
 
రేటింగ్: 2.5/5