శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 10 జూన్ 2016 (20:48 IST)

'ఒక్క అమ్మాయి తప్ప' రివ్యూ రిపోర్ట్... సందీప్ కిషన్ రెమ్యునరేషన్ అందుకే వద్దన్నాడా...?

ఛోటా కె.నాయుడు మేనల్లుడిగా సందీప్‌ కిషన్‌ హీరోగా నిలబడాలని ప్రయత్నించి.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ టైంలోనే మాటల రచయిత తనకు చెప్పిన కథను రెండేళ్ళకుపైగా మరలా అతనితోనే తీయడం విశే

ఒక్క అమ్మాయి తప్ప నటీనటులు: సందీప్‌ కిషన్‌, నిత్యా మీనన్‌, ఆలీ, నళిని, రవికిషన్‌, రాహుల్‌ దేవ్‌, రోహిణి, సప్తగిరి, తాగుబోతు రమేష్‌ తదితరులు; సాంకేతిక వర్గం:  ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు, సంగీతం: మిక్కీ జే మేయర్‌, నిర్మాత: భోగాది అంజిరెడ్డి, రచన - దర్శకత్వం: రాజసింహా తాడినాడ. 
 
ఛోటా కె.నాయుడు మేనల్లుడిగా సందీప్‌ కిషన్‌ హీరోగా నిలబడాలని ప్రయత్నించి.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ టైంలోనే మాటల రచయిత తనకు చెప్పిన కథను రెండేళ్ళకుపైగా మరలా అతనితోనే తీయడం విశేషం. దీనికోసం పారితోషికాన్ని కూడా తీసుకోకుండా చేశాడంటే.. విశేషమే మరి. 'రుద్రమదేవి' సినిమాతో మాటల రచయితగా మంచి పేరు సంపాదించిన రాజసింహా దర్శకుడు అవ్వాలని ఇంతకాలం ఎదురు చూశాడు. ఆఖరికి సినిమా చూపిస్తా మావలో.. ఒక నిర్మాత అయిన అంజి రెడ్డి ముందుకు రావడంతో ఈజీ అయింది. ఈ చిత్రం కోసం కొన్ని కష్టాలు పడ్డామని.. చెబుతున్న హీరో... ఈ సినిమాలో తనేం చేశాడో చూద్దాం.
 
కథ: 
కష్ణవచన్‌ (సందీప్‌ కిషన్‌) చిన్నప్పుడే అల్లరి పిల్లవాడు. స్కూల్లో ముద్దుగా మ్యాంగో అని పిలుచుకునే అమ్మాయి (నిత్యా మీనన్‌)కి ఐ లవ్యూ చెప్పేవాడు. కట్‌ చేస్తే.. పెద్దయ్యాక.. కాలేజీ పూర్తయి.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓసారి హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై వెళుతుండగా ట్రాఫిక్‌ జాంలో ఇరుక్కుపోతాడు. అక్కడే ఓ అమ్మాయిని కలుస్తాడు. ఆమె వల్లే తను ఇరుక్కున్నాడంటూ గొడవకు దిగుతాడు. అలా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి తర్వాత సద్దుమణుగుతుంది. ఆ గొడవల్లో తన చిన్నప్పుడు మ్యాంగోగా ఆమెను గుర్తిస్తాడు. ఆమెపై ప్రేమను పెంచుకుంటాడు. ఇదిలావుండగా.. ట్రాఫిక్‌ జామ్‌కు కారణం ఏమిటో అని కనుక్కుంటాడు. అన్వర్‌ (రవికిషన్‌) అనే వ్యక్తి.. కావాలనే ఫ్లైఓవర్‌ మీద యాక్సిడెంట్‌ చేయించి.. అక్కడ బాంబ్‌ బ్లాస్ట్‌ ప్లాన్‌ చేస్తాడు. అది ఫెయిల్‌ కావడంతో జామ్‌ అవుతుంది. ఈ క్రమంలో కృష్ణవచన్‌ కన్పించగానే అతన్ని టార్గెట్‌ చేసుకుంటాడు. అతన్ని పట్టుకుని తనపని పూర్తిచేసుకోవాలని అన్వర్‌ చూస్తాడు. అప్పుడు మ్యాంగో ఏంచేసింది? కృష్ణవచన్‌ ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.

 
పెర్‌ఫార్మెన్స్‌: 
సందీప్‌ కిషన్‌ పాత్రే కథను నడిపిస్తుంది. అంతా తానై చేస్తాడు. గత చిత్రాలకంటూ కాస్త మెరుగ్గా హావభావాలు కన్పిస్తాయి. తన స్పీడ్‌ టాకింగ్‌.. రొటీన్‌ చిత్రాలమల్లే వున్నా.. ఫర్వాలేదనిపిస్తుంది. పాత్ర పూర్తిగా తెలుసు కనుక చాలా కాన్ఫిడెంట్‌గా చేసేశాడు. మోతాదుకు మించిన నటన కూడా చేశాడు. సహజంగా నిత్యమీనన్‌ హీరోను డామినేట్‌గా చేస్తుంది. కానీ ఈ సినిమాలో పాత్ర పరిమితమే. ఫ్లైఓవర్‌ మీద ఎక్కువసేపు సినిమా గనుక నటించడానికి పెద్దగా ఏమీలేదు.
 
ఇక విలన్‌ పాత్రలో రవికిషన్‌ నటన వున్నా.. చాలాచోట్ల అతిగా నటించాడు. భయపెట్టబోయి నవ్వించేట్లుగా విలనిజం వుంది. జబర్‌దస్త్‌ కమెడియన్లు చాలామంది నవ్వించడానికి ప్రయత్నించారు కానీ.. అందరూ ఫెయిలయ్యారు. ఉన్నంతలో పృథ్వీ కాస్త మెరుగు. మిగతా వాళ్లంతా మామూలే.
 
సాంకేతికవర్గం: 
ఒకే లొకేషన్‌పై సినిమా మొత్తం తీయడం సాహసమే. అందుకు కెమెరా పనితనం కావాలి. ఛోటా కే నాయుడు మొనాటనీ రాకుండా తన కెమెరాతో మ్యాజిక్‌ చేశాడు. రిచ్‌నెస్‌ కన్పిస్తుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం ఫర్వాలేదు. గుర్తుండిపోయే పాటల్లేవు. కథ ప్రకారం పాటలు సూట్‌కావు కానీ.. నిడివి పెంచాలంటే పెట్టాల్సిందే అన్నట్లుగా వున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్లోనే క్వాలిటీ చూపించారు. రచయిత, దర్శకుడు ఒక్కటే కావడంతో.. తన పరిధి మేరకు చేశాడు. ఐడియా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడిగా పనితనం చూపించాడు. కానీ నిలకడ లేకపోయింది. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమా అని మొదటినుంచి చెబుతున్నా.. ఇంకా బిగువైన స్క్రీన్‌ప్లే చేస్తే బాగుండేది. ప్రేమ గురించి కొన్ని డైలాగ్‌లు ఫర్వాలేదనిపిస్తాయి.
 
విశ్లేషణ: 
ఒకే ఒక్క పాయింట్‌ తీసుకుని ఒకే లొకేషన్‌లో సినిమా తీయడం సాహసమే. గతంలో తెలుగులో ఈనాడు.. చిత్రం ఈ తరహాలోనే వచ్చాయి. అంత గ్రిప్పింగ్‌ లేకపోయినా... పాయింట్‌ కొత్తగా అనిపిస్తుంది. కొత్త దర్శకుడు ఇటువంటి పాయింట్‌ను చేయడం నిర్మాతకు సాహసమే. అందుకే ఆయన్ను అభినందించాలి. 'ఒక్క అమ్మాయి తప్ప' అందరూ సిస్టర్సే.. అనే కాన్సెప్ట్‌ను దర్శకుడు చెప్పదలిచాడు. దానికి ఫ్లైఓవర్‌పై రెండుంబావు గంటల నిడివిలో 80 శాతం సన్నివేశాలు ఒకే లోకేషన్లో నడుస్తాయి. ఇలా చేయాలంటే.. అనుభవం కావాలి. కొత్తవాడైనా దర్శకుడు బాగానే చేశాడు. ఇందులో థ్రిల్‌ చేసే అంశాలు.. ఉత్కంఠభరిత సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఇక కామెడీ పేరుతో అర్థం లేని సీన్స్‌ పెట్టేసి ఆకట్టుకోవాలని చూసి ఫెయిలయ్యాడు. ఒకరకంగా మైండ్‌గేమ్‌ మూవీ. హీరో విలన్‌ మధ్య సాగే ఎత్తులు పెద్దగా పారలేదు.
 
 
అలాగా కొన్ని లాజిక్కులు కూడా వుండవు. ఏదో సినిమా తీసి ఎంటర్‌టైన్‌ చేయాలనే కాన్సెప్ట్‌తోనే దర్శకుడున్నాడు. ఫ్లైఓవర్‌ మీద పొద్దుట్నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌ నిలిచిపోవడం.. ఎవరూ ఎటూ కదలకుండా అక్కడే ఉండిపోవడం.. ఫ్లైఓవర్‌ మీద ఉన్న వ్యక్తితో విలన్‌ దూరం నుంచి తన మిషన్‌ అమలు చేయించడం.. ఇవన్నీ లాజిక్‌కు అందని విషయాలే కానీ.. ఇదంతా కొంచెం కొత్తగా.. ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ప్రథమార్ధమంతా పాత్రల పరిచయం.. సోసోగా సాగిపోయే సరదా సన్నివేశాలతో నడిపించేసిన దర్శకుడు.. ఇంటర్వెల్‌ దగ్గర్నుంచే అసలు కథలోకి వెళ్లాడు. ఇక ద్వితీయార్థంలో తర్వాత ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠను బాగానే మెయింటైన్‌ చేశాడు దర్శకుడు. 
 
మధ్యలో ఉప కథలుగా తనికెళ్ల భరణి లెక్చర్‌ దంచే సీన్‌ కూడా మరీ డ్రమటిగ్గా అనిపిస్తాయి. సినిమాను ముగించిన తీరు బాగుంది. మెయిన్‌ ప్లాట్‌ చుట్టూ ఉత్కంఠభరితంగా కథనాన్ని నడిపేంత సామర్థ్యం దర్శకుడికి లేకపోడం వల్ల 'ఒక్క అమ్మాయి తప్ప' మంచి థ్రిల్లర్‌‌గా రూపుదిద్దుకోలేకపోయింది. ఇక ఆలీతో పెళ్లిచూపులు, టీవీ ఛానెళ్ల తీరు మీద.. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి వైద్యం మీద సెటైర్లు వేసే సన్నివేశాలు అనేవి.. కథను సాగదీయడానికి ఉపయోగపడ్డాయి. చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పకుండా పక్కనే ఎంటర్‌టైన్‌ కోసం సన్నివేశాలు కూర్చి లాగించాలనుకున్నాడు.
 
రేటింగ్‌: 2/5