Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓం నమో వేంకటేశాయ రివ్యూ రిపోర్ట్.. అలరించిన నాగ్- వెంకన్నగా అందంగా కనిపించిన మహాభారత కృష్ణుడు సౌరభ్

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (13:37 IST)

Widgets Magazine
nagarjuna in namo venkatesaya

సినిమా పేరు : ఓం నమో వేంకటేశాయ
జానర్ : చారిత్రక భక్తిరస చిత్రం
తారాగణం : నాగార్జున, అనుష్క, సౌరభ్ జైన్, రావూ రమేష్, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్ తదితరులు
దర్శకత్వం : కె.రాఘవేంద్రరావు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నిర్మాత : ఎ.మహేష్ రెడ్డి
 
తెలుగువారికి పెద్దగా పరిచయం లేని హథీరాం బాబాజీ జీవితకథను కె.రాఘవేంద్రరావుగారు తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి భక్తిరస చిత్రాలు ఇప్పటికే నాగార్జున-కె రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబోలో మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం.. 
 
కథలోకి వెళితే.. :
రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ (నాగార్జున) చిన్నతనం నుంచే దేవుడిపై భక్తిని పెంచుతాడు. ఆయన్ని చూడాలనే ఆశయంతో ఇంటి నుంచి బయల్దేరుతాడు. ఆపై అనుభవానంద స్వామి ( సాయికుమార్)దగ్గర శిష్యరికం చేస్తాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఓంకార జపం చేస్తూ కఠోర తపస్సు చేస్తాడు. అలా ఏళ్లు గడిచిపోతాయి. రామ భక్తికి మెచ్చిన వేంకటేశుడు, వటపత్రశాయిగా వచ్చి బాలుడి రూపంలో రామ తపోభంగం చేస్తాడు. అయితే బాలుడి రూపంలో వచ్చినది ఆ దేవదేవుడే అని గుర్తించలేని రామ ఆగ్రహంతో వెళ్లిపొమ్మని శాసిస్తాడు. ఆ బాధతో ఇంటికెళ్లిన రామకి మరదలు భవాని (ప్రగ్యా జైస్వాల్)తో పెళ్లి చేయాలనుకుంటారు. కానీ భగవంతుడిని దర్శించటమే తన జీవితాశయం అని భవానికి నచ్చజెప్పి తన ప్రయాణం మొదలు పెడతాడు. 
 
గురువు ద్వారా తన తపోభంగం చేసిన బాలుడిని చూడాలనుకుని.. కొండపైకి చేరుకుంటాడు. కొండమీదే ఆశ్రమంలో ఉండే కృష్ణమ్మ (అనుష్క) సాయంతో అధికారం చెలాయిస్తూ వెంకటేశ్వరుని సొమ్మును దోచుకుంటున్న గోవిందరాజులు (రావూ రమేష్)ను ఎదిరిస్తాడు. కొండపై జరిగే అన్యాయాలను మహారాజు (సంపత్ రాజ్)కు వివరించి గోవిందరాజులను పదవి నుంచి తప్పించి తిరుమల బాధ్యతలు స్వీకరిస్తాడు. అలా ఆ వేంకటేశుడి సేవకుడిగా మారిన రామ, హాథీరాం బాబాజీగా ఎలా మారాడు. కొండ మీద ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు. స్వామిని స్వయంగా చూడాలన్న రామ కోరిక ఎలా తీరిందా లేదా? మరదలను హాథీరాం బాబా పెళ్ళి చేసుకుంటాడా? అనుష్క పాత్రకున్న గుర్తింపు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
విశ్లేషణ:
నటీనటుల యాక్టింగ్ అదిరింది. నాగార్జున అన్నమయ్య, రామదాసుగా అలరించినట్లే హాథీరాం బాబాజీ పాత్రలో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ తరంలో భక్తుడి పాత్రలకు తాను తప్ప మరెవ్వరూ న్యాయం చేయలెరన్న స్థాయిలో నాగార్జున నటన ఆకట్టుకుంది. బుల్లితెర మహాభారతంలో కృష్ణుడిగా.. ఈ సినిమాలో వెంకన్నగా కనిపించిన సౌరభ్ జైన్ మరింత అందంగా కనిపించాడు. 
 
లుక్స్ పరంగా అద్భుతం అనిపించిన సౌరభ్, నటన విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి వుండాల్సింది. కృష్ణమ్మ పాత్రలో అనుష్క నటన బాగుంది. విలన్‌గా రావూ రమేష్ తనకు అలవాటైన నటనతో మెప్పించాడు. సాంకేతిక నిపుణుల పనితీరు ఆకట్టుకుంది. ఓవరాల్‌గా ఓం నమో వేంకటేశాయ, తిరుమల విశిష్టతను, హాథీరాం బాబా గొప్పతనాన్ని తెలిపే భక్తిరస చిత్రంగా తెరకెక్కిందనే చెప్పాలి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. ఇంకా రాఘవేంద్ర రావు మార్కు కనిపించింది. పాటలు బాగున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగార్జున కెరీర్‌లో 'ఓం న‌మో వేంక‌టేశాయ' క‌లికితురాయి : మెగాస్టార్ చిరంజీవి

అక్కినేని నాగార్జున - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ...

news

కళ్యాణ్ రామ్ నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27వ చిత్రం ప్రారంభం

'జనతా గ్యారేజ్' చిత్రంతో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, ...

news

''రంగూన్''లో సహజ సౌందర్యాన్ని ఒలకపోశాను.. ఓపెన్ రైలు బోగిపై డ్యాన్స్ చేశా: కంగనా రనౌత్

బోల్డ్‌గా మాట్లాడటంలో దిట్ట, అందాల సుందరి కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్‌లో రంగూన్ ...

news

యాక్టింగ్ కూడా ఉద్యోగమే.. భర్తకు-అత్తకు నచ్చలేదంటే ఎలా? పెళ్లై పిల్లలు పుట్టినా నటిస్తా: శ్రుతిహాసన్

పెళ్లైన తర్వాత సినిమాలకు దూరం కాలేదని.. దర్శకుడు విజయ్ అమలాపాల్‌తో విడాకులు తీసుకున్న ...

Widgets Magazine