శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (11:56 IST)

ప్రేమమ్ రివ్యూ రిపోర్ట్: యూత్‌కు కనెక్ట్‌ అయ్యే మూడు లవ్ స్టోరీలు.. చైతూ అదుర్స్.. శృతి నటనే సినిమాకు ప్రాణం..

న‌టీన‌టుల్లో హీరో అక్కినేని నాగ‌చైత‌న్య తన కెరీర్లోనే అద్భుతమైన నటనను కనబరిచాడు. మూడు లవ్ స్టోరీల్లో మెరుగ్గా నటించాడు. ప్రేమ‌మ్‌లో చైతు న‌ట‌నా ప‌రంగా మ‌రో మెట్టు ఎక్కాడు. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్

సినిమా: ప్రేమ‌మ్‌
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, శృతీహాస‌న్‌, మ‌డోన్నా స్టెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌దిత‌రులు
జాన‌ర్‌: ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ
నిర్మాత‌: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
ద‌ర్శ‌క‌త్వం: చందు మొండేటి
విడుదల: 07 అక్టోబ‌ర్‌, 2016
 
నాగచైతన్య ప్రస్తుతం టాలీవుడ్ టాక్ ఆఫ్ హీరో అయిపోయాడు. ఓ వైపు టాప్ హీరోయిన్‌తో పెళ్లి ప్రేమాయణంతో ఫ్యాన్స్ నోట నానుతున్న చైతూ.. మరోవైపు ప్రేమమ్ సినిమాతోనూ ఫిలిమ్ నగర్‌లో అందరూ తన గురించే మాట్లాడుకునేలా చేశాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. మలయాళ సూపర్ హిట్ క్లాసిక్ ప్రేమమ్ సినిమాను తెలుగులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ కార్తీకేయ ఫేం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ చేసింది. అక్కినేని నాగచైతన్య హీరోగా, ముగ్గురు హీరోయిన్లు నటించిన ప్రేమమ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.. 
 
కథలోకి వెళితే.. 
ప్రేమమ్‌లో మూడు లవ్ స్టోరీలుంటాయి. ముగ్గురు హీరోయిన్స్‌తో హీరో రొమాన్స్ చేశాడు. స్కూల్ డేస్‌లో అనుపమ పరమేశ్వరన్‌ని ప్రేమిస్తూ వెనక తిరుగుతూ ఉంటాడు. త‌ర్వాత‌ గ్రాడ్యుయేషన్ కోసం ఆంధ్ర యూనివర్సిటీలో చేరతాడు చైతన్య. ఇక్కకే కథ రక్తి కడుతుంది. యూనివర్సిటీలో శృతి హసన్ లెక్చరర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడే రెండో ప్రేమ కథ మొదలవుతుంది. కాలేజ్‌లో కాలేజీలో పెట్టిన కాంపిటీషన్ గెలవడానికి సహకరిస్తుంది శృతిహసన్. ఇలా శృతిహాసన్ లవ్‌లో పడతాడు. అయితే శృతిహాసన్‌కు ప్రమాదం జరిగి గతం మరిచిపోతుంది. కానీ చైతూ శృతిని మరిచిపోలేకపోతాడు. ఆ సమయంలోనే మడోన్నా సెబాస్టియన్ పరిచయం కావడం.. మూడో లవ్ స్టోరీ మొదలవడం జరుగుతుంది. ఇక్కడే ఓ అరగంట సినిమా మనసుల్ని కదిలిస్తుంది. శృతిహసన్‌కు గతం గుర్తుకు వచ్చినా రానట్లే నటిస్తూ చేసిన నటన సినిమాకు ప్రాణం. ఈ ముగ్గురిలో చివర్లో చైతూ ఎవర్ని పెళ్ళి చేసుకుంటాడనేది తెలియాలంటే.. తెరపై చూడాల్సిందే.
 
పెర్‌ఫార్మెన్స్: 
న‌టీన‌టుల్లో హీరో అక్కినేని నాగ‌చైత‌న్య తన కెరీర్లోనే అద్భుతమైన నటనను కనబరిచాడు. మూడు లవ్ స్టోరీల్లో మెరుగ్గా నటించాడు. ప్రేమ‌మ్‌లో చైతు న‌ట‌నా ప‌రంగా మ‌రో మెట్టు ఎక్కాడు. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క్యూట్ లుక్స్‌తో చంపేసింది. టీచ‌ర్ పాత్ర‌లో శృతి సైతం చ‌క్క‌గా చేసింది. ఇక మ‌డోన్నాకు ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌తో పోల్చుకుంటే పాత్ర నిడివి పెరిగింది. ఇక డీసీపీ రామ‌చంద్రగా విక్ట‌రీ వెంక‌టేష్‌, నాగ్ సైతం వాయిస్ ఓవ‌ర్‌తో క్లైమాక్స్‌లో కాసేపు కనిపించాడు. ఇక సంగీతం అదిరింది. దర్శకత్వం మెరుగైంది. కామెడీ అదిరిపోయింది. ఓవరాల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 
 
ప్ల‌స్ పాయింట్స్‌:
నాగ‌చైత‌న్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ నటన
సంగీతం, నిర్మాణం, స్టోరీ, వెంకీ, నాగ్ గెస్ట్ రోల్స్ 
 
మైన‌స్ పాయింట్స్‌:
స్క్రీన్ ప్లే
రేటింగ్ : 3.5