శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By CVR
Last Updated : శుక్రవారం, 1 మే 2015 (18:55 IST)

నవ్విస్తూ భయపెట్టిన ''గంగ'' రివ్యూ రిపోర్ట్..!

ప్రముఖ డ్యాన్సర్, హీరో, నిర్మాత రాఘవ లారెన్స్ దెయ్యం నేపథ్యంలో తొలుత ముని, తర్వాత కాంచన తీసి హిట్లు కొట్టాడు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ''గంగ''. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో లారెన్స్ ఆకట్టుకున్నాడో లేదో తెలిపే రివ్యూలో రిపోర్ట్ మీకోసం..  

సినిమా: గంగ
నటీనటులు: రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్, కోవై సరళ, జయప్రకాష్‌రెడ్డి, సుహాసిని
సంగీతం: తమన్
నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు
దర్శకత్వం: రాఘవ లారెన్స్
విడుదల తేదీ: 1 మే, 2015
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ 
రేటింగ్ : 2.5/5
 
 
చిత్ర కథ :
రాఘవ( రాఘవ లారెన్స్)కు దెయ్యం సినిమాలు చూడాలంటే భయం. అతడికి నైక్టోఫోబియా అనే వ్యాధి ఉంటుంది. అతడికి ఏదైనా సడెన్ షాక్ తగిలితే పక్కనే ఉన్న మహిళల తొడపై కూర్చుంటాడు. అమ్మను ప్రతి పనికి తీసుకెళ్లలేక ఓ వాచ్‌మెన్‌ను కూడా అపాయింట్‌మెంట్ చేసుకుంటాడు. అతడు గ్రీన్ టీవీలో కెమెరా మెన్‌గా పనిచేస్తుంటాడు. టాప్ ప్లేస్‌లో ఉన్న చానల్ రెండో స్థానంలో పడిపోతుంది. తిరిగి ఈ చానల్‌ని ఎలాగైనా మొదటి స్థానానికి తీసుకురావాలని మీటింగ్ ఏర్పాటు చేస్తుంది ఆ ఛానల్ యజమాని సుహాసిని.
 
తనతోపాటు టీవీ ఛానెల్లో పనిచేసే నందిని (తాప్సీ)ని రాఘవ ప్రేమిస్తాడు. తాప్సీ ఓ ఫేక్ దెయ్యం స్టోరీతో టీవీ ఛానెల్ టీఆర్పీ రేటింగ్ పెంచేందుకు ఓ పాడుబడిన బంగ్లాకు వెళతారు. స్వతహాగా భయస్తుడైన రాఘవ ప్రోగ్రామ్‌ను షూటి చేస్తుంటాడు. షూటింగ్ జరుగుతున్న సమయంలో నందినికి అనుకోకుండా ఓ తాళి దొరుకుతుంది. అప్పుడు అక్కడున్న ఐదు దెయ్యాలు తాప్సీ, లారెన్స్‌ను ఆవహిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మిగిలిన కథ.
 
నటీనటుల ప్రతిభ:  
లారెన్స్ మరోసారి తన నటనతో మెప్పించాడు. బామ్మ, హిజ్రా, గుండు క్యారెక్టర్లలో లారెన్స్ చూపించిన ప్రతిభ భేష్. హిజ్రా, బామ్మ క్యారెక్టర్స్‌లో అలా ఒదిగిపోయాడు. దెయ్యాలు అంటే భయపడే సన్నివేశాల్లో లారెన్స్ బాగా నవ్వించాడు. సినిమాకి లారెన్స్ నటనతో హైలైట్‌గా నిలిచాయి. ఇక తాప్సీ ఇలాంటి పాత్రల్లో నటించడం మొదటిసారి అయినా కూడా మెప్పించింది. ముఖ్యంగా గంగ అనే దెయ్యం ఆవహించినప్పుడు ఆమె నటనను ప్రశంసించాల్సిందే. అసలు గంగగా, ఫిజికల్లీ ఛాలెంజెడ్ పాత్రలో నిత్యామీనన్ నటన సినిమాకే హైలైట్. కోవై సరళ, శ్రీమాన్ పరిధి మేరకు నటించారు.
 
ప్లస్ పాయింట్స్:  
లారెన్స్ , నిత్యామీనన్ నటన ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , సినిమాటోగ్రఫీ
 
మైనస్ పాయింట్స్ :
కథ ఊహాజనితమైన కథనం సెకండ్ హాఫ్ లో సినిమా వేగం అమాంతం పడిపోవడం నాసిరకమైన గ్రాఫిక్స్ ఎడిటింగ్ వీక్ ఫ్లాష్ బ్యాక్
 
చిత్ర విశ్లేషణ :  
ముని , కాంచన , సినిమాల తర్వాత రాబోతున్న సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. సినిమా ప్రారంభంలో సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. చివరకు విడుదల సమయంలో కూడా ఆర్ధిక ఇబ్బందుల వలన తెలుగులో విడుదల వాయిదా పడింది. తమిళంలో ఇప్పటికే విడుదల అయ్యి ఘన విజయం సాధించింది.