శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By dv
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (14:34 IST)

తండ్రి నిజాయితీకి తగిన కొడుకు కథే 'హైపర్‌'.. రొటీన్ కథే...

కథానాయకుడు రామ్‌ 'కందిరీగ'తో సక్సెస్‌ సాధించాడు. ఆ తర్వాత సరైన హిట్‌లేకుండా.. చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్‌ శ్రీనివాస్‌తో 'కందిరీగ-2 చేయాలని ప్లాన్‌ చేశాడు. ఎందుకనో

నటీనటులు: 
రామ్‌, రాశి ఖన్నా, సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు
 
సాంకేతిక సిబ్బంది:
సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.
 
కథానాయకుడు రామ్‌ 'కందిరీగ'తో సక్సెస్‌ సాధించాడు. ఆ తర్వాత సరైన హిట్‌లేకుండా.. చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్‌ శ్రీనివాస్‌తో 'కందిరీగ-2 చేయాలని ప్లాన్‌ చేశాడు. ఎందుకనో రామ్‌ చేయలేదు. దాన్ని 'రభస' పేరుతో ఎన్‌టిఆర్‌ చేసేశాడు. అది డిజాస్టర్‌. దర్శకుడికి సినిమాలు గ్యాప్‌ వచ్చింది. రామ్‌కూ.. నేను శైలజతో ఆమధ్య ఒక్క హిట్‌ వచ్చింది. దాంతో. మరలా సంతోష్‌ శ్రీనివాస్‌తో కలిసి చేసిన చిత్రమే 'హైపర్‌'. ఇందులో సామాజిక సందేశం ఉందని చెబుతున్న దర్శకుడు, హీరో, నిర్మాతలు... అదేమిటో చూద్దాం.
 
కథ:
సూర్య (రామ్‌) పుట్టగానే పి. నారాయణమూర్తి (సత్యరాజ్‌) తండ్రంటే ప్రేమ చూపిస్తాడు. అది పెరిగేకొద్దీ పిచ్చిగా మారుతుంది. నారాయణమూర్తి ఏది కావాలనుకుంటే అది కొడుకుగా సూర్య చేసేస్తాడు. గుడిలో కలిసిన సంప్రదాయమైన భానుమతి (రాశీఖన్నా)ను చూసి ఇంటికోడలైతే బాగుంటుందనుకుంటాడు. అంతే.. సూర్య అదేపనిలో వున్నాడు. ఆమెను ఎదురుగా చూడలేదు. కానీ వెనుకగా చూశాడు. దాంతో వెనుక భాగం తన కళ్ళ ఏ అమ్మాయి మ్యాచ్‌ అవుతుందో ఆ అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. ఇదిలావుండగా, నారాయణమూర్తి ప్రభుత్వోద్యోగి. నిక్కచ్చి మనిషి. కళంకం అంటకుండా రిటైర్‌ అవ్వాలనుకుంటాడు. ఇంకా 15 రోజుల్లో రిటైర్‌ అవుతాడనగా... హోంమంత్రి రావురమేష్‌.. ఓ బహుళ అంతస్తు కట్టేందుకు పర్మిషన్‌కోసం సంతకం అడుగుతాడు. అది చట్టవిరుద్ధమనీ... నిబంధనల ప్రకారం కడితే ఇస్తానని చెబుతాడు. దాంతో ఇగో దెబ్బతిని.. ఎలాగైనా సంతకం పెట్టించాలని నారాయణమూర్తి కుటుంబాన్ని ఇబ్బందిపాలు చేస్తాడు. విషయం తెలిసిన సూర్య.. ఏదైతే తన తండ్రితో సవాల్‌ చేశాడో.. అదే రోజు... మంత్రిగా రాజీనామా చేయించేలా సూర్య శపథం చేస్తాడు. అది ఎలా సాధించాడు? తన నాన్నను ఎలా కాపాడాడు? అన్నది మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌
సూర్య పాత్రలో పేరుకు తగినట్లుగా.. చాలా స్పీడ్‌గా.. టైటిల్‌కు తగినట్లుగానే చాలా హైపర్‌ యాక్టివ్‌గా రామ్‌ చేశాడు. పిల్లకొంచెం కూత ఘనంగా తన స్పీడ్‌ ఏక్టింగ్‌, యాక్షన్‌, డాన్స్‌ యూత్‌ను అలరించేట్లుగా ఉంది. తండ్రి అడుగుజాడల్లో నటించే అమాయకపు భానుమతిగా రాశీఖన్నా అలరిస్తుంది. మధ్యతరగతి నిజాయితీగల ప్రభుత్వోద్యోగిగా సత్యరాజ్‌ ఇమిడిపోయాడు. హోంమంత్రిగా రావురమేష్‌ బాగా చేశాడు. రౌడీగా మురళీశర్మ, అధిష్టానం వ్యక్తిగా జె.పి, సి.ఎం.గా కె. విశ్వనాథ్‌ నటించారు. మిగిలినవారు కథాపరంగా వచ్చేవారే.
 
టెక్నికల్‌గా...
సమీర్‌రెడ్డి ఫొటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రతి సన్నివేశం కనులవిందుగా వుంటుంది. ముఖ్యంగా పాటల్లో విదేశాల్లోని అందాలు చూడముచ్చగటా వున్నాయి. సంగీతపరంగా జిబ్రాన్‌ ఫర్వాలేదనిపిస్తాడు. సాహిత్యపరంగా.. పెద్దగా గుర్తుపెట్టుకొనేలా ఏమీ వుండవు. సోసోగా వుంది. సంభాషణలపరంగా అబ్బూరి రవి మరోసారి తన డైలాగ్‌లతో అలరించాడు. సమాజంలో సిన్సియర్‌గా ఉండే ప్రభుత్వాధికారితో మంత్రి చేసే సంభాషణల్లో ఆయన పదును కన్పిస్తుంది. ఇలా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఎడిటింగ్‌ గౌతంరాజు.. మొదటిభాగం బాగుంది. సెకండాఫ్‌లో చాలాసేపు సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కథ, కథనాన్ని నడిపే సంతోష్‌ శ్రీనివాస్‌ చక్కటి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు.
 
విశ్లేషణ:
అల్లరిచిల్లరిగా తిరిగే కుర్రాడు.. నిజాయితీ అయిన తండ్రిని పదిమంది ముందు తలెత్తుకొనేలా చేయడమే చిత్ర కాన్సెప్ట్‌. కథాపరంగా ఇది రామ్‌కు భారీది. చూడ్డానికి పిల్లాడిలా అనిపించే తను.. పెద్ద పెద్ద రౌడీలను, హోంమంత్రిని ఎదిరించే విధానం సూటుకాకపోయినా.. మరో హీరో అయితే సినిమా కథ ఇంకోలా ఉండేది. శంకర్‌ తరహాలో దర్శకుడు తీసుకున్న పాయింట్‌ కూడా అదే. సమాజం, అవినీతి, మంత్రులు, ఉద్యోగస్తులు.. అందరూ అవినీతి పరులైతే.. అందులో కొందరు నిజాయితీపరులైతే.. చివరికి గెలిచేది అవినీతే.. అందుకే నిజాయితీని కాపాడాలంటే.. హీరో ఏదో ఒకటి చేయాలి. తన తెలివితో.. మీడియా సహకారంతో గట్టెక్కడమే పరిష్కారం. ఈమధ్య మీడియాలతో సందేశాలు, ప్రజలకు దగ్గరయ్యే కథలు వచ్చాయి. అందులో ఇది  ఒకటి.
 
మనముందు ఎన్నో అక్రమాలు జరుగుతాయి. కానీ ఎదిరించాలంటే.. అది మన వరకు రావాలి. అలా హీరోకు రాబట్టే కథంతా హీరోపై నడుస్తుంది. డబ్బు, అధికారం, అహం ఉన్న వ్యక్తిని ఢీ కొట్టాలంటే.. మూడు గంటల సినిమాలో చకచకా చూపించేస్తాడు. చివరికు లాజిక్కుగా అవినీతి పరుడ్ని పట్టుకోవాలంటే.. మీడియా సహకారం కావాల్సిందే. దాంతో.. సెకండాఫ్‌ అంతా మీడియాదే హైలైట్‌. హీరో ఎన్ని పోరాటాలు, ఎన్ని డైలాగ్‌లు చెప్పినా.. ప్రజల్లో అవినీతిపరులు ఎవరు? నిజాయితీపరులు ఎవరు? అని తేలిసిది మీడియా ద్వారానే. దాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. ఈ చిత్ర కథలో చాలా సన్నివేశాలు... అంటే.. భానుమతి పాత్ర.. రేసుగుర్రంలో ఇలియానాను గుర్తు చేస్తుంది. మీడియాను ఉపయోగించుకుని.. ఎలా బయటపడాలో.. ఆ చిత్రంలోని ముగింపు కన్పిస్తుంది. ఏది ఏమైనా.. సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం దర్శకుడు చేశాడు. ఇలాంటి కాన్సెప్ట్‌కు దర్శకుడు సరిపోలేదు. ఇంకాస్త బలమైన దర్శకుడు వుంటే సినిమా బ్రహ్మాండంగా వుండేది. కమర్షియల్‌పరంగా మొదటిభాగం సరదాగా సాగుతుంది. ద్వితీయభాగంలో సందేశంతోకూడిన సినిమా కాబట్టి.. కాస్త ఎక్కువసేపు చూపించినట్లుగా వుంది. మొత్తానికి ఈ చిత్రాన్ని కుటుంబంతో చూడొచ్చు. రామ్‌ కెరీర్‌కు మంచి సినిమానే. కానీ.. ఎంతరేంజ్‌లో వుంటుందనేది ప్రేక్షకులే చెప్పాలి.
 
రేటింగ్‌.. 3/5