శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (20:16 IST)

కృష్ణగాడి వీర ప్రేమ గాథ రివ్యూ రిపోర్ట్: కన్‌ఫ్యూజ్‌ కథే.. కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అదిరింది..!

సినిమా : కృష్ణగాడి వీర ప్రేమ గాథ  
నటీనటులు : నాని, మెహ్రీన్‌, సత్యంరాజేష్‌, మురళీశర్మ, పృథ్వీ, బ్రహ్మాజీ, సంపత్‌రాజ్‌, శత్రువ, బేబి మోక్ష, మాస్టర్‌ ప్రీతమ్‌, బేబీ నయన తదితరులు.
కెమెరా: కె. యువరాజ్‌, యాక్షన్‌: విజయ్‌, 
పాటలు: కృష్ణకాంత్‌, 
ఎడిటర్‌: వర్మ, 
సంగీతం : విశాల్‌ చంద్రశేఖర్‌, 
నిర్మాత : రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకర, 
దర్శకత్వం : హను రాఘవపూడి.
విడుదల తేదీ : 12 ఫిబ్రవరి 2016
 
నాని, 'అందాల రాక్షసి' సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు హను రాఘవపూడిల కాంబినేషన్‌లో 14 రీల్స్‌ సంస్థ చేపట్టిన ప్రమోషన్స్‌, ట్రైలర్‌, ఆడియోతో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉందా? చూద్దాం.
 
కథ :
కృష్ణ (నాని) పిరికివాడు. ఊరిలో బోర్‌ బావలు తవ్వించే పని చేస్తాడు. బాలకృష్ణ ఫ్యాన్‌ కూడా. ఆయన స్నేహితుడు సత్యం రాజేష్‌.. టూరింగ్‌ టాకీస్‌ ఆపరేటర్‌. కృష్ణ... చిన్నప్పట్నుంచే మహాలక్ష్మి (మెహ్రీన్‌)ని ప్రేమిస్తాడు. ఆమె ఆ ఊరిలో ఫ్యాక్షన్‌ కుటుంబానికి చెందిన అమ్మాయి. భయస్తుడు గనుకనే ఆమె కుటుంబానికి తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు కృష్ణ.

పగ ప్రతీకారాలతో రగిలిపోయే ఆ కుటుంబాన్ని అంతం చేయాలనే మరో వర్గం ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే టైమ్‌లో స్విట్లర్లాండ్‌ నుంచి మాఫియా డాన్‌ డేవిడ్‌ భాయ్‌ (మురళీ శర్మ) భారత్ వస్తాడు. అతనెలా ఉంటాడో ఎవ్వరికీ తెలీదు. మహాలక్ష్మి తన స్నేహితురాలి పెండ్లి కోసం ఊరు వెళుతుంది. ఆ సమయంలో కృష్ణ తన ప్రేమను వారి అన్నయ్యకు చెప్పాలని వచ్చి ఇంట్లో ఇరుక్కుపోతాడు. అప్పుడే.. ఓ ముఠా వచ్చి.. మహాలక్ష్మి కుటుంబాన్ని తుపాకితో పేల్చి పారిపోతుంది. 
 
హైదరాబాద్‌లో ఎసీపీ శ్రీకాంత్‌ (సంపత్‌ రాజ్‌) పిల్లలు కూడా ఆ ఇంటిలోనే ఉంటారు. ఆ పిల్లిల్ని కాపాడాలనీ, హైదరాబాద్‌లో వారి నాన్నదగ్గరకు తీసుకెళ్ళాలని.. మహాలక్ష్మి అన్న కృష్ణకు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వారిని కారులో తీసుకుని హైదరాబాద్‌ బయలుదేరతాడు. ఆ జర్నీలో ఎన్ని ట్విస్ట్‌లు ఉంన్నాయనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 
పెర్‌ఫార్మెన్స్ ‌: 
నాని.. పేరు టైటిల్‌లో వేసినప్పుడే సహజ నటుడుగా వేస్తారు. అదేవిధంగా తన నటనను కనబర్చాడు. ఎలాంటి డైలాగునైనా తన తరహాలో చెప్పడంలో  గట్టెంక్కించాడు. వేరే కమెడియన్స్‌ లేకుండా తనే కామెడీ కూడా చేసేశాడు. నానికి.. రాజేష్‌ తోడుకావడంతో లవ్‌ట్రాక్‌ ఎంటర్‌టైన్‌గా మారింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మెహ్రీన్‌.. అందంపరంగా, అభినయంపరంగా బాగా నటించింది.

ముఖ్యంగా కొన్ని చోట్ల ఆమె కాజల్‌లా అనిపిస్తుంది. వీరితోపాటు ముగ్గురు చిన్నారులు బేబి నయన, మాస్టర్‌ ప్రదమ్‌, బేబి మోక్షలు సినిమా అంతా నడిపిస్తారు. వారి నటన కూడా సహజంగానే వుంది. సంపత్‌ రాజ్‌, బ్రహ్మాజీ, పృథ్వీ రాజ్‌, మురళీ శర్మ.. ఇలా ప్రధాన పాత్రలంతా సినిమాకు మరింత బలాన్ని తెచ్చారు.  
 
సాంకేతిక విభాగం :
విశాల్‌ చంద్రశేఖర్‌ అందించిన మ్యూజిక్‌ కేవలం ఆడియోగా వింటే, ఫర్వాలేదనిపిస్తే, సినిమాతో కలిపి చూసినప్పుడు ఫస్టాఫ్‌లోని పాటలన్నీ బాగున్నట్టు అనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పరంగా చేసిన ప్రయోగం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీకి బాగుంది. సెకండాఫ్‌లో అటవిలో ఆయన పనితనం కన్పించింది. ఆర్ట్‌ డైరెక్షన్‌, పాటల్లో సాహిత్యం.. ఇలా టెక్నికల్‌గా అందరూ తమ వంతు న్యాయం చేశారు. ఎడిటింగ్‌ పరంగా మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. 14 రీల్స్‌ నిర్మాణ విలువలను అభినందించకుండా ఉండలేం.
 
విశ్లేషణ :
ప్రతి సినిమాకు మొదటిభాగం సరదాగా.. సెకండాఫ్‌ను సీరియస్‌గా తీసినట్లే ఈ సినిమాను దర్శకుడు తీశాడు. ప్రేమకథను వీలైనంత కొత్తగా, కమర్షియల్‌ టచ్‌ ఇస్తూ చెప్పిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌లో కృష్ణ, మహాలక్ష్మిల మధ్యన వచ్చే లవ్‌ ట్రాక్‌ చాలా కొత్తగా ఉంది. ప్రేమకథలో ఇలాంటి ఒక కొత్త యాంగిల్‌ను పరిచయం చేయడంతో పాటు, అందులో ఉన్న ఫన్‌ను సరిగ్గా పండించారు.

ఇక ఒక ఊర్లో రెండు కుటుంబాల మధ్యన జరిగే ఫ్యాక్షన్‌ గొడవలు, ఈ గొడవకు పిల్లల కిడ్నాప్‌, మాఫియా కనెక్షన్‌, దానిచుట్టూ తిరిగే ఓ ప్రేమకథ.. ఇలా ఇన్ని అంశాలను మేళవిస్తూ ఒక కథ చెప్పిన విధానంలో పుట్టుకొచ్చే సహజత్వంగా సాగిపోయే ఫన్‌, సెకండాఫ్‌లో ముగ్గురు పిల్లలతో కలిసి హీరో పాత్ర చేసే ఓ ఎమోషనల్‌ జర్నీ బాగుంది. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' అన్న టైటిల్‌ సినిమాకు మంచి అర్థాన్నిచ్చింది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ పార్ట్‌లో కమర్షియల్‌ అంశాలతో కథను నడిపిస్తూనే, చెప్పాలనుకున్న సెన్సిబుల్‌ పాయింట్‌ను దర్శకుడు సరిగ్గా చెప్పగలిగాడు.
 
సినిమా అసలు కథనంతా ఫ్యాక్షన్‌ గొడవలతో తీస్తున్నాడనగా.. ఒక్కసారిగా మాఫియాడాన్‌ ఎంటర్‌ కావడంతో కథ మారిపోతుంది. దేశాల్ని శాసించే డాన్‌.. సిల్లీగా.. జైలో.. మూడురోజులపాటు ఉండటం.. తను డాన్నా.. పృథ్వీలాంటి ఆఫీసర్‌ నమ్మక.. ఎగసెక్కాలు ఆడడం... ఇదంతా.. కేవలం.. పృథ్వీ అనే ఆర్టిస్టు కోసమే సీన్లు రాసుకున్నట్లుంది. ఫ్యాక్షన్‌ కొడవకాస్త.. డాన్‌ గొడవగా మారడం ఒక రకమైతే... సంపత్‌రాజ్‌ పిల్లల్ని కాపాడడానికి వచ్చిన పోలీసు బ్యాచ్‌.. మాఫియా బ్యాచ్‌లు కలిసి.. ఎవరు ఎవరికోసం పనిచేస్తున్నారో అర్థంకాక గందరగోళంగా సెకండాఫ్‌ వుంటుంది. 
 
కాకపోతే.. అందులో ఓ ఇద్దరిచేత.. కామెడీ చేయించి సాగదీశాడు. ఇక్కడ ట్విస్ట్‌ ఏమంటే.. హీరో గోల్‌.. మహాలక్ష్మిని పెండ్లి చేసుకోవడం.. దానికోసం పిల్లల్ని కాపాడడం.. ఇదే తనకు తెలిసింది. ఈమధ్యలో తనకు తెలీకుండా చాలా జరుగుతుంటాయి. అదే ఈ సినిమాకు ప్రధాన పాయింట్‌. దర్శకుడు ఇలాంటి పాయింట్‌ తీసుకున్నాడు కానీ... దీన్ని ఎఫెక్ట్‌వ్‌గా తీసుకురావడంలో ఫెయిల్‌ అయ్యాడు. అసలు ఫ్యాక్షన్‌ గొడవల్లో.. మాఫియాడాన్‌ రావడంలోనే పెద్ద కథతో ఉందనుకున్న తర్వాత దాన్ని సిల్లీగా మార్చేశాడు దర్శకుడు.
 
ఇదికాకుండా.. ఫస్టాఫ్‌లో లెంగ్త్‌ చాలా ఎక్కువైపోయింది. నిజానికి ప్రీ ఇంటర్వెల్‌కి ముందున్న ట్విస్ట్‌నే ఇంటర్వెల్‌గా మార్చేస్తే సినిమా ఎక్కడో ఉండేదనడంలో ఆశ్చర్యం లేదు. ఈ చిన్న విషయంలో శ్రద్ధ పెడితే బాగుండేది. సెకండాఫ్‌లో వచ్చే రెండు పాటలూ అసందర్భంగా ఉండడమే కాక, సినిమా ఎమోషన్‌ను కూడా పక్కదారి పట్టించాయి. కొన్నిచోట్ల లాజిక్‌లకు అందకుండా కథ నడుస్తూ ఉండడాన్ని మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఒక సెన్సిబుల్‌ పాయింట్‌కు కమర్షియల్‌ టచ్‌ ఇచ్చే క్రమంలో కొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాలు ఎక్కువయ్యాయి. పిరికివాడైన కృష్ణగాడి ప్రేమకథలో.. వీరగాథ అనేది టైటిల్‌కు కరెక్ట్‌గా సరిపోయింది. లాజిక్కులేని ఈ  కథ ఎంటర్‌టైన్‌కోసం చూడొచ్చు.
 
రేటింగ్‌: 3.5