మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (19:32 IST)

బకరా ఎంటర్‌టైన్‌మెంట్‌తో రన్‌ రాజా రన్‌... అలా లాగేశారు...

రన్ రాజా రన్ నటీనటులు: శర్వానంద్‌, సీరత్ కపూర్‌, కోటశ్రీనివాసరావు, వెన్నెల కిశోర్‌, సంపత్‌ తదితరులు; సంగీతం: జిబ్రాస్‌, నిర్మాతలు: వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, దర్శకత్వం: సుజీత్‌.
 
సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌. అందుకే చాలా చిత్రాలు వాటిని టార్గెట్‌ చేస్తూ తీస్తుంటారు. శర్వానంద్‌ అనగానే సీరియస్‌ చిత్రాలు చేస్తాడు అనే బ్రాండ్‌ వుండేది. వెన్నెల, ప్రస్థానం, గమ్యం, సత్య-2 వంటి చిత్రాలు చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్రలు చేయలేని కామెంట్‌ వస్తుండేవి. త్వరలో ఆ లోటు తీరుస్తానని.. తమిళం, తెలుగు భాషల్లో నటించాడు. అదే రన్‌ రాజా రన్‌. సుజీత్‌ దర్శకుడు. మిర్చి నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఆ నిర్ణయం ఎలా వుందో చూద్దాం.
 
కథలోకి వెళితే...
రాజా (శర్వానంద్‌) టెన్త్‌ చదివి బేవార్స్‌గా తిరుగుతుంటాడు. కనబడిన అమ్మాయిని ప్రపోజ్‌ చేస్తుంటాడు. అవి బెడిసికొడుతుంటాయి. సేమ్‌ టు సేమ్‌ అదే తరహా అమ్మాయి ప్రియ (సీరత్ కపూర్‌). బలవంతపు పెండ్లి నుంచి తప్పించుకోబోయి రాజాను కలుస్తుంది. అతని నాన్న దిలీప్‌ కుమార్‌ (సంపత్‌) పోలీసు కమీషనర్‌. మరోపక్క సిటీలో కిడ్నాపులు జరుగుతుంటాయి. వాటిని కనిపెట్టడానికి దిలీప్‌ సిటీకి వస్తాడు. కానీ ఎవరైందీ అంతుపట్టదు. చివరికి రాజానే కిడ్నాపర్‌ అని తెలుస్తుంది. అప్పుడు ఏమి చేశాడు? అనేది కథ.
 
నటీనటులు: 
శర్వానంద్‌ తొలిసారిగా సింగిల్‌ హ్యాండ్‌తో మొదటి భాగాన్ని డీల్‌ చేశాడు. చలాకీగా ఆయన పాత్ర వుంటుంది. కథ ప్రకారం సరిపోయాడు. కొత్త గెటప్స్‌ బాగున్నాయి. కొత్త అమ్మాయి అయినా సీరత్ కపూర్‌ పర్వాలేదనిపించింది. శర్వానంద్‌తో పాటు యాక్టివ్‌గా చేసేసింది. గ్లామరస్‌గా కూడా కనిపిస్తుంది. కోట శ్రీనివాసరావు మేకవన్నె పులిగా నటించాడు. అజయ్‌ ఘోష్‌ మరో పాత్రలో కన్పిస్తాడు. పోలీస్‌ అధికారికి సలహాలు ఇచ్చే పోలీసుగా అడవి శేషు కన్పిస్తాడు.
 
సాంకేతికంగా.... 
ఈ చిత్రంలో సినిమాటోగ్రాఫర్‌ మది మరిపిస్తాడు. దర్శకుడుగా సుజిత్‌ కొత్తవాడయినా... తమిళ ఛాయలు ఎక్కువగా కన్పిస్తాయి. జిబ్రాస్‌ పాటలు బోర్‌ అనిపించవు. ఎడిటింగ్‌ సెకండాఫ్‌లో ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తుంది. కుదిప్తే బాగుంటుంది. ముగింపు కూడా షడెన్‌గా చేసినట్లుంటుంది. నిర్మాణపు విలువలు ఫర్వాలేదు.
 
విశ్లేషణ 
తొలిసారిగా శర్వానంద్‌ చిత్రాన్ని భుజాలపై మోశాడు. పక్కన సపోర్ట్‌ ఆర్టిస్టులు నిలబెట్టారు. కథపరంగా పాత కథే. దాన్ని అటుఇటూ తిప్పి.. మొత్తాన్ని ప్రేక్షకుల్ని నవ్వించే పనిపెట్టాడు. కామన్‌‌మేన్‌కు కావాల్సింది అదే. అలా అని లాజిక్కు లేని పాయింట్లు లేకపోలేదు. మొదటి భాగమంతా.. ఏదో సాగిపోతూ కథలోకి ఇంకా ప్రవేశించలేదనిపిస్తుంది. ఎక్కువగా హీరోపై ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌ చేశాడు. సెకండాప్‌ పూర్తిగా కథను చెప్పే క్రమంలో ఇచ్చే ట్విస్ట్‌లు.. బకరాగా హీరోను హీరోయిన్‌, వాళ్ళ నాన్న ఆడుకునే విధానం కొత్తగా అనిపిస్తుంది. 

ఇలాంటి షేడ్స్‌... చిరంజీవి చిత్రాల నుంచి వస్తున్నవే. అమాయకుడిలా అనిపించే హీరో ఒక్కసారిగా తెలివితేటలు గల వాడిగా చూపించేస్తాడు. అందులో లాజిక్కు వుండదు. సిటీలో కిడ్నాప్‌లు తనే చేయించానని కమీషనర్‌ రహస్యంగా చెప్పేది హీరో ఎలా తన సెల్‌ఫోన్‌లో తీశాడో చూపించడు. కథలో హీరోది పైచేయి కావాలి. మాస్‌కు అదే చాలు. ముందు వెనుక ఏం జరిగిందో అనవసరం. ఇలాంటివి అక్కడడక్కడా కన్పిస్తాయి. 
 
చివల్లో చిక్కుముడి విప్పేయడం అనేది పెద్ద ట్విస్ట్‌ కాకపోయినా.. సినిమాకు అంతకంటే మార్గంలేదు. మొత్తంగా ఈ సినిమా కేవలం ఎంటర్‌టైన్‌ చేయడమే కాన్సెప్ట్‌తో తీసింది. మాస్‌ ప్రేక్షకుల్ని ఎంజాయ్‌ చేయడానికి పనికివస్తుంది. తమిళంలో కూడా శర్వానంద్‌ చిత్రాలు ఆడతాయి కాబట్టి.. ఒకే పెట్టుబడి రెండు భాషల సినిమాలు తీసిన నిర్మాతలు సేఫ్‌ జోన్‌లోకి వెళతారనే చెప్పవచ్చు.