గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 13 మార్చి 2015 (19:36 IST)

మరో ధోని లాంటి 'సచిన్ టెండూల్కర్ కాదు' సినిమా... రివ్యూ రిపోర్ట్

సచిన్ టెండూల్కర్ కాదు చిత్రం నటీనటులు: సుహాసిని, మాస్టర్‌ స్నేహిత్‌, క్రికెటర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌. సంగీతం: రాజేష్‌ రామనాథ్‌, నిర్మాత: తాడికొండ వెంకటేశ్వర్లు, దర్శకత్వం: ఎస్‌. మోహన్‌.
 
గత ఏడాది కన్నడలో విడుదలైన సినిమా 'సచిన్‌'. దాన్ని ఏడాది తర్వాత తెలుగులో డబ్‌ చేశారు. ఒక మానసిక వికలాంగుడు తన కోరికను ఎలా నెరవేర్చుకున్నాడనేది ప్రధాన పాయింట్‌. దీనికి రకరకాల సన్నివేశాలతో ఆసక్తిగా మలిచేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం.. అక్కడ వర్కవుట్‌ అయింది. రాష్ట్రస్థాయిలోనూ అవార్డులు కూడా పొందింది. అదేరీతిలో తెలుగులో రావాలనుకోవాలనుకుని చేసిన ప్రయత్నమిది. మరి అది నెరవేరుతుందా? లేదా? చూద్దాం.

 
కథ: 
స్వాతి(సుహాసిని) పారిశ్రామికవేత్త. తమ్ముడు సచిన్‌ మానసిక వికలాంగుడు. జీవితంలో ఎలా బతకాలో తెలీదు. అతని ఆనందం కోసం పెండ్లినే త్యాగం చేస్తుంది. క్రికెట్‌ కోచ్‌ వెంకటేష్‌ ప్రసాద్‌ను ప్రేమిస్తుంది. తనూ ఆమె భావాలకు దగ్గరగా వుంటాడు. తమ్ముడి కోసం స్వాతి చేసే ప్రయత్నాల్లో తానూ ఓ భాగమవుతాడు. స్కూల్‌ టోర్నమెంట్‌లో ఒక్కసారైనా క్రికెట్‌లో ఆడాలన్నది అతని ఎయిమ్‌. దానికోసం కోచ్‌ పదవిని కూడా వదులుకుని మరోచోట వెంకటేష్ ప్రసాద్‌, సచిన్‌ కోసం ఏ చేశాడన్నది మిగిలిన కథ.
 
విశ్లేషణ 
మానసిక వికలాంగులు దేశంలో చాలామంది వున్నారు. వారిని సమాజం చాలా చులకనగా చూస్తుంది. అటువంటి వారికి కనువిప్పు కలిగేలా వుండాలనేది సినిమాలోని ప్రధాన పాయింట్‌. దానికోసం కొన్ని సన్నివేశాలు బాగా చూపించాడు. కన్నతల్లే కొడుకును పట్టించుకోకపోవడం వంటివి మొదట్లో ఆశ్చర్యం కల్గిస్తాయి. కానీ కూతురు భవిష్యత్‌ కోసం ఆమె పడే ఆరాటం కన్పిస్తుంది. ఇందులో నటించినవారంతా బాగానే చేశారు. 
 
కానీ, ఇటువంటి పాత్ర చాలాసేపు ప్రేక్షకుడికి కనెక్ట్‌ కావడం చాలా కష్టం. తను బయట ప్రపంచలో పడే అవమానాలతో కాస్త కథ గాడినపడుతున్నట్లు అనిపిస్తుంది. ఇటువంటి పాత్రను మరింత జాగ్రత్తగా చూపిస్తేనే ప్రేక్షకుడు కనెక్ట్‌ అవుతాడు. ఒకవేళ అవకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. 
 
గతంలో ప్రకాష్‌రాజ్‌ ఇంచుమించు ఇటువంటి కథతో 'ధోనీ' చిత్రాన్ని రూపొందించాడు. మంచి ప్రయత్నమే అని పేరు తెచ్చుకుంది కానీ ఆదరణ పొందలేకపోయింది. ఇంకోవైపు గోల్కొండ హైస్కూల్‌ అనే చిత్రం కూడా వచ్చింది. అందులో మెంటల్లీ డిజార్డర్‌ పాత్ర లేకపోయినా.. దాదాపు పోటీ క్రికెట్‌ అనేది కామన్‌ పాయింట్‌.
 
సంగీతపరంగా పెద్దగా లేకపోయినా ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తుంది. ఏదో సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని చేసిన ప్రయత్నమిది. ఇటువంటి కథలు కేవలం బాలలను ఆకట్టుకోవడం కోసం తీసినవే. పిల్లలు పెద్దలు ఎలా పెంచితే అలా పెరుగుతారు. మానసిక వికలాంగుడు క్రికెట్‌ ఎలా ఆడతాడని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నించడం.. ఆడి విజయం వైపు తీసుకెళ్ళడమనేది చాలా క్రిటికల్‌. దానికి సెంటిమెంట్‌ కావాల్సినంత చూపించేసి.. సచిన్‌ ఓడిపోతున్నా.. ఓడిపోకుండా... తోటి ప్లేయర్లు.. పరిపక్వత చెంది గెలిపించడం .. ప్రతివారిని కట్టిపడేస్తుంది. ఇది కూడా బలవంతంగా ప్రేక్షకుడిని కూర్చోపెట్టేలా చేయడం దర్శకుడి నైపుణ్యానికి నిదర్శనం. స్క్రీన్‌ప్లేలో మరింత మెరుగులు దిద్దితే బాగుండేది. అయితే.. ఎన్ని వున్నా.. ఇటువంటి కథలు అందరినీ ఆకట్టుకోవడం అనేది కష్టమే.