గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (11:48 IST)

సరదాగా సాగిపోయే.. సాహసం శ్వాసగా సాగిపో: రివ్యూ రిపోర్ట్.. చైతూకు మంచి మార్కులే

నాగచైతన్య నటించిన ఏ మాయ చేశావే తర్వాత.. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రం రోడ్‌ జర్నీ నేపథ్యంలో సాగుతుంది. అందుకే టైటిల్‌ సాహసంగా సాగిపో అని పెట్టారు. ఆ జర్నీలో మం

నటీనటులు: నాగ చైతన్య, మంజుమ మోహన్‌, రానా, సతీష్‌, బాబా సెహగల్‌ తదితరులు.
టెక్నీషియన్లు: 
సంగీతం: ఎ,ఆర్‌. రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, కెమెరా: డాన్‌ మాథ్యూస్‌, నిర్మాత: మిరియాల రవీంద్రరెడ్డి, దర్శకత్వం: గౌతమ్‌ వాసు దేవ మీనన్‌.
 
నాగచైతన్య నటించిన ఏ మాయ చేశావే తర్వాత.. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా సాహసం శ్వాసగా సాగిపో. ఈ చిత్రం రోడ్‌ జర్నీ నేపథ్యంలో సాగుతుంది. అందుకే టైటిల్‌ సాహసంగా సాగిపో అని పెట్టారు. ఆ జర్నీలో మంజుమ పరిచయం కావడం.. ఆమె సమస్యల్లో ఇరుక్కోవడం వంటివి చైతన్యకు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ సమస్యను తన సమస్యగా భావించి.. ఆమెను ఎలా కాపాడాడు. 
 
తన ప్రేమను ఎలా పొందాడు అన్నదే సినిమా. సెకండ్‌పార్ట్‌ అంతా యాక్షన్‌లో సాగుతుంది. చైతన్య యాక్షన్‌ పార్ట్‌ గతంలో చేసినా.. ఇది కనెక్ట్‌ అయ్యేలా.. దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు.. ఎంటర్‌టైన్‌మెంట్‌గా దాన్ని మలచడంతో ఆకట్టుకునేలా వుంది.
 
కథ చాలా స్లోగా , బిట్ సాంగ్స్‌తో కదులుతుంది. అలాగే ఈ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ వెళ్లిపోమాకే కూడా వస్తుంది. ఈ పాట సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ ట్విస్ట్‌తో వస్తుంది. ఈ సాంగ్‌లో అద్బుతమైన లొకేషన్స్ చూపెట్టారు. అలాగే సినిమాటోగ్రఫి కూడా అదిరింది. సినిమాలో దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రతి క్యారెక్టర్‌ను చాలా బాగా డిజైన్ చేస్తారు. ఇందులో క్యారెక్టర్స్‌ను చూస్తున్నప్పుడు ఆడియెన్స్ క్యారెక్టర్‌తో పాటు ట్రావెల్ చేసేలా ఉంటుంది. 
 
ఫస్టాఫ్ లవ్ స్టోరీ, సెకండాఫ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది కాబట్టి యూత్‌కు ఈ సినిమా కనెక్టవుతుందని చెప్పవచ్చు. ఏమాయ చేసావె తర్వాత తప్పకుండా ఈ సినిమా కూడా యూత్‌ను ఆకట్టుకుంటుంది.
 
పెర్‌ఫార్మెన్స్: నాగ చైతన్య నటనతో మంచి మార్కులు వేసుకున్నాడు. గౌతమ్ వాసుదేవ మీనన్ చైతూ పాత్రకు సరిపోయేలా యంగ్ లవర్ బాయ్‌గా చూపించాడు. మంజిమమోహన్ కూడా అద్భుతంగా నటించింది. మిగిలిన నటులు కూడా పాత్ర పరిధి మేరకు నటనను పండించారు.
 
ప్లస్ పాయింట్స్ : అమేజింగ్ పాటలు, సినిమాటోగ్రఫీ, నాగచైతన్య నటన 
మైనస్ పాయింట్స్: కథ స్లోగా నడవడం..
రేటింగ్ : 4 పాయింట్లు