శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 8 ఏప్రియల్ 2016 (13:14 IST)

పవర్ స్టార్ 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' రివ్యూ రిపోర్ట్... రాజా సర్దార్ గబ్బర్ సింగ్ కూడా...

పవన్‌ కళ్యాణ్‌ సినిమా గబ్బర్‌సింగ్‌. తర్వాత అదే పేరుతో వచ్చిన 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమా ఫ్యాన్స్‌ కోసమే తీసినట్లు... ఫ్యాన్స్‌కు అంకితమని.. సినిమా ఆరంభంలో స్లైడ్‌ వేశాడు. ఆ తర్వాత 'షోలే' పోస్టర్లు... జో డర్‌గయా... అంటూ.. గబ్బర్‌సింగ్‌ పలికే డై

పవన్‌ కళ్యాణ్‌ సినిమా గబ్బర్‌సింగ్‌. తర్వాత అదే పేరుతో వచ్చిన 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమా ఫ్యాన్స్‌ కోసమే తీసినట్లు... ఫ్యాన్స్‌కు అంకితమని.. సినిమా ఆరంభంలో స్లైడ్‌ వేశాడు. ఆ తర్వాత 'షోలే' పోస్టర్లు... జో డర్‌గయా... అంటూ.. గబ్బర్‌సింగ్‌ పలికే డైలాగ్‌తో సినిమా ప్రారంభమవుతుంది. సో... మొత్తంగా షోలే ప్రేరణతో ఓ కథను అల్లుకుని తీశాడు. అదెలా వుందో చూద్దాం.
 
కథ: 
అనాథైన గబ్బర్‌సింగ్‌... పోలీసు ఆఫీసర్‌ తనికెళ్ల భరణి వెంటాడుతున్న దొంగల్ని పట్టిస్తాడు. దాంతో భరణి.. గబ్బర్‌సింగ్‌ను చదివించి పోలీసు ఆఫీసర్‌గా చేస్తాడు. తనతోపాటే వుండే మరో అనాథ అలీ కానిస్టేబుల్‌గా అతనివెంటే వుంటారు. ఇక.. రతన్‌పూర్‌ అనే ఊళ్ళో రాజవంశ పాలన వుంటుంది. ఆ వంశానికి చెందిన భైరవ్ సింగ్‌ ఊరి ప్రజలను భయపెట్టి బతికేస్తుంటాడు. పేదలకు తన తండ్రి ఇచ్చిన భూముల్ని లాక్కుని అక్కడ వుండే మైనింగ్‌తో వ్యాపారం చేస్తుంటాడు. ఎదురుతిరిగితే చంపేస్తుంటాడు. 
 
ఆ ఊరిలోని మరో రాజ వంశీయుల పెద్ద ముఖేష్‌ రుషి... పేదలకు సాయంచేసే తత్త్వం. కానీ భైరవ్ సింగ్‌ వల్ల చేయలేకపోతాడు. ఆ కుటుంబానికి వారసురాలు హష్మి(కాజల్‌)ని కాపాడి రాజవంశానికి చెందినవాడికిచ్చి పెండ్లి చేయాలనుకుంటాడు. కానీ భైవర్‌ వల్ల చేయలేకపోతాడు. ఇక ఊర్లో భైరవ్ సింగ్‌ అరాచకాలను అడ్డుకట్టవేయడానికి సరైన పోలీసు అధికారిని పంపమని ముఖేష్‌రుషి కోరడంతో.. అధికారులు.. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌(పవన్‌)ను పంపిస్తారు. ఇక తను అక్కడకు వచ్చాక... భైరవ్‌ సింగ్‌ అరాచకాలను, అతని ఇగోను ఎలా కంట్రోల్‌ చేసి.. కాజల్‌ను పెండ్లి చేసుకున్నాడనేది.. మిగిలిన సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
పవన్‌ కళ్యాణ్ సినిమా అంటేనే.. తనే సినిమా అంతా మోసేస్తాడు. ఇందులో తన మేనరిజం.. స్టైల్‌తో సినిమాను లాగించేశాడు. లుక్‌ కొత్తగా లేకపోయినా... మేనరిజంతో మెస్మరైజ్‌ చేశాడు. కాజల్‌ది రాజవంశానికి చెందిన రాణిగా నటించింది. మగధీర తరహాలో రాణిగా గుర్తుకు వస్తుంది. ముఖేష్‌రుషి.. ఆమెను కాపాడేవాడిగా నటించాడు. భైరవ్ సింగ్‌గా నూతన నటుడు నటించాడు. క్రూరత్వం, అహం వున్న వాడిగా సరిపోయాడు. ఇక మిగిలిన పాత్రలన్నీ వారి పాత్రల మేరకు చేసేశారు. అలీతో పాటు జబర్‌దస్త్‌ గ్యాంగ్‌, పవన్‌ కళ్యాణ్‌ స్నేహితుడు సాయి వంటివారు పోలీసులుగా నటించేశారు. ఐటంసాంగ్‌లో శ్రద్దాదాస్‌ మెరుస్తుంది.
 
సాంకేతికంగా...
162 నిముషాల నిడివిగల ఈ సినిమాను గౌతంరాజు ఎడిటింగ్‌ కీలకం. ఇంకా ఎక్కవగా వున్న దాన్ని ఎడిటింగ్‌ చేయడంలో బాగానే చేశాడు. విల్సన్‌ కెమెరా బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలు ఫ్యాన్స్‌ను అలరిస్తాయి. ఇంటర్‌వెల్‌, క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్స్‌ సినిమాటిక్‌గా వుంటాయి. రతన్‌పూర్‌ కోట, ఊరు సెట్‌ వేసిన ఆర్ట్‌ పనితనం బాగుంది. గ్రాఫిక్స్‌ పలుచోట్ల కన్పిస్తాయి. గాల్లో ఎగరటాలు.. వాటర్‌ ఫాల్స్‌ అన్నీ గ్రాఫిక్స్‌ మాయాజాలమే.
 
విశ్లేషణ:
ఈ సినిమాలో పాయింట్‌ చాలా చిన్నది. రతన్‌పూర్‌ సంస్థానాధీశుల వారసురాలు కాజల్‌ చేసుకుని.. ఆ వంశానికి ఓ సామాన్యుడు రాజు కావడమేనేది పాయింట్‌. అందులోనూ అనాథైన.. సర్దార్‌.. పోలీసు పవర్‌తో ఎలా అయ్యాడు అన్నది మరో పాయింట్‌. మధ్యమధ్యలో పాటలు, యాక్షన్‌, డైలాగ్స్‌లు వెరసి ఈ సినిమా.. ఇందులో డాన్స్‌ పరంగా పవన్‌ కళ్యాణ్ చేసింది పెద్దగా వుండదు. తనకు వచ్చిన... తెలిసిన.. స్టెప్‌లు సింపుల్‌గా వేయడమే.... ఇవన్నీ అమితాబ్‌ను పోలివున్న స్టైల్స్‌. ఇక ఇదికాకుండా తన మేనరిజంతో... కుడిచేయి మెడ దగ్గర పెట్టుకుంటూ డైలాగ్‌లు కొట్టడం. ఇందులో బుర్రా సాయిమాధవ్‌.. రాసిన మాటలు సందర్భానుసారంగా వున్నాయి. ఇక్కడ గాలి, నీరు, భూమి, అన్నీ నా ఆధీనంలో వున్నాయంటూ అహంతో అన్న భైరవ్ సింగ్‌కు... ప్రతివాడూ భూమి నాదనుకుంటాడు.. చివరికి భూమే కలిపేసుకుంటుందంటూ.. కొన్ని డైలాగ్స్‌లు ప్రాసతో పాటు సందర్భానుసారంగా సాగుతాయి. 
 
చిన్నపాయింట్‌ను సాగదీసినా.. మొదటిభాగం సరదాగా సాగిపోతుంది. రెండో భాగంలో వచ్చే సన్నివేశాలు.. కథనం అంతా సినిమాటిక్‌గా చకచకా మారిపోతుంటాయి. దాంతో సినిమా తేలిపోయింది. ప్రేక్షకుడు ఫీల్‌ కాలేడు. ముందుగానే ఫ్యాన్స్‌కు అంకితమని చెప్పడంతో.. వారికి ఏవిధంగా నచ్చుతాయో అవన్నీ చేసి చూపించాడు. తుపాకులతో ఆటలాడుకుని రాక్షసుల్లాంటి రౌడీలను ఒకే ఒక్క పోలీసు ఆఫీసర్‌ ఎదుర్కోవడం సినిమాటిక్‌గా వుంటుంది. ఇక రాజకీయ రంగానికి చెందిన డైలాగ్స్‌ వున్నాయి... నేను ఒక్కడినే... ప్రజలు పిలిచినా పిలవకపోయినా.. ఆపదలో వుంటే వస్తా.. ఆదుకుంటానంటూ... ముఖేష్‌రుషి తనను ఆహ్వానిస్తున్నప్పుడు పలికే డైలాగ్‌లు.. పార్టీ డైలాగ్‌కు సింక్‌ అవుతాయి. 
 
 
ఇలా కాసేపు సరదాగా, కాసేపు సీరియస్‌గా సాగుతూ... ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడమే అంశంగా తీసుకుని పవన్‌ కళ్యాణ్‌ చేశాడు. ఇందులో దర్శకుడు బాబీ పనితనం ఎక్కడా కన్పించదు. గత సినిమాలోని అంత్యాక్షరి లాంటి ఎపిసోడ్‌ క్లైమాక్స్‌లో వస్తుంది. అందులో హీరోనే.. హిందీ, తెలుగు పాటలు పాడి.. ఎంటర్‌టైన్‌ చేస్తాడు. మొత్తంగా పిల్లల్ని, ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడం కోసమే పవన్‌ చేసిన సినిమా ఇది. మరి దీనికి సీక్వెల్‌గా వుందంటూ.. రాజా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌.. కంటెన్యూ అంటూ ముగింపు ఇస్తాడు. మరి ఈ సినిమా సక్సెస్‌తోనే ఆ సినిమా ఆధారపడి వుంటుంది. చూడాలి మరి పవన్ పవర్ ఏమిటో...? 
 
రేటింగ్‌: 3/5