గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (21:21 IST)

ఒకమ్మాయి కోసం ముగ్గురు పడే యాతన 'స్పీడున్నోడు'... రివ్యూ రిపోర్ట్

స్పీడున్నోడు నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్‌, సొనారిక బడోరియా, ప్రకాష్‌ రాజ్‌, శ్రీనివాసరెడ్డి, అలీ, పృథ్వీ, రమాప్రభ, రావు రమేష్‌ తదితరులు. సంగీతం : డిజే వసంత్‌, నిర్మాత : భీమనేని సునీత, దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు.
 
నిర్మాత కొడుకుగా 'అల్లుడు శీను'తోనే తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీను.. తొలి సినిమాతోనే డాన్స్‌, ఫైట్స్‌ బాగా చేయగలిగాడని పేరు తెచ్చుకున్నాడు. రెండో సినిమాను రీమేక్‌ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుతో తమిళ హిట్‌ సినిమా 'సుందర పాండ్యన్‌'ను తీసుకున్నారు. సొనారిక బడోరియా హీరోయిన్‌‌గా నటించగా, తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌‌లో కనిపించిన ఈ సినిమా ఏ మేరకు తీయగలిగారో చూద్దాం.
 
కథ :
కర్నూల్‌ జిల్లా రాప్తాడు నియోజగావర్గంలోని వెంకటాపురం, రామగిరి గ్రామాల మధ్య కథ జరుగుతుంది. ఇక అసలు కథలోకి వెళితే రామగిరి పంచాయితీ పెద్ద అయిన వీరభద్రప్ప(ప్రకాష్‌ రాజ్‌) కొడుకు శోభన్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌). డిగ్రీ పూర్తి నాలుగేళ్ళయినా ఎలాంటి పనీ లేకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తుంటాడు. అయితే ఫ్రెండ్స్‌ కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళడానికన్నా సిద్దమవుతాడు. అలా తన ఫ్రెండ్‌ అయిన గిరి(మధు) ఒకమ్మాయిని లవ్‌ చేస్తుంటాడు. 
 
వాసంతి (సోనారిక) అనే అమ్మాయిని కలిపే ప్రయత్నంలో తనే ఆ అమ్మాయి ప్రేమలో పడితపోతాడు. అయితే వాసంతికి.. శోభన్‌కూ మధ్య ప్రేమ ఇప్పటిదికాదు.. టెన్త్‌క్లాస్‌లోనూ వుంటుంది. కానీ అప్పుడు ఛీ కొడుతుంది. అయితే వాసంతిని ఆమె నాన్న బంధువైన జగన్‌(కబీర్‌ సింగ్‌ దుహాన్‌)కు ఇచ్చి చేయడానికి డిసైడ్‌ అయి శుభలేఖలు అచ్చువేయిస్తాడు. ఆ టైంలో ఓ గొడవలో వాసంతిని కాపాడేప్రయత్నంలో శోభన్‌ జైలుకు వెళతాడు. అయితే శోభన్‌, జగన్‌ కూడా చిన్ననాటి స్నేహితులే. చివరికి.. జైలు నుంచి వచ్చిన శోభన్‌.. తన తండ్రి సాయంతో వాసంతి నాన్నకు అసలు విషయం చెప్పి. పెండ్లికి సిద్ధం చేస్తాడు. ఇది తెలిసిన జగన్‌, మరో స్నేహితుడు మదన్‌ కలిసి.. శోభన్‌ను టార్గెట్‌ చేస్తారు. అదెలా? అనేది సినిమా. 
 
పెర్‌ఫార్మెన్స్‌:
బెల్లంకొండ శ్రీనివాస్‌ రెండవ సినిమాలో కూడా ఎనర్జిటిక్‌తో చేశాడు. డాన్సులు, ఫైట్లతోపాటు తమన్నాతో పాట బాగా స్టెప్‌లు వేశాడు. సొనారిక పల్లెటూరి అమ్మాయిలా లంగావోణీల్లో కనిపించి, పాటల్లో మాత్రం అల్ట్రా గ్లామరస్‌గా కనిపించి తన అందచందాలతో ఆకట్టుకుంది. నటనాపరంగా పరవాలేదనిపించుకుంది. స్నేహితులుగా శ్రీనివాస్‌ రెడ్డి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తూ మంచి సపోర్ట్‌ని ఇచ్చాడు. ఫ్రెండ్స్‌గా చేసిన మధు, శకలక శంకర్‌‌లు అక్కడక్కడా నవ్వించారు. చైతన్య కృష్ణ, కబీర్‌ దుహన్‌ సింగ్‌ లు నెగటివ్‌ షేడ్స్‌‌ని బాగా చూపించారు. కమెడియన్స్‌‌గా కనిపించిన పోసాని కృష్ణ మురళి, పృధ్వీరాజ్‌, అలీ, ఝాన్సీలు కూడా నవ్వించారు. హీరోహీరోయిన్ల తల్లిదండ్రులుగా ప్రకాష్‌ రాజ్‌, రావు రమేష్‌, పవిత్రా లోకేష్‌లు ఉన్న పాత్రలకి మంచి సపోర్ట్‌ ఇచ్చారు. పృథ్వీ కామెడీ పర్వాలేదు.
 
టెక్నికల్‌గా..
విజయ్‌ ఉలగనాథ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడికి కెమెరామెన్‌కు వున్న సాన్నిహిత్యం ప్రతి సీన్‌కుల వుపయోగపడేలా వుంటుందనేందుకు ఈ సినిమా ఉదాహరణ. డిజే వసంత్‌ అందించిన ట్యూన్స్‌ బాగున్నాయి. వాటిని పిక్చరైజ్‌ చేసిన విధానం ఇంకా బాగుంది. అలాగే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా సినిమాకి తగ్గట్టు ఉంది. మెయిన్‌‌గా సినిమా కథకి తగ్గట్టు సెట్స్‌ వేసిన కిరణ్‌ కుమార్‌ ఆర్ట్‌ వర్క్‌ బాగుంది. గౌతంరాజు ఎడిటింగ్‌ లో అక్కడక్కడా సాగదీసిన ఫీలింగ్‌ వస్తుంది. మెయిన్‌ గా ఫస్ట్‌ హాఫ్‌ మధ్యలో, సెకండాఫ్‌ మొదట్లో లాగ్‌ ఫీల్‌ ఎక్కువ ఉంటుంది. రవివర్మ కంపోజ్‌ చేసిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ బాగున్నాయి. రీమేక్‌ కాబట్టి తమిళ డైలాగ్స్‌లు నేటివిటీకి అనుగుణంగా ప్రవీణ్‌ వర్మ రాసిన డైలాగ్స్‌ బాగున్నాయి.
 
విశ్లేషణ:
టైటిల్‌కు తగినట్లే కథ రన్‌ స్పీడ్‌గా వుంటుంది. సినిమా ప్రారంభం చాలా సరదాగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్షిప్‌ మరియు లవ్‌ ట్రాక్‌తో సినిమాని వినోదంగా   నడిపించడం సినిమాకి హైలైట్‌. ఇకపోతే ఈ సినిమాకి ఇంటర్వెల్‌ బాంగ్‌ బాగుంటుంది. ఫస్ట్‌ హాఫ్‌లో ఎక్కువ భాగం ఫ్రెండ్‌ పాత్ర చేసిన శ్రీనివాస్‌ రెడ్డి, మధులు పంచ్‌ డైలాగ్స్‌‌తో నవ్విస్తారు. మరో వైపు ఇల్లరికపు అల్లుల్లుగా పోసాని కృష్ణమురళి, పృధ్వీరాజ్‌ లు అక్కడక్కడా నవ్వించారు.  స్నేహంపై చిత్రాలు వచ్చినా.. స్నేహంతో శత్రుత్వం ఇమిడి వుందనేదికూడా జాగ్రత్తగా గ్రహించాలని నీతి ఇందులో చెప్పాడు. తమిళలులు ఆలోచించిన విధంగా తెలుగులో ఆలా ఆలోచించి సినిమా తీయకపోవడం ఒకరకంగా మైనసే. 
 
రీమేక్‌ కనుక కొన్ని మార్పులు చేర్పులు చేశాం అని చెప్పినా.. కొన్ని సీన్లు.. యాజ్‌టీజ్‌గా తీసేశారు. ఎంచుకున్న నేటివిటీ పర్ఫెక్ట్‌ గా సెట్‌ కాలేదు. ఓ నీతి చెప్పాలంటే  కమర్షియల్‌ అంశాలను జత చేయడం ప్లస్‌గా భావించారు. కథనం పరంగా చూసుకుంటే.. ఫస్ట్‌ హాఫ్‌ కొద్ది సేపటి తర్వాత అక్కడక్కడా బోరింగ్‌‌గా ఉంటుంది, అలాగే సెకండాఫ్‌ మొదట్లో డ్రామా ఎక్కువై స్లో అనిపిస్తుంది. అందుక ఆయన కథనంలో రన్‌ టైంని తగ్గించి నేరేషన్‌ని స్పీడ్‌ చేసుంటే బాగుండేది.  ఈ సినిమాకు పతాక సన్నివేశం కీలకం. దాన్ని యతాతథంగా తీసేశాడు. అయితే.. లవ్‌ చేసేందుకు స్నేహితుల మధ్య వచ్చే మన్సర్థలు.. హత్యలు చేసుకునే వరకు వెళతాడు. ఒక అమ్మాయి కోసం ముగ్గురు ప్రేమికులు పడ్డ యాతనలే ఈ సినిమా కథ. దీన్ని తన దైన శైలిలో చెప్పి.. ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మాస్‌ను ఆకట్టుకునే అంశాలున్నాయి. ఓవరాల్‌గా ఓవరేజ్‌ సినిమా ఇది.
 
రేటింగ్‌: 2.5/5