శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 3 జులై 2015 (12:49 IST)

ఫర్వాలేదనిపించే 'ది బెల్స్‌'... రివ్యూ రిపోర్ట్

ది బెల్స్ నటీనటులు: రాహుల్‌, నేహా దేశ్‌పాండే, రవీంద్ర, సూర్య తదితరులు, కెమెరా: ఉదయ్‌, సంగీతం: కాసర్లశ్యామ్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, గోరేటి వెంకన్న, కాసర్లశ్యామ్‌, కూనాడి వాసుదేవరెడ్డి, రచన, మాటలు: శేఖర్‌ నిఖ్యాత్‌, నిర్మాత: వెంకటాచారి, దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌చంద్ర.
 
విడుదల: శుక్రవారం..3.7.2015
పాయింట్‌: జనం జాగృతి కోసం ఐదుగురు యువత పోరాటం
 
సినిమా అనగానే రొటీన్‌గా కొంత కథ, పాటలు, యాక్షన్‌, సెంటిమెంట్‌ అన్నీ మేళవించి వుంటాయి. వీటిని ఎవరైనా తీస్తారు. కానీ తెలంగాణ సెపరేట్‌ అయ్యాక... ఆ నిర్మాతలు కేవలం ఉద్యమం నేపథ్యంలో సాగే కథల్ని తీసుకుంటున్నారు. ప్రవీణ్‌చంద్ర మాత్రం గ్రామంలో పరిస్థితులు, పట్టణంలో పరిస్థితులు ఎలా వున్నాయో తెలియజెబుతూ.. యువతను ఎంకరేజ్‌ చేసే కథను పట్టుకున్నాడు. అయితే కథలో పాయింట్‌ కొత్తదేమీ కాదు.. పాత కథే. తను చెప్పదలచుకున్నది చెప్పాడు. అది ఏమిటో చూద్దాం.
 
కథ:
ఓ పోలీసు, లాయర్‌ చేసే అకృత్యాలను అజ్ఞాత వ్యక్తి వారి జీవితాలకు ముగింపు ఇస్తాడు. భరత్‌ (రాహుల్‌) ఆ పట్టణంలోనే వుంటాడు. కంప్యూటర్‌ సంస్థలో ఉద్యోగి. కస్టమర్ల ఫిర్యాదు మేరకు వెళ్ళి బాగుచేస్తుంటాడు. అలా ఓ ఇంటికి వెళ్ళి... ఆ ఇంటిలో వున్న నేహను చూసి ప్రేమించేస్తాడు. అయితే సమాజంలో జరిగే సంఘటనలకు జనాల్ని చైతన్యం చేసేందుకు తన నలుగురు స్నేహితులతో కలిసి మొదటి అక్షరం వచ్చేలా 'బెల్స్‌' అనే సంస్థను స్థాపిస్తాడు. 
 
మహిళపై జరిగే దౌర్జన్యాలు ఈ సంస్థకు ఫిర్యాదు చేస్తే టెక్నాలజీ ప్రకారం.. ఆ వివరాలన్నీ ఒకేసారి పోలీసు, అంబులెన్స్‌ వ్యవస్థకు చేరతాడు. అప్పుడు సమస్యను ఈజీగా పరిష్కరించవచ్చు అనేది వారి ప్లాన్‌. మరోవైపు.. సిటీలో అగ్గినాయుడు అనే రౌడీ అనుచరులు ఒక్కోరు చనిపోతుంటారు. అతన్ని పట్టుకునేందుకు స్పెషల్‌ ఆఫీసర్‌ రవీందర్‌ (సికింద్రాబాద్‌ మహంకాళి పోలీసు స్టేషన్‌లో ఒరిజినల్‌ పోలీసు) వస్తాడు. తన దర్యాప్తులో భరత్‌ ఇన్ని హత్యలకు కారకుడని తేలుతుంది. అయితే అతన్ని విచారిస్తుండగా బయట మరో హత్య జరుగుతుంది. భరత్‌ను రిలీజ్‌ చేస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
 
మన కోసం కాదు. జనం కోసం బతకాలనేది హీరో ఫిలాసఫీ. అందుకు చిన్నతనంలో తన తండ్రి పెంపకం కారణం. భూస్వామి అయిన ఆయన తండ్రి సూర్య 500 ఎకరాలు పేదలకు ఇచ్చేస్తాడు. ఆ పొలంపై అగ్గినాయుడు అనే రౌడీ కన్నేసి ఆక్రమించుకుంటాడు. ఎదురుతిరిగిన అందరన్నీ చంపేస్తాడు. బతికి బయటపడ్డ భరత్‌.. భగత్‌ అనే కవలలు వాడిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇదీ కథ... బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల నుంచి వస్తున్న కథలే... అయితే తెలంగాణ గ్రామంలో కూడా ఇలాంటి రౌడీలు వుండి ప్రజల్ని ఎలా పీడిస్తున్నారనేది చెప్పాడు దర్శకుడు. తను చెప్పే విధానంలో ఎక్కడా తొత్తురుపాటు పడలేదుకానీ.. కొన్ని లాజిక్కులు మిస్‌ అయ్యాడు... 
 
కంప్యూటర్‌ ఉద్యోగం చేసే భరత్‌కు.. ఓ ప్రాజెక్ట్‌ వస్తుందని బాస్‌ చెబుతాడు. వెంటనే.. కంప్యూటర్‌ రిపేర్‌ కోసం ఓ ఇంటికి వెళతాడు. హీరో చిన్నతనంలో ఆస్తి అంతా పోతుంది. కానీ పెద్దయి.. బెల్స్‌ అనే సంస్థను స్థాపిస్తాడు. అందుకు ఎలాంటి ఫండ్‌ ఎలా వచ్చిందో క్లారిటీ వుండదు. ఇలా లొసుగులు చాలా కన్పిస్తాయి. కానీ.. యువతను మేల్కొలిపే సన్నివేశాలు వున్నాయి. అమ్మాయిల ఫొటోలు కెమెరాల్లో రహస్యంగా తీసే కొంతమంది... అదే పరిస్థితి తన కుటుంబంలోని వారికి  వచ్చేసరికి కనువిప్పు కలుగుతుంది. ఈ విషయాన్ని చక్కగా చూపించాడు. ఇలా సమాజంలో జరిగే కొన్ని విషయాలను ఎత్తిచూపుతూ పరిష్కరించే పనిచేశాడు దర్శకుడు. దానికి సినిమాటిక్‌ ముగింపు ఇచ్చాడు. సందేశాన్ని ఇచ్చే ఈ సినిమా చిన్న చిత్రాల్లో పర్వాలేదనిపిస్తుంది. 
 
రేటింగ్‌: 2.5/5