Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఘాజీ ప్రీమియర్ టాక్ ఇదే.. బ్రిలియంట్ మూవీ.. 1971 ఇండో పాక్ వార్‌ను కళ్ళకు కట్టారు.. రానా యాక్టింగ్ అదుర్స్

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (15:58 IST)

Widgets Magazine

సినిమా పేరు : ఘాజీ
జానర్ : సబ్ మెరైన్ వార్ డ్రామా
తారాగణం : రానా, తాప్సీ, కేకే మీనన్, అతుల్ కులకర్ణి
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ది
రిలీజ్ డేట్‌: 17 ఫిబ్ర‌వ‌రి, 2017
నిర్మాతలు : అన్వేష్ రెడ్డి, వెంకట్రమణా రెడ్డి, ప్రసాద్ వి పొట్లూరి
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
 
లీడర్ సినిమాకు తర్వాత సోలోగా నిరూపించుకునేందుకు ఘాజీ మంచి ప్రయత్నమేనని చెప్పాలి. బాహుబలి భల్లాలదేవగా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ కొట్టేసిన రానా ఈ చిత్రంలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బాహుబ‌లి 2 ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుండ‌గా…ఈ గ్యాప్‌లో రానా స‌బ్ మెరైన్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఘాజీ సినిమాలో న‌టించాడు. స‌రికొత్త క‌థా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సినిమాకు రిలీజ్‌కు ముందే పాజిటివ్ బ‌జ్ కూడా వ‌చ్చేసింది. రెండు రోజుల ముందే ప్రీమియ‌ర్ షోలు వేసేశారు. సబ్ మెరైన్ వార్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం..
 
కథలోకి వెళ్తే: 1971లో భార‌త్‌-పాకిస్తాన్ యుద్ధ నేప‌థ్యంలో జ‌రిగిన వాస్త‌వ స్టోరీతో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ యుద్ధానికి ముందు వ‌ర‌కు ప్ర‌స్తుతం ఉన్న పాకిస్తాన్-బంగ్లాదేశ్‌లు క‌లిసే పాకిస్తాన్‌గా ఉన్నాయి. అప్పట్లో తూర్పు పాక్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఫ్రీడమ్ కోసం గొడవలు జరుగుతుంటాయి. ఆ సమయంలో వేలాదిమంది శరణార్థులు రక్షణ కోసం భారతదేశ సరిహద్దుకు చేరుకుంటారు. వారికి భారత్ సాయం చేస్తుందనే అపోహతో అక్కడి పరిస్థితులను ఆధీనంలో తెచ్చుకునేందుకు భారత్‌పై పగ తీర్చుకునేందుకు పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్ చేస్తుంది. 
 
ఈ క్రమంలో భార‌త్‌లోని ఓ ఓడ‌రేవు మీద ఎటాక్ చేసి భారత నావీ దృష్టి మళ్లించాలని ప్లాన్ చేస్తుంది. దీనిని గ‌మ‌నించిన భార‌త నావీ మ‌న దేశ స‌ముద్ర జ‌లాల్లో గ‌స్తీ కోసం ఎస్ 21 స‌బ్‌మెరైన్ పంపాల‌నుకుంటుంది. నావీ అధికారులు కమాండెంట్ ర‌ణ్‌విజ‌య్‌సింగ్ (కెకె మీన‌న్‌)తో పాటు లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ( రానా)ను పంపిస్తారు.
 
ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా పాకిస్తాన్ అత్యంత శ‌క్తివంత‌మైన ఘాజీ స‌బ్‌మెరైన్ పంపిస్తుంది. అది భార‌త స‌బ్‌మెరైన్ల క‌న్నా ఎన్నో రెట్లు శ‌క్తివంత‌మైంది. ఈ ఘాజీని ఎలా కమాండర్లు ఎదుర్కొంటారు. చివరికి ఎవరు గెలుస్తారు అనేది సినిమా. 
 
నటీనటులు :
దేశం కోసం యుద్ధం చేస్తున్నామనే ఆవేశం ఈ సినిమాలో నటించే నటుల్లో కనిుపిస్తుంది. కేకే మీన‌న్ రోల్ సినిమాకు పెద్ద ప్లస్. ఆవేశం, ఆలోచ‌న ఉన్న కెప్టెన్‌గా జీవించేశాడు. ఇక లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ పాత్రలో రానా అద్భుతంగా నటించాడు. దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధపడే సీనియర్ ఆఫీసరుగా అదరగొట్టేశాడు. ఇతర నటీనటులు పాత్రలకు న్యాయం చేశారు. 
 
విశ్లేష‌ణ :
యుద్ధాన్ని సినిమాగా చూపించి సక్సెస్ అయ్యారు. స‌బ్‌మెరైన్ క‌థ‌తో సాగే దీన్ని తెర‌కెక్కించ‌డం ఓ విధంగా పెద్ద సాహ‌సం లాంటిదే. ఈ సినిమా క‌థ కోసం ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్‌రెడ్డి ఎంత రీసెర్చ్ చేశారో సినిమాలో ప్ర‌తి సీన్ చెపుతోంది. సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న ద‌ర్శ‌కుడికి రాక‌పోవ‌డంతో సినిమాను ఎక్క‌డా ప‌ట్టు స‌డ‌ల‌కుండా చాలా గ్రిప్పింగ్‌గా తెర‌కెక్కించాడు. ఇందుకోసం కామెడీ సీన్లు, పాట‌లు ఎక్క‌డా ఇరికించ‌లేదు.
 
సినిమాలో 1971 నాటి ప‌రిస్థితుల‌ను చూపించేందుకు ప‌రిస‌రాలు, స‌బ్ మెరైన్ లోప‌ల ఇన్న‌ర్ వ్యూ, నావ‌ల్ ఆఫీస‌ర్లు వాడే లాంగ్వేజ్, పరికరాల విషయంలో దర్శకుడు కేర్ తీసుకున్నాడు. ఎడిటింగ్‌, ఆర్ట్ వ‌ర్క్‌, రీ రికార్డింగ్ ఈ సినిమాకు ప్లస్. కానీ మాస్‌ను ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోవచ్చు. క్లాస్ ప్రేక్షకులకు ఇది తప్పకుండా మంచి ట్రీట్ అవుతుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రుతిహాసన్ కాదు సంఘమిత్ర... చారిత్రాత్మక చిత్రానికి సై

టాలివుడ్, బాలివుడ్ ఏ చిత్రపరిశ్రమలో అయినా సరే చరిత్ర ప్రాధాన్యమున్న సినిమాలకు ఇప్పుడున్న ...

news

శంషాబాద్ వ‌ద్ద భారీ సెట్‌లో "బేవ‌ర్స్" ఫైట్ చిత్రీక‌ర‌ణ‌

ఎస్.క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'బేవర్స్' చిత్రం ...

news

ఈజీగా పీకేయడానికి నేనేం గడ్డిపోచని కాదు, గడ్డపారని.. దిగిపోద్ది.. 24న 'విన్నర్' రిలీజ్

పులికి ఎదురెళ్ళే ధైర్యం... పాతికమందిని మట్టుబెట్టే బలం... గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల ...

news

చివరి షెడ్యూల్ షూటింగ్‌లో నాగ అన్వేష్ "ఏంజెల్"

'మన్యంపులి' వంటి సూపర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాత 'సింధూర పువ్వు' కృష్ణా రెడ్డి ...

Widgets Magazine