శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శనివారం, 13 ఆగస్టు 2016 (14:35 IST)

'తిక్కతిక్క'గా ఉందిలే... 'తిక్క' రివ్యూ రిపోర్ట్

సాయిధరమ్‌ తేజ్‌.. మెగా ఫ్యామిలీ మేనల్లుడు. సినిమా అనగానే ఎక్కడలేని క్రేజ్. ఎస్‌ఎస్. థమన్‌ సంగీతం, శింబు, ధనుష్ పాటలు పాడారంటూ ప్రచారం... ఇవన్నీ మరింత క్రేజ్‌ తెచ్చేందుకు తోడ్పడ్డాయి. 'తిక్క' అని టైటిల్‌ పెట్టినప్పుడే... పవన్‌ కళ్యాణ్ గుర్తుకు వచ్చేశ

తిక్క నటీనటులు : సాయిధరమ్‌ తేజ్‌, లరిసా బొనాసి, రాజేంద్రప్రసాద్‌, రఘుబాబు, అలీ, ముమైత్‌ఖాన్‌, వెన్నెల కిశోర్‌, అజయ్‌, షిఫ్‌ వెంకట్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు; కెమెరా: గుహన్‌, సంగీతం: థమన్‌, నిర్మాత: డా. సి. రోహిన్‌ కుమార్‌ రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సునీల్‌ రెడ్డి.
 
సాయిధరమ్‌ తేజ్‌.. మెగా ఫ్యామిలీ మేనల్లుడు. సినిమా అనగానే ఎక్కడలేని క్రేజ్. ఎస్‌ఎస్. థమన్‌ సంగీతం, శింబు, ధనుష్ పాటలు పాడారంటూ ప్రచారం... ఇవన్నీ మరింత క్రేజ్‌ తెచ్చేందుకు తోడ్పడ్డాయి. 'తిక్క' అని టైటిల్‌ పెట్టినప్పుడే... పవన్‌ కళ్యాణ్ గుర్తుకు వచ్చేశారు. మరి ఆ తిక్కను ఓ డాక్టరైన రోహిన్‌ రెడ్డి  దాదాపు 20 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం.. అందుకు నిర్మాణ వాల్యూస్‌ బాగున్నట్లు.. ట్రైలర్స్‌, ఆడియో వేడుకలు కన్పిస్తున్నాయి. మరి ఇవన్నీ.. సినిమా విజయానికి దోహదపడ్డాయా? లేదా? అనేది చూడాలంటే ఈ చిత్రం లోపలికి వెళ్ళాల్సిందే.
 
కథ :
(ఏం చెప్పాలి... చూస్తేనే అర్థంకాలేదు.. సరే అర్థమయినంతలో చెప్పేస్తా..) ఆదిత్య(సాయిధరమ్‌ తేజ్‌) ఫుల్‌గా మందుబాబు, అమ్మాయిల్తో జాలీ చేస్తుంటాడు. భుజాన బ్యాగ్‌ వేసుకుని ఆఫీసుకు వెళుతుంటాడు. (ఏ ఆఫీసుకో అర్థంకాదు. సాఫ్ట్‌వేర్‌ బిల్డింగ్‌లా వుంటుంది. సినిమా మధ్యలో.. రియల్‌ ఎస్టేట్‌లో చేస్తున్నావని పోలీసు ఆఫీసర్‌ పోసాని గుర్తుచేస్తాడు). ఆదిత్య కోటీశ్వరుడు కూతురు అంజలి(లిసారే)ని ప్రేమించేస్తాడు. అప్పటికే వెన్నెల కిశోర్‌తో నిశ్చితార్థం కూడా అయినా.. ఆమెను తనవైపు లాగేసుకుంటాడు ఆదిత్య. ఓ సందర్భంలో ఆమె హర్టయ్యే పనిచేస్తే.. వెంటనే బ్రేకప్‌ చెప్పేసి.. ఆదిత్య ఇచ్చిన గిఫ్ట్‌లు అన్నీ ఓ బ్యాగ్‌లో పెట్టి ఓ చిట్టి కూడా అతని జేబులో పెట్టి ఆదిత్యను తిట్టేసి రాం..రాం.. అంటుంది. ఆ తర్వాత ఆదిత్య.. మందు, చిందులు ఎక్కువవుతాయి. అతనికి ఆఫీసులో ఫ్రెండ్స్‌తో పాటు తాగుబోతు రమేష్‌, సప్తగిరి వంటివారు కూడా తోడవుతారు. 
 
ఆదిత్య లవ్‌ బ్రేకప్‌ అయిందని తెలియగానే.. కొలీగ్ సంతోషిస్తాడు.. అంజలి ఇచ్చిన లెటర్‌ను తనే చదివి.. నిన్ను బాగా తిట్టిందని చెబుతాడు. ఇదిలావుండగా.. ఆద్యిత తండ్రి రాజేంద్రప్రసాద్‌.. ఇతనూ మందుబాబే. కొడుక్కు దూరంగా ఓ ఆశ్రమంలో వుంటాడు. కొన్నాళ్ళకు ఓ అమ్మాయితో బయటకు వచ్చి ఆదిత్యకు దగ్గరవుతాడు. ఈమె మీ పిన్ని అంటాడు. ఇంకోవైపు.. రఘుబాబు, అజయ్‌లు ఇద్దరూ రౌడీలు. అజయ్‌... రాజేంద్రప్రసాద్‌తో వచ్చిన అమ్మాయి కోసం వేటాడుతుంటాడు. రఘుబాబు.. మరో అమ్మాయి కోసం వేటాడుతుంటాడు. వీరిద్దరికి కావాల్సిన అమ్మాయిలు.. ఆదిత్య దగ్గరే వుంటారు. వారిని ఎలా అప్పగించాడు? ఆ తర్వాత ఏమయింది. మధ్యలో పోసాని పోలీసు పాత్ర ఏమిటి? అంజలి జేబులో పెట్టిన చిట్టీలో ఏముంది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్స్‌:
నటుడిగా.. సాయిధరమ్‌ తేజ్‌.. తన మామయ్య మేనరిజం లేకుండా చేసానని చెప్పాడు. అయితే.. బాడీలోనే ఆ జీన్స్‌ వుండటంతో ఏమి చేసినా.. వపన్ కళ్యాణ్‌నే గుర్తుకుతెస్తున్నాడు. అయితే.. ఈ చిత్రంలో కొద్దిగా మార్చాడు. నటన రొటీన్‌గానే వుంది. లిసారేకు.. పెద్దగా నటనలేని పాత్ర. కాజువల్‌గానే చేసేసింది. రఘుబాబు, అజయ్‌ పాత్రలు రొటీన్‌.. ముమైత్‌ ప్రేమ కోసం పరితపించే వాడిగా అలీ నవ్విస్తాడు. ఇలా మిగిలిన కొన్ని పాత్రలు వస్తూపోతూవుంటాయి.
 
టెక్నికల్‌గా...
సాంకేతికంగా చెప్పాల్సింది.. ఎస్‌ఎస్‌ థమన్‌.. ఈ చిత్రానికి ముందుగానే ట్యూన్స్‌ ఇచ్చేశాడని ప్రకటించాడు. చాలా సినిమాలకు ట్యూన్‌ ఇవ్వడం లేట్‌ అవుతుంది. తిక్కతిక్కగా వుందే.. అనే సాంగ్‌ మాస్‌ను అలరిస్తుంది. మిగిలిన పాటలు ఏమంత గుర్తుండవు. సాహిత్యం కూడా బాగోలేదు. కెమెరా పనితనం ఓకే. ఇక మాటలు ఏమంత బాగోలేవు. కథ,కథనం, దర్శకత్వం పూర్‌.
 
విశ్లేషణ
కళ్యాణ్‌ రామ్‌తో 'ఓమ్‌' అనే సినిమా చేసిన సునీల్‌రెడ్డి.. ఎట్టకేలకు సాయిధరమ్‌ తేజ్‌తో సినిమా చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్‌ అయ్యాడు. నిర్మాత కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తే.. తను రాసుకున్న కథ, కథనం ఇంత పేలవంగా వుంటాయని ఎవ్వరూ ఊహించరు. అసలు సినిమాలో ఒక్కో పాత్రకు ఇంకో పాత్రకు సంబంధం ఏమిటో అర్థంకాదు. అంతా గందరగోళంగా వుంటుంది.
హాలీవుడ్ హ్యాంగోవర్‌కు.. స్పూర్తిగా తీసుకుని చేసినట్లు తెలిసిందని హీరోను.. అడిగితే అదేంలేదు. ఆ సినిమా వేరు. ఇది వేరని ఇటీవలే సాయిధరమ్‌ తేజ్‌ వెల్లడించాడు. అయితే సినిమా చూశాక.. అందులో స్లాట్‌ను తెలుగులో తనకు తగినవిధంగా మార్చుకున్నాడు. ఎక్కువగా రాత్రిళ్ళు షూటింగ్‌, కార్లు ఛేజింగ్‌లు.. బ్లాస్ట్‌లు. ఎంతో ఖర్చుచేసిన ఈ సినిమాను చూస్తున్నంత సేపు ఏమి జరుగుతుందో అర్థంకాదు. ఓ సందర్భంలో సప్తగిరి హీరోతో.. నువ్వేమన్నా హీరోవా.. అంజలిని ఎలా బయటకు తెస్తావ్ అంటాడు.. దానికి.. నాకు తెలుసు.. నా లిమిట్స్‌ ఏమిటో.. అని హీరో సమాధానం చెబుతాడు.. ఏంటి.. రేయ్‌.. అనే ప్లాప్‌ సినిమా ఇచ్చి.. అంటూ కౌంటర్‌ వేస్తాడు.. అసలు ఈ డైలాగ్‌లు పెట్టాల్సిన అసవరం ఏముంది? అంటే ముందుగానే.. సినిమా గురించి తెలిసిపోయిందనుకుంట వారికి.. అందుకే.. ప్రేక్షకుల్ని బలి చేయడానికి ఇలాంటి హీరోలు.. నిర్మాతలు, దర్శకులు ఇండస్ట్రీని ఉద్దరించడానికి వచ్చినట్లున్నారు. కోట్లు పెట్టే నిర్మాతకు.. సినిమాపై అవగాహన లేకపోతే.. ఎలా వుంటుందనేది 'తిక్క' సినిమా నిదర్శనం. టైటిల్‌కు తగినట్లు.. నిజంగానే.. ఇది తిక్క సినిమా.. 
 
రేటింగ్: 1/5