గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pyr
Last Updated : శనివారం, 13 జూన్ 2015 (22:31 IST)

బాహుబలి విషయంలో ప్రభాస్ నాకు బూస్ట్ లా ఎనర్జీ ఇచ్చారు... రాజమౌళి

డార్లింగ్.. నువ్వు ఏం సినిమా తీస్తున్నావో తెలుసా... ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నావు. ఆ విషయం గుర్తు పెట్టుకో అంటూ హీరో ప్రభాస్ ఎప్పటికప్పుడు తనకు బూస్టులా ఎనర్జీ ఇచ్చాడని బాహుబలి దర్శకుడు రాజమౌళి తెలిపారు. షూటింగ్ కొనసాగుతున్నా ఏ మాత్రం విసుగు తెచ్చుకోకుండా రివర్స్ లో నన్నే ఉత్తేజపరచడం ఆయనలోని గొప్పతనమని ఆయన అన్నారు. 
 
తిరుపతిలో శనివారం సాయంత్రం ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు ఎంతో విసుగు వచ్చేదని అన్నారు. అలాంటి సందర్భాలలో తన భార్య మంచి సహకారం అందించారని చెప్పారు. అయితే ప్రభాస్ ఎక్కడా విసుక్కోకుండా ప్రతీ మారు మనం ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నామనే విషయం పదే పదే గుర్తు చేస్తూ అప్రమత్తం చేశారని తెలిపారు. 
 
సినిమాలో అన్ని అన్ని ప్రత్యేక పాత్రలేనని రాజమౌళీ అన్నారు. ఈ సినిమా కథ యేడాదిపాటు జరిగితే రెండేళ్లపాటు షూటింగ్ చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.