Widgets Magazine

దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ: మోహినీ అవతారంలో ఊరేగిన శ్రీవారు (Video)

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (15:01 IST)

mohini-avataram

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అఖిలాండ నాయకుడి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల ఐదో రోజున స్వామివారు మోహినీ అవతారంలో తిరుమాడ వీధుల్లో విహరించారు. పక్కనే దంతపు పల్లకీపై కృష్ణుడి రూపంలోనూ స్వామి దర్శనమిచ్చారు.

స్వామివారి రూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. దేవతలు, రాక్షసులు క్షీరసాగరం మథించి, అమృతం దక్కగా మాకు మా కని మథనపడేవేళ దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి అతిలోకమోహనమైన కన్యరూపం ధరించి దేవతలకు అమృతప్రదానం చేసిన జగన్మోహరూపమే మోహినీ అవతారం.
 
అలా శ్రీవారు మోహిని అవతారంలో భక్తులను కనువిందు చేశారు. ఈ వాహన సేవలో ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి మామూలుగా నిలబడే భంగిమంలో కాకుండా ఆసీనులై ఉంటారు. స్త్రీల ఆభరణాలతో స్వామిని అలంకరిస్తారు. పట్టుచీర, కిరీటంపైన రత్న ఖచితమైన సూర్యచంద్రసావేరి, నాసికకు వజ్రఖచితమైన ముక్కుపుడక, బులాకి, శంఖచక్రాల స్థానంలో రెండు వికసించిన స్వర్ణకమలాలను అలంకరిస్తారు. శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్‌ అలంకరించుకున్న పూలమాలను, చిలుకలు ఈ అవతారంలో స్వామికి అలంకరించడం మరో ప్రత్యేకత. 
 
ఇకపోతే.. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధవారం రోజు రాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. గరుడ సేవను తిలకించేందుకు భారీగా తరలివచ్చే భక్తుల కోసం తీతీదే అన్ని ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 7 గంటలకు గరుడ సేవ ప్రారంభం కానుంది. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

మోహినీ వాహనంపై సర్వేశ్వరుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఉదయం కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ...

news

ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమల కొండ కిట కిట..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటేనే ఒక పండుగ. అలాంటిది బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ అంటే ...

news

కోరిందల్లా ప్రసాదించే కల్పవక్షవాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి... (Video)

తిరుమల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ...

news

కోరిన కోర్కెలు తీర్చేందుకు కల్పవృక్ష వాహనంపై వేంచేసిన శ్రీవారు(video)

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు ...

Widgets Magazine