గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సినీ ఆవకాయ్
Written By pyr
Last Updated : శనివారం, 16 మే 2015 (11:32 IST)

చిత్రసీమ 60 శాతం చచ్చిపోయింది... ఆర్టిస్టులు అడుక్కు తింటున్నారు... పోసాని

తెలుగు చిత్రసీమ సగం చచ్చిపోయింది. కేరక్టర్ ఆర్టిస్టులు రోడ్లపై అడుక్కు తింటున్నారు. 250 సినిమాల స్థానంలో కేవలం 30 సినిమాలు మాత్రమే వస్తున్నాయి. హీరోలు సినిమాల సంఖ్య పెంచకపోతే దారుణం పరిస్థితులు చోటుచేసుకుంటాయని రచయిత, సినీ నటుడు పోసాని మురళి కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గురువారం రాత్రి జరిగిన 'జేమ్స్‌బాండ్' ఆడియో లాంచ్ ఫంక్షన్‌లో పోసాని మాట్లాడుతూ, ఒకప్పుడు ఏడాదికి దాదాపు 250 సినిమాలు చేసేవాళ్లు. సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 11 సినిమాల వరకు చేసేవారని గుర్తుచేశారు. కానీ హీరోగా వుండగానే ఆయన గౌరవంగా పక్కకు తప్పుకున్నారని, హీరోగానే మిగిలిపోయారని చెప్పారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఎక్కవు సినిమాల్లో నటించినంత మాత్రనా హీరో దమ్ము పోదని అన్నారు. ఏడాదికి 30 నుంచి 40 సినిమాలే వస్తున్నాయి. సినిమాలు 60% పడిపోయాయి. పెద్ద హీరోలు చాలామంది ఏడాదికి ఒక్క సినిమాతోనే సరిపెడుతున్నారు. 
 
చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు రోడ్డునపడి అడుక్కుంటున్నారు అని ఆవేదన వ్యక్తంచేశాడు. హీరోలు శ్రీకాంత్, నరేష్, నాని, సునీల్‌ల పేర్లు ప్రస్తావిస్తూ... మీరైనా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు తీసి సినిమా పరిశ్రమను బతికించాలని వేడుకున్నారు.