'ఐ లవ్‌ యూ' అని చెప్పినా కనికరించలేదు.. కిందపడేసి గుండెలపై కూర్చొని...

ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్ చదివే విద్యార్థినిని సహచర ఇంటర్ విద్యార్థి బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. తన వెంటబడి వేధిస్తూ వచ్చిన ఆ యువకుడు కిరాతక చర్యకు పూనుకుంటున్నాడని గ్రహించిన

pnr| Last Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (17:10 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్ చదివే విద్యార్థినిని సహచర ఇంటర్ విద్యార్థి బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. తన వెంటబడి వేధిస్తూ వచ్చిన ఆ యువకుడు కిరాతక చర్యకు పూనుకుంటున్నాడని గ్రహించిన ఆ విద్యార్థిని.. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు.. నిన్ను ప్రేమిస్తున్నా.. ఐ లవ్ యూ అంటూ వేడుకుంది. కానీ, ఆ కిరాతకుడు మాత్రం ఆ బాలిక గుండెలపై కూర్చొని బ్లేడుతో గొంతు కోసి చేసినట్టు ఆ
దుర్మార్గుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు.

హైదరాబాద్, అంబర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన హరిప్రకాష్‌ కుమార్తె అనే విద్యార్థిని హిమాయత్‌ నగర్‌లోని నారాయణ కాలేజీలో, పార్శిగుట్ట నివాసి వెంకట్‌ నారాయణ గూడలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నారు. పదో తరగతి నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకే బస్‌లో కాలేజీకి వెళ్లడంతోపాటు చాటింగ్‌ చేసుకునేవారు. వెంకట్‌ ఇటీవల వేరే అమ్మాయితో మాట్లాడటం అనూష చూసింది. అప్పటి నుంచి ఆమెకు అతడిపై అనుమానం పెరిగింది.

ఇన్‌స్ట్రాగ్రాంలో వేరే పేరుతో నకిలీ అకౌంట్‌ ఓపెన్‌ చేసి వెంకట్‌తో చాటింగ్‌ చేసింది. అతడు కూడా ఆమెతో చాలాసార్లు చాటింగ్‌ చేయడంతో అనూషకు అతడిపై ఉన్న అనుమానం బలపడిందన్నారు. అప్పటినుంచి అతడిని దూరం పెడుతూ వచ్చింది. వెంకట్‌ ఫోన్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టింది. పది రోజుల నుంచి ఇద్దరి మధ్య ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు లేవు. ఇది జీర్ణించుకోలేని అతడు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వీలుపడకపోవడంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆ తర్వాత అనూషను తీసుకుని ఆర్ట్స్‌ కళాశాల రైల్వేక్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆమెకు నచ్చజెప్పేందుకు అతడు ప్రయత్నించాడు. అయినా అతడి ప్రేమను తిరస్కరించడంతో ఆమెను కిందపడేసి గుండెలపై కూర్చొని బ్లేడ్‌తో గొంతు కోశాడు. అతడి ప్రవర్తన చూసి భయపడిన అనూష 'ఐ లవ్‌ యూ' అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడి నుంచి మరో గదిలోకి లాక్కెళ్లి మరలా గొంతు కోసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అనూష కేకలు విన్న కొందరు ఆ కిరాతకుడుని పట్టుకుని నిలదీయగా అనూషను చంపేసినట్టు చెప్పాడు. దీంతో ఆగ్రహానికిగురైన స్థానికులు చితకబాది పోలీసులకు సమాచారం అందించారు.దీనిపై మరింత చదవండి :