మానవత్వమా.. నీ చిరునామా ఎక్కడ? భార్య శవాన్ని భజాలపై మోసుకెళ్లిన భర్త... (వీడియో)

సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వ దావఖానాల్లో చనిపోయే తమ ఆప్తులను తరలించేందుకు ఆంబులెన్స్‌లు లేక తమ భుజాలపై మోసుకెళుతున్నారు. గతంలో భార్య శవాన్ని కొన్ని కిలోమీటర్ల మేరకు భర్త మోసుకెళ

wife deadbody
pnr| Last Updated: మంగళవారం, 8 మే 2018 (11:54 IST)
సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వ దావఖానాల్లో చనిపోయే తమ ఆప్తులను తరలించేందుకు ఆంబులెన్స్‌లు లేక తమ భుజాలపై మోసుకెళుతున్నారు. గతంలో శవాన్ని కొన్ని కిలోమీటర్ల మేరకు మోసుకెళ్లిన దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి.
 
ఇపుడు కూడా అచ్చం ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అది దేశంలోనే అదిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలోని బదౌన్‌లో ఓ ఆస్పత్రి సిబ్బంది మానవత్వం మరిచి ప్రవర్తించారు. భార్య శవాన్ని ఓ భర్త భుజాలపై మోసుకెళ్లాడు. 
 
మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 దీనిపై మరింత చదవండి :